అన్వేషించండి

Pekamedalu: 50 రూపాయలకే ప్రీమియర్ షో టికెట్.. రేటు తగ్గించిన 'పేక మేడలు' టీమ్

pekamedalu premier show ticket rates: నిర్మాత రాకేష్‌ వర్రే బోల్డ్‌ నిర్ణయం తీసుకున్నారు. తమ మూవీ పేక మేడలు ప్రీమియర్‌ షోల టికెట్లు రేట్స్‌ను రూ.50కే అమ్ముతున్నట్టు తాజాగా టీం ప్రకటించింది. 

pekamedalu premier show ticket rates is rs 50 only: 'బాహుబలి' నటుడు రాకేష్‌ వర్రే (Rakesh Varre) నిర్మాతగా క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థపై నిర్మిస్తున్న చిత్రం 'పేక మేడలు' (Pekamedalu Movie). ఇది రాకేష్‌ వర్రే సొంత నిర్మాణ సంస్థ. తన సొంత నిర్మాణ సంస్థలోనే  రాకేష్‌ వర్రే హీరోగా 'ఎవరికీ చెప్పొద్దు' తీశాడు. ఈ చిత్రం విమర్శకల ప్రశంసలు అందుకుని మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఇదే నిర్మాణ సంస్థ తెరకెక్కుతున్న రెండవ సినిమాగా పేక మేడలు రాబోతోంది. ఈ సినిమాతో తొలిసారిగా తెలుగులో హీరోగా పరిచయం అవుతున్నాడు వినోద్ కిషన్.

గతంలో 'నా పేరు శివ', 'అంధగారం', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాల్లో నటించారు. అనూష కృష్ణ (Anusha Krishna) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా (Pekamedalu Movie Premier Show Ticket Rates)కి సంబంధించిన ట్రైలర్‌ ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. ఇందులో కామెడీతో పాటు మధ్యతరగతి ఫ్యామిలీ ఎమోషన్స్‌ని చాలా బాగా చూపించారు. ఉమెన్ ఎంపవర్మెంట్‌ని బేస్‌ చేసుకుని తీసిన సినిమా ఇది. గతంలో వినూత్న రీతిలో క్యూఆర్ స్కాన్ తో, బంతితో హీరో చేసిన ప్రమోషన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ఇక ఇప్పుడు అదే తరహాలో 'పేక మేడలు' మూవీ టీం ప్రమోషన్స్ స్టార్ట్‌ చేస్తుంది.

Pekamedalu Premier Show Ticket Rates:పెయిడ్‌ ప్రీమియర్స్ అంటూ టికెట్ రేట్‌  50 రూపాయలకే  పెట్టి వైజాగ్, విజయవాడ,హైదరాబాద్‌లో పలు ప్రదేశాల్లో ప్రత్యేక షోలు వేస్తుంది మూవీ టీం. కొత్తగా చేస్తున్న ఈ ప్రమోషన్స్ చూసి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు వచ్చి సినిమాని విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 19న పేక మెడలు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ నీలగిరి మామిళ్ల మాట్లాడుతూ.. సినిమా ట్రైలర్‌కి చాలా మంచి స్పందన లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు నిర్మాత రాకేష్ వర్రే చాలా సపోర్ట్ చేశారని,  సినిమాల్లో నటించిన నటీనటులందరూ బాగా సహకరించారన్నారు.

ప్రేక్షకులు కూడా తమ మూవీ ప్రమోషన్స్ బాగా ఆదరిస్తున్నారని, అదంతా చూస్తుంటే మా మూవీ మంచి విజయం సాధిస్తుందని నమ్మకం కలుగుతుందన్నారు. పేక మేడలు ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామన్నారు. కంటెంట్ ఉన్న సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారో తమ సినిమాని కూడా అలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నామన్నారు. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం మా టీం మొత్తం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. నీలగిరి మామిళ్ళ దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమాలో వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నటిస్తున్నారు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్‌లో రాకేష్‌ వర్రే నిర్మిస్తున్న పేక మేడలు చిత్రానికివరుణ్ బోర సహా నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. స్మరన్‌ సంగీతం అందిస్తున్నారు.  

Also Read: హైదరాబాద్‌లో 'వార్‌ 2' షూటింగ్‌ - యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్‌!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Embed widget