Prabhas Project K: షూటింగ్‌కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్, దర్శకుడికి బర్త్‌డే విషెస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ షూటింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో ఆయన 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమాల్లో 'ప్రాజెక్ట్ కె' ఒకటి. సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతోంది. 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
ఏప్రిల్ నెలాఖరున హైదరాబాద్‌లో 'ప్రాజెక్ట్ కె' (Project K Movie) షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ మీద సోలో సీన్స్ తెరకెక్కించడానికి ప్లాన్ చేశారట. ఓ వారం పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
ఈ రోజు దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin Birthday) పుట్టినరోజు. ఈ సందర్భంగా "స్వీటెస్ట్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు హ్యాపీ బర్త్ డే. థాంక్స్ ఫర్ ప్రాజెక్ట్ కె. త్వరలో సెట్స్‌లో నిన్ను కలవడం కోసం ఎదురు చూస్తున్నాను" అని ప్రభాస్ పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ నటిస్తున్న 'ప్రాజెక్ట్ కె'లో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ సినిమాను నిర్మిస్తోంది.
Also Read: సివిల్ కోర్టు జడ్జ్ మీద కేసుకు వర్మ రెడీ - ఆర్జీవీ వర్సెస్ నట్టి కుమార్ గొడవలో కొత్త ట్విస్ట్
'ప్రాజెక్ట్ కె' షెడ్యూల్ కంప్లీట్ చేసిన తర్వాత 'సలార్' షూటింగ్ రీ - స్టార్ట్ చేయడానికి ప్రభాస్ ప్లాన్ చేశారు. 'రాధే శ్యామ్' విడుదల తర్వాత ప్రభాస్ రెస్ట్ మోడ్‌లో ఉన్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతి తర్వాత మళ్ళీ మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ 'సలార్' షూటింగ్ 30 శాతం కంప్లీట్ అయ్యింది. ఈ ఇయర్ ఎండింగ్ లోపు సినిమా మొత్తం కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Also Read: డీ గ్లామర్ రోల్‌లో కీర్తీ సురేష్ - టీజర్‌లో ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటే సినిమాలో ఎలా ఉంటుందో?
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.