అన్వేషించండి

OG Censor: 'ఓజీ' సెన్సార్ పూర్తి... కట్ చేసిన సీన్స్ లిస్ట్ ఇదిగో... 'మగధీర' తర్వాత మెగా మూవీకి 'ఏ'?

OG Censor Certificate: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' సెన్సార్ పూర్తి అయ్యింది. ఈ సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ బోర్డు కత్తెర వేసిన సీన్స్ లిస్ట్, ఇంకా ఇతర డీటెయిల్స్ తెలుసుకోండి.

Pawan Kalyan's OG censor board cut scenes list: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'ఓజీ'. సెప్టెంబర్ 24వ తేదీన పెయిడ్ ప్రీమియర్ షోలతో సినిమా విడుదల కానుంది. ఆ మర్నాడు (సెప్టెంబర్ 25వ తేదీన) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సోమవారం సినిమా సెన్సార్ పూర్తి అయ్యింది. ఈ సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ లభించింది. మరి, ఇందులో ఏ సీన్లకు సెన్సార్ బోర్డు కత్తెర వేసిందో తెలుసా?

'ఓజీ'లో కట్ చేసిన సీన్లు ఇవే!
'ఓజీ' ట్రైలర్ చూస్తే భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని సులభంగా అర్థం అవుతోంది. సినిమాలో వయలెన్స్ ఒక రేంజ్‌లో ఉందట. ఇప్పుడు ఆ హింసకు కొంత కత్తెర పడింది. ఫస్టాఫ్‌లో ఒక చెయ్యిని నరికే సన్నివేశం, అలాగే తలను నరికే సన్నివేశం తీసేయమని సెన్సార్ బోర్డు పేర్కొంది. ఆ సన్నివేశాలను రీప్లేస్ చేశారు.

లాడ్జ్ నేపథ్యంలో 'ఓజీ'లో ఒక సీన్ ఉంది. అందులో క్లోజప్ సీన్స్ తీసేయమని 'ఓజీ' బృందాన్ని సెన్సార్ బోర్డు ఆదేశించింది. దాంతో అక్కడ మార్పులు చేశారు. మూవీ ఇంటర్వెల్ ముందు సుమారు నిమిషం నిడివి ఉన్న సీన్స్ తొలగించారు.

రక్తపు మడుగులో చిన్నారి... లేదు!
'ఓజీ' సెకండాఫ్ విషయానికి వస్తే.., రక్తపు మడుగులో ఒక చిన్నారి ఉందట. ఆ సీన్ మార్చమని సెన్సార్ చెప్పడంతో మార్పులు - చేర్పులు చేసింది చిత్ర బృందం. ఓ పోలీస్ అధికారి జిప్ ఓపెన్ చేసే సన్నివేశంలో సైతం మార్పులు చేశారు. ఇంటర్వెల్ తర్వాత సుమారు 40 సెకన్ల హింసాత్మక సన్నివేశాలకు కత్తెర వేశారు. దాంతో టోటల్ 1.55 నిమిషాల సీన్లకు కత్తెర పడింది.

Also Readపవన్ పాడిన జపనీస్ హైకూ అర్థం ఏమిటో తెలుసుకోండి... 'వాషి యో వాషి' లిరిక్స్ మీనింగ్ తెలుసా?

సెన్సార్ కోసం 'ఓజీ' చిత్ర బృందం 156.10 నిమిషాల సినిమాను సబ్మిట్ చేసింది. కట్స్ తర్వాత 154.15 నిమిషాలు వచ్చింది. సో... మూవీ రన్ టైమ్ రెండున్నర గంటలు అన్నమాట. యాక్షన్ సీన్స్, వయలెన్స్ వల్ల సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ వచ్చిందని సమాచారం.
OG Censor: 'ఓజీ' సెన్సార్ పూర్తి... కట్ చేసిన సీన్స్ లిస్ట్ ఇదిగో... 'మగధీర' తర్వాత మెగా మూవీకి 'ఏ'?

పదహారేళ్ళ తర్వాత మెగా మూవీకి 'ఏ'!
పవన్ కళ్యాణ్ సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ రావడం అనేది చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన సినిమాకు యు లేదా యు/ఏ సర్టిఫికెట్ రావడం కామన్. సో, లాస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ లేదా మెగా ఫ్యామిలీలో హీరోలు నటించిన సినిమాలకు ఎప్పుడు 'ఏ' సర్టిఫికెట్ వచ్చింది? అనేది చూస్తే... రామ్ చరణ్ హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన 'మగధీర'కు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మెగా ఫ్యామిలీ మూవీకి 'ఏ' సర్టిఫికెట్ రావడం ఇదేనని అంటున్నారు.

Also Readమనల్ని ఎవడ్రా ఆపేది... వర్షంలోనూ ఎల్బీ స్టేడియాన్ని వీడని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్!


పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించిన 'ఓజీ'కి సుజీత్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేశారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, తమిళ నటుడు అర్జున్ దాస్, నటి శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 

టాప్ హెడ్ లైన్స్

Thanuja Puttaswamy: బిగ్ బాస్ తనూజకు బంపరాఫర్... కిరణ్ అబ్బవరం నిర్మాతగా క్రేజీ సినిమా
బిగ్ బాస్ తనూజకు బంపరాఫర్... కిరణ్ అబ్బవరం నిర్మాతగా క్రేజీ సినిమా
Bethlehem Kudumba Unit: తెలుగులోకి 15 రోజులు లేటుగా... Vishwanath And Sons తర్వాత మమితా బైజు ఖాతాలో మరో హిట్
తెలుగులోకి 15 రోజులు లేటుగా... Vishwanath And Sons తర్వాత మమితా బైజు ఖాతాలో మరో హిట్
Crime Thriller OTT : ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - వారణాసి విలన్ కొత్త మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - వారణాసి విలన్ కొత్త మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Ramba Oorvasi Menaka Trailer : బోయపాటి స్టైల్ To పవన్ కల్యాణ్ OG డైలాగ్ - అల్లరి నరేశ్ రంభ ఊర్వశి మేనక ట్రైలర్ నవ్వులే నవ్వులు
బోయపాటి స్టైల్ To పవన్ కల్యాణ్ OG డైలాగ్ - అల్లరి నరేశ్ రంభ ఊర్వశి మేనక ట్రైలర్ నవ్వులే నవ్వులు

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Cabinet Meeting Absence: సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
Electoral Roll Special Revision: భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
Pratibha Takadapally:
"పతకాలు సాధించినప్పుడు ఏమైపోయారు? క్రీడామంత్రిత్వ శాఖ బెదిరింపులు నిజం" ప్రతిభా తకడపల్లి హాట్‌కామెంట్స్
Karumuri Remand: ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
Konda Surekha BC Card: బీసీ కార్డ్‌తో కొండా సురేఖ ఎదురుదాడి - సీఎం రేవంత్ చర్యలు తీసుకోగలరా!?
బీసీ కార్డ్‌తో కొండా సురేఖ ఎదురుదాడి - సీఎం రేవంత్ చర్యలు తీసుకోగలరా!?
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 vs ట్రయంఫ్ స్పీడ్ 400: మీకు సరిగ్గా సరిపోయే బైక్ ఏది?
హంటర్ 350 vs స్పీడ్ 400.. రూ.63,000 డిఫరెన్స్‌! పవర్, ఫీచర్లు, బ్రేకుల్లో ఏ బైక్‌ బెస్ట్‌?
India Out Of Hockey World Cup: అర్జెంటీనా చేతిలో భారత్‌ ప‌రాజ‌యం.. వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి ఔట్, వ‌రుస‌గా మూడో ఓటమితో ఇంటికి!
అర్జెంటీనా చేతిలో భారత్‌ ప‌రాజ‌యం.. వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి ఔట్, వ‌రుస‌గా మూడో ఓటమితో ఇంటికి!
Bethlehem Kudumba Unit: తెలుగులోకి 15 రోజులు లేటుగా... Vishwanath And Sons తర్వాత మమితా బైజు ఖాతాలో మరో హిట్
తెలుగులోకి 15 రోజులు లేటుగా... Vishwanath And Sons తర్వాత మమితా బైజు ఖాతాలో మరో హిట్
Embed widget