అన్వేషించండి

NTR Neel Movie: 2 వేల మందితో భారీ యాక్షన్ సీక్వెన్స్ - ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కోసం ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదంతే!

NTR: ఎన్టీఆర్ నీల్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

NTR Neel Project Latest Update: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా నిమిషాల్లోనే ట్రెండ్ అవుతోంది. 

2 వేల మందితో భారీ యాక్షన్ సీక్వెన్స్ 

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండగా.. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం టీం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. తొలుత ఆర్ఎఫ్‌సీలో ఓ చిన్న షెడ్యూల్, ఆ తర్వాత కర్ణాటకలో ఇప్పుడు తాజాగా ఆర్ఎఫ్‌సీలో షూటింగ్ కొనసాగుతోంది. పీరియాడిక్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు దాదాపు 2 వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు.

స్పెషల్ సాంగ్‌లో ఆ బ్యూటీ

ఈ మూవీలో స్పెషల్ సాంగ్ ఉంటుందని తెలుస్తుండగా.. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక కనిపించనుందనే రూమర్స్ గతంలో వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో క్రేజీ రూమర్ హల్చల్ చేస్తోంది. ఈ స్పెషల్ సాంగ్‌లో కేతిక శర్మను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట ప్రశాంత్ నీల్. 'సింగిల్' సినిమాతో మంచి హిట్ అందుకున్న కేతిక.. ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ వస్తే మంచి ఆఫర్ కొట్టేసినట్లేనని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.

Also Read: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కామెడీ థ్రిల్లర్ 'ఒక యముడి ప్రేమకథ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

గ్లింప్స్ ఎప్పుడు?

ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ వస్తుందని ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. అదే రోజున ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ 'వార్ 2' టీజర్ రిలీజ్ చేయడంతో గ్లింప్స్ వాయిదా వేశారు. త్వరలోనే గ్లింప్స్ రిలీజ్ చేస్తామని ప్రకటించినా.. ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. 

ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన 'సప్త సాగరాలు దాటి' ఫేం రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, టి సిరీస్ ఫిలిమ్స్ ‌(గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్) సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై మీద నవీన్ ఎర్నేని, రవిశంకర్ ‌వై నిర్మిస్తున్నారు. రవిబ్రసూర్ సంగీతం అందిస్తున్నారు.  వచ్చే  ఏడాది జూన్ 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

టైటిల్ ఏంటి?

ఈ మూవీకి 'డ్రాగన్' అనే టైటిల్ ప్రచారంలో ఉండగా.. తాజాగా దాన్ని మారుస్తారనే ప్రచారం కూడా సాగింది. ఇటీవలే వచ్చిన తమిళ మూవీకి అదే పేరు ఉండడం.. దీన్ని తెలుగులో 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' పేరుతో డబ్ చేశారు. తమిళ మూవీ పేరుతో రిజిస్టర్ కావడం, లీగల్ ఇష్యూస్, ఫ్యాన్స్‌కు కన్ఫ్యూజన్ లేకుండా వేరే టైటిల్ పెడతారనే రూమర్స్ వస్తున్నాయి. మరి అదే టైటిల్ ఉంచుతారో.. టైటిల్ మారుస్తారో అనే దానిపై క్లారిటీ లేదు. ఈ అంశంపై దర్శక నిర్మాతలు ఇప్పటివరకూ స్పందించలేదు. త్వరలోనే గ్లింప్స్, టైటిల్‌పై ఫుల్ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Trimukha Movie Release Date: సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Tata Sierra Dealership: టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
Embed widget