By: ABP Desam | Updated at : 11 Feb 2022 03:03 PM (IST)
మోహన్‌బాబును కలిసిన పేర్ని నాని
ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ( Perni Nani ) హైదరాబాద్‌లో మోహన్‌బాబుతో ( Mohan babu )సమావేశం అయ్యారు. గురువారం రోజు చిరంజీవి బృందం అమరావతికి వచ్చి సీఎం జగన్‌తో నిర్వహించిన చర్చల సారాంశాన్ని పేర్ని నాని మోహన్‌బాబుకు వివరించినట్లుగా తెలుస్తోంది. టిక్కెట్ రేట్లను ఖరారు చేసే ముందు మోహన్ బాబు అభిప్రాయాన్ని కూడా పేర్ని తెలుసుకుంటున్నట్లుగా భావిస్తున్నారు. టిక్కెట్ రేట్ల అంశంపై గతంలో మోహన్ బాబు స్పందించారు. సినీ పరిశ్రమ అంతా కలసికట్టుగా ఈ అంశం మాట్లాడాలని ఎవరు పడితే వారు స్పందించకూడదన్నారు. ఈ అంశం పూర్తిగా ఫిల్మ్ చాంబర్‌కు చెందినదని "మా" అధ్యక్షుడు, మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు ( Manchu Vishnu ) కూడా ప్రకటించారు.
It was an absolute pleasure hosting you at our home today Sri. Nani garu. Thank you for your initiative on the ticket pricing and also updating us on AP Government plans for TFI. Much thanks for protecting the interests of TFI 🙏 pic.twitter.com/szUsBTRCzJ
— Vishnu Manchu (@iVishnuManchu) February 11, 2022
అయితే చిరంజీవి బృందంతో పాటు మోహన్ బాబుకు ఆహ్వానం అందకపోవడతో మంచు విష్ణు అసంతృప్తితో ట్వీట్ చేసి డిలీట్ చేశారన్న ప్రచారం జరిగింది. అదే సమయంలో సీఎం జగన్‌తో జరిగిన చర్చల్లో ఫిలిం చాంబర్ ప్రతినిధులు కూడా ఎవరూ లేరు. ఈ క్రమంలో మోహన్‌బాబు అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా పేర్ని నాని హైదరాబాద్‌కు వచ్చినట్లుగా తెలుస్తోంది. నిజానికి టిక్కెట్ రేట్లపై ఎవరు ఎలాంటి అభిప్రాయాలు చెప్పాలనుకున్నా తనను కలవొచ్చని పేర్ని నాని చెబుతూంటారు. రామ్‌గోపాల్ వర్మకు (RGV ) అపాయింట్‌మెంట్ ఇచ్చి తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు.
అలాగే రెండు రోజుల కిందట మాట్లాడిన తమ్మారెడ్డి భరద్వాజను కూడా ఆయన అభిప్రాయాలు ఏమైనా ఉంటే నేరుగా తనకు తెలియచేయవచ్చన్నారు. కానీ పేర్ని నాని మోహన్ బాబు వద్దకు ప్రత్యేకంగా వచ్చి సినిమా టిక్కెట్ రేట్లపై అభిప్రాయాలు తెలుసుకోవడం రాజకీయ, సినీ ఇండస్ట్రీ ( FIlm Industry ) వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నేరుగా మోహన్ బాబును చిరంజీవి బృందంతో పాటు ఆహ్వానించి ఉండవచ్చు కదా అనే చర్చ టాలీవుడ్‌లో జరిగింది.
వైఎస్ఆర్‌సీపీతో అత్యంత సన్నిహితంగా ఉండే అలీ, పోసాని కృష్ణమురళితో పాటు నారాయణ మూర్తిని కూడా పిలిచి మోహన్ బాబును పిలవకపోవడం ఏమిటని కొంత మంది భావించారు. గత ఎన్నికలకు ముందు మోహన్ బాబు వైఎస్ఆర్‌సీపీలో చేరారు. అధికారికంగా ఆయన ఆ పార్టీ నేతే. అందుకే పేర్ని నాని ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి మోహన్ బాబుతో సమావేశం అయినట్లుగా తెలుస్తోంది. భేటీ అధికారికం కాకపోవడంతో సమావేశ వివరాలను వెల్లడిస్తారో లేదో స్పష్టత లేదు.
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Thalapathy 66: వంశీ పైడిపల్లి, విజయ్ తమిళ చిత్రం అప్డేట్, మరీ అంత త్వరగానా?
Mahesh Babu Proud Of Gautam: పదో తరగతి పూర్తి చేసిన కుమారుడు, జర్మనీలో మహేష్ అండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్
Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్
Suriya 41 Not Shelved: సినిమా ఆగలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హీరో సూర్య
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!
Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు