అన్వేషించండి

Kali Movie: ప్రిన్స్‌, నరేష్‌ అగస్త్య ప్రధాన పాత్రల్లో "కలి" మూవీ - రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన మూవీ టీం

Kali Movie Release Date: యంగ్‌ హీరోలు ప్రిన్స్‌, నరేష్‌ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మూవీ 'కలి'. శివ శేషు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను తాజాగా మూవీ టీం ప్రకటించింది.  

టాలీవుడ్‌ యంగ్‌ హీరోలు ప్రిన్స్‌, నరేష్‌ అగస్త్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'కలి'. శివ శేషు రచనతో పాటు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రముఖ కథా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థపై లీలా గౌతమ్‌ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార పోస్టర్స్‌ మూవీపై అంచనాలు పెంచుతున్నాయి. ఇక ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో కలి మూవీపై ఆడియన్స్‌ అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 4న గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సినిమా అంతా కలి పాత్ర చుట్టూ తిరుగుతుందట. సరికొత్త కంటెంట్‌తో వస్తు్న ఈ సినిమా ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ ఇస్తుందని ఈ సందర్భంగా మూవీ టీమ్ పేర్కొంది. కాగా ఈ సినిమాలో నేహా కృష్ణన్, గౌతన్ రాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, సివిఎల్ నరసింహారావు, మణిచందన, మధు మణి, త్రినాధలు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

టీజర్‌లో ట్విస్టులు

ఇటీవల విడుదలైన కలి టీజర్‌కు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇదోక ఫ్యామిలీ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని టీజర్‌ చూస్తే అర్థమైంది. 'అడిగేవాడు లేకపోయినా ఆఖరి కోరికగా చెబుతున్నా.. నెక్ట్స్ లైఫ్ ఉంటుందో లేదో తెలియదు.. ఉంటే మాత్రం మనిషిగా పుట్టకూడదు.. మంచితనంతో అస్సలు పుట్టకూడదు' అనే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. ఈ టీజర్‌ మొత్తం సస్పెన్స్‌, ట్విస్ట్‌లతో సాగుతూ ఉత్కంఠ పెంచింది. దీంతో కలి టీజర్‌ మూవీపై హైప్‌ క్రియేట్‌ చేసింది. ఇక ఈ సినిమా ప్రచార పోస్టర్స్‌, లుక్‌ పోస్టర్స్‌ కూడా మూవీపై అంచనాలు పెంచుతున్నాయి. 

ఈ సినిమా లీడ్‌ యాక్టర్ ప్రిన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పవనవసరం లేదు. 'నీకు నాకు డ్యాష్‌ డ్యాష్‌' మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత బస్‌స్టాప్‌ మూవీతో హిట్‌ అందుకున్నాడు. బన్నీ అండ్‌ చెర్రి, మరల తెలుపన ప్రియ వంటి చిత్రాల్లో హీరోగా చేసిన ప్రిన్స్‌కి పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో అతడు హీరోలకు ఫ్రెండ్‌గా సహాయక పాత్రలు చేస్తున్నాడు. ఇటీవల 'డిజే టిల్లు', 'టిల్లు స్క్వేర్‌' చిత్రాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడ కలి చిత్రంతో హీరోగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 

నరేష్‌ అగస్త్య గురించి

ఇక నరేష్‌ అగస్త్య ఇప్పుడిప్పుడే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇటీవల పరువు వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టాడు. జీ5లో విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌ ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ అందుకుంది. అంతకుముందు అగస్త్య సినపతి, మెన్‌టూ, కిస్మత్‌ వంటి చిత్రాల్లో లీడ్‌ రోల్‌ పోషించాడు. సినిమాల్లో కంటే ముందు అగస్త్య పలు సీరియల్లోనూ నటించాడు. ఇటీవల మత్తు వదలరా సినిమాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌తో పాటు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.  

టాప్ హెడ్ లైన్స్

Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget