Pawan Kalyan: పవన్ అభిమానులకు గుడ్ న్యూస్... ధర్మం కోసం వీరమల్లు యుద్ధం, త్వరలో టీజర్!
Hari Hara Veera Mallu Teaser Release Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. 'హరి హర వీరమల్లు' టీజర్ గురించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు ఓ గుడ్ న్యూస్. డిఫరెంట్ ఫిల్మ్ మేకర్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందుతున్న సినిమా 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu Movie). ఏయం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమా టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
త్వరలో వీరమల్లు టీజర్ విడుదల
Hari Hara Veera Mallu Teaser: శ్రీరామ నవమి సందర్భంగా 'హరి హర వీరమల్లు' చిత్ర బృందం ఓ పోస్టర్ విడుదల చేసింది. అతి త్వరలో సినిమా టీజర్ విడుదల చేస్తామని పేర్కొంది. 'మీ ముందుకు... ధర్మం కోసం యుద్ధం త్వరలో' అని 'హరి హర వీరమల్లు' యూనిట్ తెలియజేసింది.
Also Read: కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ - ఏపీ, తెలంగాణలో నయా రికార్డ్స్, ప్రభాస్ డబుల్ సెంచరీ కొడతాడా?
జై శ్రీరామ్… శ్రీరామనవమి శుభాకాంక్షలతో… 🏹
— Mega Surya Production (@MegaSuryaProd) April 17, 2024
మీ ముందుకు... ‘ధర్మం కోసం యుధ్ధం‘ త్వరలో! #HariHaraVeeraMallu Teaser Out Soon! 🔥@PawanKalyan @DirKrish @thedeol @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 @rathinamkrish @gnanashekarvs @cinemainmygenes pic.twitter.com/gqopvkFtWb
పవన్ కళ్యాణ్ అభిమానులకు 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజీ' సినిమాల గ్లింప్స్ సూపర్ హై ఇచ్చాయి. 'హరి హర వీరమల్లు' గ్లింప్స్ కూడా వచ్చింది. కానీ, అభిమానులు ఆశించిన అంశాలు అందులో లేవు. హిస్టారికల్ ఫిల్మ్ కావడంతో డిఫరెంట్ కంటెంట్ ఆశిస్తున్నారు. టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి, టీమ్ ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.
Hari Hara Veera Mallu Story Concept: 'హరి హర వీరమల్లు' కథ విషయానికి వస్తే... 17వ శతాబ్దంలో మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో ఈ చిత్ర కథ జరుగుతుంది. లెజండరీ బందిపోటు వీరోచిత గాథగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ''భారతీయ సినిమాలో ఇప్పటి వరకు చెప్పని కథతో తీస్తున్న సినిమా 'హరి హర వీరమల్లు'. ప్రేక్షకులకు ఓ మరపురాని అనుభూతి, అనుభవాన్ని ఇచ్చే చిత్రమిది. నిర్మాణ పరంగా ఏ విషయంలోనూ రాజీ పడకుండా భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఆల్రెడీ 50 పర్సెంట్ షూటింగ్ పూర్తి అయ్యింది'' అని నిర్మాత ఎ. దయాకర్ రావు తెలిపారు.
Hari Hara Veera Mallu Cast And Crew: 'హరి హర వీరమల్లు' చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకుడు. జ్ఞానశేఖర్ వి.ఎస్ సినిమాటోగ్రాఫర్. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా సంభాషణలు సమకూరుస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి కూర్పు: కెఎల్. ప్రవీణ్ పూడి, విఎఫ్ఎక్స్: హరి హర సుతన్, పోరాటాలు: శామ్ కౌశల్ - తడోర్ లజరొవ్ జుజి - రామ్ లక్ష్మణ్ - దిలీప్ సుబ్బరాయన్, దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి, సమర్పణ: ఏయం రత్నం, నిర్మాత: ఎ. దయాకర్ రావు.