Prithviraj Sukumaran: మెగాస్టార్ ఆఫర్స్‌నే తిరస్కరించిన పృథ్వీ రాజ్ సుకుమారన్ - 'ఆడు జీవితం' ప్రమోషన్‌లో స్టార్ హీరో కామెంట్స్
Prithviraj Sukumaran: మలయాళ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్ ఏకంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మూవీ ఆఫర్స్‌నే తిరస్కరించాడట. ఆయన లేటెస్ట్ మూవీ ఆడు జీవితం ప్రమోషన్స్ ఈ విషయాన్ని ఆయన బయటపెట్టారు.
Prithviraj Sukumaran Said He Rejected Chiranjeevi Offers: పృథ్వీ రాజ్ సుకుమారన్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. మలయాళ స్టార్ హీరో అయినా ఈయన డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కి దగ్గరయ్యారు. ఇటీవల సలార్ చిత్రంతో అలరించిన ఆయన ప్రస్తుతం తన పాన్ వరల్డ్ మూవీ 'ది గోట్ లైఫ్' మూవీ బిజీగా ఉన్నారు. తెలుగు ఈ చిత్రాన్ని 'ఆడు జీవితం' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. సర్వైవల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 28న థియేటర్లోకి రాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటడంతో మేకర్స్ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ఓ మీడియా చానల్‌కు పృథ్వీ రాజ్ సుకుమారన్ ఇంటర్య్వూ ఇచ్చారు.
ఈ సందర్భంగా 'ది గోట్ లైఫ్' వల్ల మెగాస్టార్ చిరంజీవి రెండు ఆఫర్లను తిరస్కరించాల్సి వచ్చిందన్నారు. ఈ మూవీ దాదాపు ఎనిమిదేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న టైంలో 2017లో చిరంజీవి గారు తన హిస్టారికల్ మూవీ 'సైరా నరసింహరెడ్డి'లో కీ రోల్ ఉంది, అది చేయాలి అని అడిగారు. ఆ ఇచ్చిన ఆఫర్ విని నేను చాలా ఎగ్జయిట్ అయ్యాను. నటించాలని ఆసక్తి ఉన్న చేయలేకపోయా. అప్పుడే ది గోట్ లైఫ్ మూవీ షూటింగ్ జరుగుతుంది. మేకర్స్ ఇచ్చిన కమిటిమెంట్ వల్ల చేయనని చెప్పాను" అని చెప్పుకొచ్చారు. అదే విధంగా 2019లో అదే సైరా నరసింహరెడ్డి మూవీ ప్రమోషన్స్‌కు ఆయన కేరళ వచ్చారు.
అప్పుడు కూడా ఆయన తన లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్‌లోనూ ఓ పాత్ర ఉంది చేయాలి అని ఆఫర్ ఇచ్చారు. 'ఆడు జీవితం' చిత్రంకి సంబంధించిన బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా గాడ్ ఫాదర్‌లోనూ నటించలేకపోయాను" అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా 'సైరా నరసింహరెడ్డి' మూవీ టైంలో పృథ్వీ రాజ్ సుకుమారన్ కీ రోల్ పోషిస్తున్నట్టు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. కానీ చివరకు ఆ రోల్లో తమిళ విలక్షణ నటుడు విజయ్‌సేతుపతి నటించారు. ఇక గాడ్ ఫాదర్‌లో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించారు. ఇలాంటి ప్రత్యేక పాత్రలు సైతం పృథ్వీ రాజ్ సుకుమారన్ ఆడు జీవితం కోసం వదులుకున్నారట. కాగా ఆడు జీవితం మూవీ రియల్ లైఫ్ సంఘటన ఆధారంగా తెరకెక్కింది.
1990లో జీవనోపాధి కోసం సౌదీకి వలస వెళ్లిన నజీబ్ అనే కేరళ యువకుడి జీవిత కథగా ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఏడారి దేశంకు వలస వెళ్లిన అతడు అక్కడ ఎన్ని కష్టాలు పడ్డాడు, అతడికి ఎదురైన సమస్యల చూట్టూ ఈ మూవీ సాగనుంది. పాస్ పోర్టులు లాక్కోవటం... బానిసలుగా మార్చుకోవటం... ఇమ్మిగ్రేషన్ కష్టాలు... ఎడారిలో బానిస బతుకు.... ఇలా ఓ వలస వ్యక్తి కష్టాలను మొత్తం ఆడు జీవితం పేరుతో వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. పూర్తిస్థాయిలో ఎడారిలో రూపొందిన తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాకు జాతీయ పురస్కారం అందుకున్న బ్లెస్సీ దర్శకత్వం వహించారు. దాదాపు 15ఏళ్ల నుంచి ఈ సినిమా రూపొందుతుంది. ఈ ఏడాది కాన్ చలన చిత్రోత్సవాల్లో సినిమా ప్రీమియర్ షోలు వేయాలని ప్లాన్ చేస్తున్నారు.