అన్వేషించండి

Poonam Dhillon: అర్షద్‌కు పూనమ్ వత్తాసు.. అతడు ఏ ఉద్దేశంతో అన్నాడో - మంచు విష్ణు లేఖపై స్పందన

‘కల్కి 2898 ఏడీ‘ మూవీలో ప్రభాస్ జోకర్ గా కనిపించాడంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఐఎన్‌టీఏఏ అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్ స్పందించారు.

Poonam Dhillon On Arshad Warsi's Joker Comments: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మీద బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ అభ్యంతర వ్యాఖ్యలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. ‘కల్కి 2898 ఏడీ‘ మూవీలో ప్రభాస్ ను జోకర్ గా మార్చారని ఆయన వ్యాఖ్యానించడాన్ని పలువు సినీతారలు తప్పుబట్టారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం సమంజసం కాదన్నారు. ఈ నేపథ్యంలోనే అర్షద్ వార్సీ కామెంట్స్ పై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(MAA) ప్రెసిడెంట్ మంచు విష్ణు రీసెంట్ గా రియాక్ట్ అయ్యారు. ప్రభాస్‌పై అర్షద్ వ్యాఖ్యలు తెలుగు సినీ అభిమానుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని వెల్లడించారు. ఈ మేరకు సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షురాలు పూనమ్ ధిల్లాన్‌ కు ఆయన లేఖ రాశారు. మరోసారి ఇలాంటి కామెంట్స్ పునరావృతం కాకుండా చూడాలని కోరారు. 

మంచు విష్ణు లేఖపై స్పందించిన పూనమ్ ధిల్లాన్

మంచు విష్ణు లేఖపై సీఐఎన్‌టీఏఏ అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్ స్పందించారు. ప్రభాస్ పై అర్షద్ వ్యక్తిగతంగా కామెంట్ చేశాడని భావించడం లేదని చెప్పారు. కేవలం ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ఆయన పాత్రను ఉద్దేశించి ఉండొచ్చని చెప్పారు. “బాలీవుడ్ నటుడు అర్షద్ చేసిన కామెంట్స్, ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ప్రభాస్ పాత్రకు సంబంధించి ఉంటాయని నేను భావిస్తున్నాను. వ్యక్తిగతంగా ప్రభాస్ ను కామెంట్ చేశారని అనుకోను. ఈ వ్యాఖ్యలు నిజంగా తెలుగు సినిమా పరిశ్రమలోని చాలా మందిలో కొంత అసహనం కలిగించి ఉంటాయి. సినిమా పరిశ్రమలో అందరూ ఐక్యంగా ఉండాలి. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోకూడదు. టాలీవుడ్‌ కు ఇబ్బందికరంగా మారిన అర్షద్ వ్యాఖ్యలను మరోసారి రిపీట్ కాకుండా చూసేలా ప్రయత్నం చేస్తాం. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తాం. ప్రభాస్ సినీ పరిశ్రమలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరు. అలాంటి వ్యక్తి పట్ల అర్షద్ ఇబ్బంది పెట్టే కామెంట్స్ చేస్తారని నేను నమ్మడం లేదు. అయినా, అర్షద్ నుంచి ఏం జరిగిందో తెలుసుకుంటాం” అని పూనమ్ వెల్లడించారు. 

అర్షద్ వార్సీ ఏమన్నారంటే?

రీసెంట్ గా ఓ టీవీ షోలో పాల్గొన్న అర్షద్ వార్సీ, తనకు ‘కల్కి 2898 ఏడీ’ సినిమా పెద్దగా నచ్చలేదని చెప్పారు. ఈ సినిమాలో ప్రభాస్ ను చూపించిన విధానంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో అతడిని ఓ జోకర్ లా చూపించారన్నారు. మేకర్స్ ఆయనను ఎందుకు అలా చూపించారో అర్థం కావట్లేదన్నారు. అదే సమయంలో అమితాబ్ బచ్చన్ పాత్రపై అర్షద్ ప్రశంసలు కురిపించారు. ఆయన క్యారెక్టర్ ను అద్భుతంగా తీర్చిదిద్దారని వెల్లడించారు. అర్షద్ వార్సీ కామెంట్స్ పై  తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నాని, సుధీర్ బాబు, సిద్ధు జొన్నలగడ్డ, అజయ్ భూపతి తీవ్రంగా స్పందించారు.   

Read Also: ప్ర‌భాస్ పై అర్షద్ వార్సీ కామెంట్స్... CINTAA అధ్య‌క్షురాలికి మంచు విష్ణు లేఖ

Read Also: జోకర్ కాదు, సక్సెస్ వెనుక స్ట్రాంగ్ పిల్లర్ - అర్షద్ వార్సీ కామెంట్స్‌పై డీజే టిల్లు ఫైర్

టాప్ హెడ్ లైన్స్

Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Embed widget