అన్వేషించండి

విడుదలకు ముందే రూ.400 కోట్లు రాబట్టిన ‘ఆదిపురుష్’? - ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'ఆదిపురుష్' మూవీ రిలీజ్ కు ముందే రూ.432 కోట్లను రాబట్టినట్లు బాలీవుడ్ మీడియా ద్వారా వార్తలు వినిపిస్తున్నాయి.

పాన్ ఇండియా హీరో ప్రభాస్, కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మైథాలజికల్ మూవీ 'ఆదిపురుష్'. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. షూటింగ్ ముగించుకొని ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉన్న మూవీ టీం ఇటీవల సినిమా నుంచి ట్రైలర్ తో పాటు జైశ్రీరామ్ అనే లిరికల్ సాంగ్ ని విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇదిలా ఉంటే ఆదిపురుష్ రిలీజ్ కు ముందే బడ్జెట్లో దాదాపు 85% రికవరీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ మూవీకి నిర్మాతలు సుమారు రూ.500 కోట్ల బడ్జెట్ ని కేటాయించారు. అయితే సినిమా ఇంకా థియేటర్స్లోకి రాకముందే ఏకంగా రూ.432 కోట్లు రాబట్టినట్టు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

పాన్ ఇండియాలో లెవెల్ లో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా సాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, డిజిటల్ రైట్స్ మరియు ఇతర అనుబంధ హక్కులతో కూడిన నాన్ థియెట్రికల్ రైట్స్ మొత్తం రూ.247 కోట్లకు అమ్ముడయ్యాయి. దీంతోపాటు ఈ సినిమాకి సౌత్ థియేట్రికల్ రైట్స్ ద్వారా సుమారు రూ.185 కోట్లు వచ్చినట్లు చెబుతున్నారు. అలా నాన్ థియేట్రికల్, థియేట్రికల్ మొత్తం కలుపుకొని విడుదలకు ముందే ఈ సినిమాకి రూ. 432 కోట్లు రాబట్టినట్లు సమాచారం. కాగా ట్రేడ్ అంచనాల ప్రకారం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుపుకోవడం ఖాయమని అంటున్నారు. అంతేకాదు సినిమాకి ఓపెనింగ్స్ కూడా భారీగానే వచ్చే అవకాశం ఉంది. ఇక బాలీవుడ్ లో ప్రభాస్ కి ఉన్న మార్కెట్ దృష్ట్యా ఆదిపురుష్ విడుదలైన మూడు రోజులకే రూ.100 కోట్లు కొల్లగొట్టడం ఖాయమని అంటున్నారు అక్కడి ట్రేడ్ పండితులు. కేవలం హిందీ వెర్షన్ కే రూ.100 కోట్లు అంటే మిగతా భాషల్లో ఈ సినిమా అంతకుమించి వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని చెప్పవచ్చు.

సో ఎలా చూసుకున్నా ఆదిపురుష్ రిలీజ్ కు ముందే భారీ లాభాలను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక టి సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్ పై భూషణ్ కుమార్ ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, హనుమంతుని పాత్రలో దేవదత్త నగే నటిస్తున్నారు. ఇక జూన్ 6వ తేదీన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో కనీవిని ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నారు. నిర్మాతలు కేవలం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసమే కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారట. ఇప్పటివరకు ఏ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపని విధంగా ఆదిపురుష్ ఈవెంట్ ఉండబోతుందని అంటున్నారు. ఇక ఈవెంట్ కోసం ఏకంగా 200 మంది డాన్సర్లు 200 మంది సింగర్లను రంగంలోకి దింపబోతున్నారట. మొత్తంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తోనే సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేయబోతున్నారు మేకర్స్. ఇప్పటికే 'సాహో', 'రాదే శ్యామ్' వంటి ప్లాప్స్ తో సతమతమవుతున్న ప్రభాస్ కి 'ఆదిపురుష్' ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

Also Read: అలాంటి రోజు రావాలి - రూ.190 కోట్ల బంగ్లా కొనుగోలుపై ఊర్వశీ రౌతేలా తల్లి స్పందన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Embed widget