అన్వేషించండి

OG Pre Release Event: 'OG' ప్రీ రిలీజ్ ఈవెంట్... వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ - భారీ వర్షంలో బిగ్గెస్ట్ హిట్ షో

Pawan Kalyan: భారీ వర్షం... స్టేడియంలో వేలాది మంది అభిమానులు. అయినా ఒక్కరు కూడా ఇంచ్ కూడా కదల్లేదు కారణం వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్. 'OG' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సరికొత్త పవర్‌ను చూశారు ఫ్యాన్స్.

Pawan Kalyan Grace In OG Pre Release Event: పవర్ స్టార్ నిజంగా పవర్ స్టారే. అవును 'OG' ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ వర్షంలోనూ బిగ్ సక్సెస్ కావడం వెనుక ది వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ మాత్రమే ఉన్నారు. భారీ వర్షం పడుతున్నా వేలాది మంది అభిమానులు ఉన్న చోట నుంచి కదలలేదు అంటే కారణం పవన్ కల్యాణ్. గతంలో కంటే భిన్నంగా ఈవెంట్‌కు ఆయన ఎంట్రీ దగ్గర నుంచీ స్పీచ్, శివమణి డ్రమ్స్ మ్యూజిక్‌కు స్టెప్పులేయడం వరకూ అందరినీ సర్ ప్రైజ్ చేశాయి.

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఆదివారం 'OG' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు మూవీ టీం భారీగా ప్లాన్ చేసింది. అయితే, ముందు వర్షం పడే సూచనలు కనిపించినా ఆ తర్వాత అంతా రాదనే అనుకున్నారు. కానీ ఈవెంట్ సరిగ్గా స్టార్ట్ అయ్యే సమయానికి భారీ వర్షం ఇబ్బంది పెట్టింది. ఈ క్రమంలో అంతా ఆందోళనకు గురయ్యారు.

కత్తితో మాస్ ఎంట్రీ

ఇదే టైంలో ఈవెంట్‌లోకి 'OG' గ్రేస్‌కు తగ్గట్లు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కత్తితో మాస్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన్ను చూసిన ఫ్యాన్స్ ఉత్సాహంగా కేకలు, ఈలలతో హోరెత్తించారు. ఫ్యాన్స్ సందడితో స్టేడియం దద్దరిల్లిపోయింది. చుట్టూ కత్తి చూపిస్తూనే తన స్పీచ్ స్టార్ట్ చేశారు. స్టార్టింగ్‌లో 'వాషి యో వాషి' అంటూ జపనీస్ హైకూను ప్రారంభించారు. ఆ తర్వాత ఫ్యాన్స్‌ను ఉద్దేసించి అదిరిపోయే కామెంట్స్ చేశారు.

స్పీచ్ హైలైట్స్

'ఎప్పుడో 'ఖుషీ' మూవీ టైంలో ఇంత జోష్ చూశానని... మళ్లీ ఇప్పుడే చూస్తున్నట్లు పవన్ చెప్పారు. 'ఓజీ సినిమా కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. నేను పాలిటిక్స్‌లోకి వెళ్లినా నన్ను మీరు వదల్లేదు. పాలిటిక్స్‌లో ఉంటూ మూవీస్ చేస్తున్నానంటే దానికి మీరే కారణం. ఈ వర్షం కానీ ఏవీ మనల్ని ఆపలేవు.' అంటూ గొడుగులతో ఉన్న సెక్యూరిటీని కూడా ఆపేసి వర్షంలో తడుస్తూనే తన స్పీచ్ ముగించారు.

Also Read: రామ్ చరణ్, సుకుమార్ మూవీపై క్రేజీ అప్డేట్ - హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ?

స్టెప్పులతో అదరగొట్టిన పవన్

స్పీచ్ తర్వాత శివమణిని డ్రమ్స్ వాయించమని అడిగిన పవన్... ఆయన వాయిస్తుండగా అందుకు తగినట్లు స్టెప్పులు వేస్తూ అభిమానుల్లో జోష్ నింపారు. ట్రైలర్ ఇంకా రెడీ కాలేదంటూ డైరెక్టర్ సుజీత్ చెప్పినా... బిగ్ షాట్స్ లేకపోయినా పర్వాలేదు ఫ్యాన్స్ కోసం ట్రైలర్ వేయాల్సిందే అంటూ పట్టుబట్టారు. పవన్ స్టేజీ మీద నుంచి వెళ్లేంత వరకూ వర్షాన్ని మూవీ టీంతో పాటు ఫ్యాన్స్ కూడా లెక్క చేయలేదు. ఒంటి చేత్తోనే పవన్ ఈవెంట్‌ను బిగ్ సక్సెస్ చేశారు. 

వర్షం పడడంతో తమన్ లైవ్ పెర్ఫార్మెన్స్ సాధ్యం కాలేదు. చాలామంది ప్రముఖులు మాట్లాడడం కుదరలేదు. అయినా పవన్ ఒక్కరే తన స్పీచ్, జోష్‌తో మూవీ టీంలోనూ జోష్ నింపారు. చాలా రోజుల తర్వాత పవన్‌ను కొత్తగా చూశామంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. దటీజ్ పవన్ కల్యాణ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ట్రైలర్ ఎప్పుడు?

ఈవెంట్ బిగ్ సక్సెస్ అయినా అభిమానుల్లో కొంత నిరాశ మిగిలిపోయింది. అఫీషియల్ ట్రైలర్ ఇంకా రిలీజ్ కాకపోవడంపై ఫ్యాన్స్ నెట్టింట తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మూవీ రిలీజ్‌కు ఇంకా 2 రోజులే ఉండడం... ఇప్పటివరకూ ట్రైలర్ రిలీజ్ కాకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పెద్ద సినిమాలు అదీ పవర్ స్టార్ వంటి బిగ్ స్టార్ విషయంలో ఇలా చేయడం ఏంటని అంటున్నారు. త్వరగా ట్రైలర్ రిలీజ్ చేయాలంటూ పోస్టులు పెడుతున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
Srinivasa Mangapuram Twitter Review - శ్రీనివాస మంగాపురం ట్విట్టర్ రివ్యూ: మహేష్ అన్న కొడుక్కి మొదటి సినిమాతో ఫ్లాప్ తప్పదా?
శ్రీనివాస మంగాపురం ట్విట్టర్ రివ్యూ: మహేష్ అన్న కొడుక్కి మొదటి సినిమాతో ఫ్లాప్ తప్పదా?
Sonu Sood Reaction : ఆ మాట అని ఉంటే చాలా సిగ్గుచేటు - కంగనా కామెంట్స్ సోనూ సూద్ రియాక్షన్
ఆ మాట అని ఉంటే చాలా సిగ్గుచేటు - కంగనా కామెంట్స్ సోనూ సూద్ రియాక్షన్
Azadi 501 Series OTT : ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామ్ స్టోరీ - 6 ఎపిసోడ్స్‌తో 'ఆజాదీ 501' సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామ్ స్టోరీ - 6 ఎపిసోడ్స్‌తో 'ఆజాదీ 501' సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget