By: ABP Desam | Updated at : 15 Apr 2023 10:26 PM (IST)
పవన్ కళ్యాణ్, సుజీత్ సినిమా అప్డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా 'సాహో' ఫేమ్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'ఓజీ - ఒరిజినల్ గ్యాంగ్ స్టర్' (They Call Him OG). డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. శ్రీమతి పార్వతి చిత్ర సమర్పకురాలు.
'ఆర్ఆర్ఆర్' (RRR Movie) తర్వాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రమిది. ఈ రోజు ముంబైలో చిత్రీకరణ ప్రారంభించారు. అయితే, పవన్ కళ్యాణ్ అందులో జాయిన్ కాలేదు. ఈ వారం తర్వాత ఆయన ముంబై వెళతారని తెలిపారు. ఈ సందర్భంగా ఓ వీడియో విడుదల చేశారు. అది చూస్తే... కొన్ని విషయాలు అర్థం అవుతాయి.
పదిహేను సార్లు క్లైమాక్స్ మార్చిన సుజీత్!
షూటింగ్ మొదలైన సందర్భంగా విడుదల చేసిన వీడియోలో క్లైమాక్స్ గురించి సుజీత్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. నోటితో నేరుగా ఏదీ చెప్పలేదు. కానీ, వీడియో మీద ఓ లుక్ వేస్తే... క్లైమాక్స్ కోసం చాలా డ్రాఫ్ట్స్ రాసినట్టు ఈజీగా అర్థమైంది. 'క్లైమాక్స్ 15' అని రాసి, చివరకు దాన్ని చెత్తబుట్టలో పడేశారు. అంటే... 15 సార్లు క్లైమాక్స్ చేంజ్ చేశారన్నమాట. చివరకు, 16వ క్లైమాక్స్ ఓకే చేసినట్టు తెలుస్తోంది.
ముంబైలో సీన్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ!
వీడియో ప్రారంభంలో ఓ సీన్ పేపర్ వస్తుంది. ఒక ప్రయివేట్ పోర్టులో, ఒక పెద్ద ఐరన్ గేటు ముందు, పోర్టులో ఎంటర్ అయ్యే దారిలో వందల మంది గన్నులతో నిలబడతారు. అందులో ఇద్దరి పేర్లు డంగి, ఫైజల్! ఇక్కడికి రావాలని అనుకుంటే వాడి కంటే మూర్ఖుడు ఉండదని డంగి అంటాడు.
Also Read : ఆ పబ్‌లో తెలుగు పాటలే వినబడతాయ్ - వర్మ మెచ్చిన బీర్ టెయిల్
బుల్లెట్ సౌండ్ వినిపించడంతో డంగి, ఫైజల్... ఇద్దరూ వెనక్కి తిరిగి చూస్తారు. వాళ్ళ ముందు ఓ స్మోక్ బాంబ్ పడుతుంది. ఆ పొగ లోంచి ఓ మనిషి రూపం కనబడుతుంది. నల్ల మబ్బులు కమ్మిన ఆకాశం లోనుంచి ఓ మెరుపు వచ్చినట్లు వస్తాడు. ఇదీ సీన్! ముంబైలో హీరో ఇంట్రడక్షన్ అనుకుంట! ఇది పవర్ స్టార్ అభిమానులకు కిక్ ఇచ్చేలా ఉంది.
వీడియోలో వినిపించిన తమన్ సంగీతం సైతం సూపర్ ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకునే అంశాలు అన్నీ సినిమాలో ఉన్నట్టు అర్థం అవుతోంది. ముఖ్యంగా సుజీత్ ఈ వీడియోను తీసిన విధానం చాలా మందిని ఆకట్టుకుంది. బాల్ బాంబ్ కావడం, పెన్సిల్స్ బుల్లెట్స్ అవ్వడం, స్కేల్ జపనీస్ స్వార్డ్ కింద మారడం చూస్తుంటే... సినిమాలో ఎన్ని ఫైట్స్ ఉన్నాయనేది, పవన్ కళ్యాణ్ ఎన్ని వెపన్స్ వాడతారనేది ఈజీగా అర్థం అవుతోంది.
Also Read : ప్రభాస్ ఫ్యాన్స్‌ను భయపెట్టిన 'శాకుంతలం' - 'ఆదిపురుష్' ఎలా ఉంటుందో?
సినిమా అనౌన్స్ చేసినప్పుడు విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్, దాని మీద క్యాప్షన్ గుర్తు ఉందా? 'ఆయన్ను ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటారు' (They Call Him OG) అని పేర్కొన్నారు. ఇప్పుడు దానినే టైటిల్ కింద ఫిక్స్ చేశారని సమాచారం. 'ఓజీ - గ్యాంగ్ స్టర్' టైటిల్ రిజిస్టర్ చేయించింది డీవీవీ సంస్థ. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో OG టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఇది పాన్ ఇండియా రిలీజ్ కోసం అన్నమాట.
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!
మాస్ లుక్లో మహేష్, ప్రభాస్తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!
అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం
ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల
Telangana New Party : తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?
కేశినేని నానీ, ఏందయ్యా నీ బిల్డప్, సోది ఆపు: పీవీపీ
Rahul US Visit: హలో మిస్టర్ మోడీ, ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ కౌంటర్
Welcome Banners Minister KTR: విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వస్తున్న కేటీఆర్- ఓఆర్ఆర్ పై వెలసిన స్వాగత బ్యానర్లు