Sonu Sood: సోనూ సూద్‌కు పద్మ అవార్డు అందుకే రాలేదా? పూనమ్ కౌర్ ఘాటు వ్యాఖ్యలు
Sonu Sood: కోవిడ్ సమయంలో రియల్ హీరోగా మారి చాలామంది ప్రజలకు సొంత డబ్బుతో సాయం చేశారు సోనూ సూద్. అలాంటి వ్యక్తికి ఏ పద్మ అవార్డ్ రాలేదు. దీంతో పూనమ్ కౌర్ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Poonam Kaur about Sonu Sood: తాజాగా ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి పద్మ విభూషణ్ రావడంతో ప్రేక్షకులంతా అదే సంతోషంలో మునిగిపోయారు. ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ లభించింది. ఇక రాజకీయాల్లో ఆయన చేసిన ఎనలేని సేవలను గుర్తించి వెంకయ్య నాయుడికి కూడా పద్మ విభూషణ్‌ను ప్రకటించింది ప్రభుత్వం. కానీ ఏ స్వార్థం లేకుండా కష్టాల్లో ఉన్న ప్రజలకు సాయం చేసిన నటుడు సోనూ సూద్‌కు మాత్రం ఎలాంటి పద్మ పురస్కారం దక్కలేదు. ఈ విషయంలో తాజాగా హీరోయిన్ పూనమ్ కౌర్ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
మద్దతు ఇవ్వరు కాబట్టే..
హీరోయిన్ పూనమ్ కౌర్ తనకు నచ్చని విషయాన్ని ముక్కుసూటిగా చెప్పేస్తుంది. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతుందో వారి పేర్లు చెప్పకపోయినా.. చూసేవారికి అర్థమయ్యేలా ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇస్తుంది. ఇక తాజాగా సోనూ సూద్‌కు పద్మ పురస్కారం దక్కకపోవడంపై సోషల్ మీడియా వేదికగా పూనమ్.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘సోనూ సూద్ కూడా ప్రతిష్టాత్మకమైన అవార్డుకు అర్హుడే. కోవిడ్ సమయంలో ఆయన మానవత్వంతో ఎన్నో చేశారు. అయినా కూడా ఏ రాజకీయ ఐడియాలజీకి ఆయన మద్దతు ఇవ్వరు’ అని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చింది. ఈ హీరోయిన్ అన్న మాటలను బట్టి సోనూ సూద్.. ఏ పార్టీకి సపోర్ట్ చేయడు కాబట్టి తనకు పద్మ పురస్కారం దక్కలేదన్నమాట అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు.
కోవిడ్ సమయంలో సాయం చేసిన రియల్ హీరో..
కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో సోనూ సూద్ చేసిన సేవలను ఎవ్వరూ మరచిపోలేరు. ముఖ్యంగా వలస కార్మికులను తమ ప్రాంతాలకు చేర్చడానికి సోనూ సూద్ ఎంతో కష్టపడ్డారు. ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వకపోయినా.. ఎలాంటి సదుపాయాలు కల్పించకపోయినా.. తన సొంత డబ్బులతో ఎంతో చేశారు ఈ రియల్ హీరో. అందుకే తన చేత సాయం పొందినవారంతా తనను దేవుడిలాగా భావిస్తారు, భావిస్తున్నారు. అలాంటి రియల్ హీరోకు కనీసం పద్మశ్రీ దక్కకపోడంపై ఇప్పటికే పలువురు నిరాశ వ్యక్తం చేశారు. కానీ హీరోయిన్ పూనమ్ కౌర్ మాత్రం నేరుగానే రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేయకపోవడం వల్లే ఇలా జరిగిందని స్టేట్‌మెంట్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
రాజకీయాలకు దూరం..
ఏ రాజకీయ ప్రయోజనాలు లేకుండా ఎవరూ ప్రజలకు సాయం చేయరు అని చాలామంది ఫిక్స్ అయిపోయారు. అందుకే సోనూ సూద్.. అందరికీ సాయం చేస్తున్న సమయంలో కూడా తను త్వరలోనే రాజకీయాల్లోకి ఎంటర్ అవుతాడంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇదంతా రాజకీయ లాభాల కోసం తాను చేయడం లేదని, అసలు పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయ్యే ఆలోచనే తనకు లేదని సోనూ క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వకపోయినా పరవాలేదని.. తమ పార్టీల తరపున ప్రచారం చేయమని కూడా చాలామంది రాజకీయ నాయకులు ఆయనను కోరారు. అయినా కూడా సోనూ సూద్.. ఎవరి రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయలేదు. అలా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసిన వ్యక్తిని ఒక్క పురస్కారం కూడా దక్కలేదు.
Also Read: మళ్లీ సంక్రాంతే టార్గెట్, పోటీని లెక్కచేయని నాగార్జున - తర్వాతి మూవీపై కీలక అప్‌డేట్ ఇచ్చిన నాగ్