అన్వేషించండి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాల్లోనూ ఇంతే... మంచితనం, ప్రజలను ప్రేమించే గుణం ఎవరెస్టు అంత!

రాజకీయాల్లోకి మైలేజీకి మంచి పనులు చేయడం మొదలు పెట్టే నాయకులు కొంత మంది ఉంటారు. పవన్ కళ్యాణ్ అలా కాదు... ముందు నుంచి ఆయన సేవ చేశారు. ఇవాళ జనసేనానిగా ఎదిగారు.

మనిషిలో నలుసంతైనా మంచితనం లేకపోతే ఇంత మంది ఎందుకు ప్రేమిస్తారు! - జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి 'కాటమరాయుడు' ప్రీ రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మాట. ఆయన మాటల్లో లోతైన భావం ఉంది. పవన్ వ్యక్తిత్వం దాగి ఉంది. పవన్ (Pawan Kalyan)లో మంచితనం నలుసంత కాదు, ప్రజలను ప్రేమించే గుణం ఎవరెస్టు శిఖరం అంత! ఆయనకు ప్రజలపై, అభిమానులపై ప్రేమ లేకపోతే... సమాజానికి ఏదో సేవ చేయాలనే తపన లేకపోతే సినిమాల్లో సందేశాత్మక పాటలు, సన్నివేశాలు వచ్చేవా?

రాజకీయాల్లోకి రావడం కోసం మంచి పనులు మొదలు పెట్టే నాయకులు కొందరు మనకు కనిపిస్తారు. తాము పోటీ చేయాలని అనుకున్న నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సేవ చేయడం పవన్ వృత్తి, ప్రవృత్తి కాదు... ఆయనకు అదొక వ్యసనం. రాజకీయాల్లోకి రాకముందు నుంచి పవన్ కళ్యాణ్ ఇంతే... తన పరిధిలో ప్రజలకు సేవ చేశారు. తన పరిధి మించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ జనసేనానిగా ఎదిగారు. ఏపీలో విజయ కేతనం ఎగరేశారు.

ముందు సినిమాల ద్వారా మార్పు తెచ్చిన పవన్!
కమర్షియల్ సినిమాలకు కొన్ని లెక్కలు ఉంటాయి. అందుకు అనుగుణంగా దర్శక రచయితలు పాటలు, సన్నివేశాలు రూపొందిస్తారు. హీరో ఇమేజ్, ప్రేక్షకుల్లో స్టార్ స్టేటస్ వంటివి దృష్టిలో పెట్టుకుని ఆ పాటలు, సన్నివేశాలు ఉంటాయి. అయితే, కమర్షియల్ సినిమాల అందు పవన్ సినిమాలు వేరు. ఆయన స్పేస్ తీసుకుని మరీ ప్రజలను చైతన్యవంతం చేసేలా తన సినిమాల్లో పాటలు రూపొందించారు.

కమర్షియల్ సక్సెస్ లెక్కలు చూస్తే... 'గుండుబా శంకర్' అంచనాలు అందుకోలేదని ట్రేడ్ పండితులు కొందరు చెప్పొచ్చు. టైటిల్ మీద కొంత మంది అభ్యంతరాలు వ్యక్తం చేసుండొచ్చు. కానీ, ఆ సినిమాలో 'లే లే లేలే ఇవ్వాళే లేలే' పాట మాత్రం ఎవర్ గ్రీన్ హిట్. ఎంతో మందిలో స్ఫూర్తి నింపిన గీతమది. ఈవ్ టీజింగ్, బాల కార్మిక వ్యవస్థలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన ఆ పాట అవగాహన పెంచిందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. పదవి కోసం రాజకీయ నేతలు ప్రవర్తన ఎలా ఉంటుందనేది ఆ పాటలో ఎండగట్టారు.

పవన్ కళ్యాణ్ సినిమాల్లో సందేశాత్మక పాటలన్నీ ఒకెత్తు... స్వీయ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన 'జానీ' సినిమాలో 'నారాజ్ కాకుర మా అన్నయ్య' మరో ఎత్తు. మన రోజు మనకు ఉంటుందని ఆయన ఎప్పుడో చెప్పారు. కులమతాల గొడవలు మనకెందుకు? అని ప్రశ్నించారు. మత సామరస్యంతో మెలగాలని చెప్పారు. ప్రజల్లో మానవత్వం పెంపొందించేలా ఉంటుంది ఆ గీతం. మనుషులు అంతా ఒక్కటేనని స్పష్టం చేసింది ఆ గీతం. 

సారా గురించి 'జానీ' సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది. వినోదం పంచుతూ మందు వద్దని చెప్పే పాట అది. దాన్ని పవన్ స్వయంగా పాడటం విశేషం. ఇక, ఐటమ్ సాంగులో సందేశం ఇవ్వడం ఒక్క పవన్ కళ్యాణ్ (Pawan Kalyan philosophical songs explained)కు మాత్రమే చెల్లింది. 'సర్దార్ గబ్బర్ సింగ్'లో 'తోబ తోబా...' పాట మొదలైన తీరు పక్కా ఐటమ్ సాంగ్ అన్నట్టు ఉంటుంది. చివరకు వచ్చేసరికి గానీ సందేశం అర్థం కాదు. బడిలో మందు, పేకముక్కలు వంటివి ఉండకూడదని రౌడీల చేత చెప్పించారు.

Also Read: ఇండియన్ సినిమాను షేక్ చేస్తున్న టాలీవుడ్ డైరెక్టర్లు - రూలింగ్ అంతా మనోళ్లదే

ప్రజలకు సందేశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ పాటల్లో 'బంగారం'లో 'జై శంభో' ఒకటి. ఆ పాటలో 'రూపాయి చేతబట్టు... ఎవడైనా గులాం కాకుంటే నన్నే ఒట్టు' అంటూ చేతిలో డబ్బు ఉంటే అందరూ గౌరవం ఇస్తారని చెప్పారు. 'ఖుషి' సినిమాలో 'ఏ మే రాజహా...' పాటను అంత త్వరగా ఎవరు మర్చిపోతారు? ఆ పాటలోనూ బాలకార్మిక, ఈవ్ టీజింగ్ మీద అంతర్లీనంగా సందేశం ఇచ్చారు పవన్ కళ్యాణ్. 'ఇంతే ఇంతింతే...' పాటలో లోకంలో పోకడల మీద 'బాలు'గా గళమెత్తారు పవర్ స్టార్. 'మనుషుల్లో మంచోడు ఎవడో ముంచేది ఎవడో మనసెట్టి చూడాలంతే' అని చెప్పారు. తెలుగు ప్రేక్షకులు, ప్రజలు మనసెట్టి చూడటం వల్లే ఏమో... పవన్ కళ్యాణ్ మీద అంత అభిమానం పెంచేసుకున్నారు. ఆ అభిమానం ఏ స్థాయిలో ఉందంటే... తెలంగాణ నుంచి ఏపీ పెళ్లి మరీ ఆయన కోసం ప్రచారం చేసేంత! ఆయన విజయాన్ని తమ విజయంగా సంబరాలు చేసుకునేంత!

సినిమాల ద్వారా, పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్... కథానాయకుడిగా ఎంతో మంది సమస్యలకు చలించి గుప్తదానాలు చేసిన పవన్ కళ్యాణ్... జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత తన సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేశారు. రాజకీయాల్లో ఎటువంటి పదవి లేకుండా ఇంత చేసిన మనిషి... ఎమ్మెల్యేగా ఎన్నికైతే, అసెంబ్లీలో ఆయన పార్టీకి సముచిత స్థానాలు వస్తే ఇంకెంత మార్పు వస్తుందోనని ఏపీ ప్రజలు నమ్మారు.

Also Read: పవన్ ఫ్యాన్స్ ముగింట ట్రెండ్స్ ఎంత - వాట్సాప్ స్టేటస్, ట్విట్టర్ వీడియో షేర్స్‌తో హల్‌ చల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
OLA EV Showroom: ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Embed widget