Pawan Kalyan: ఎన్నికల ప్రచారంలో 'ఉస్తాద్ భగత్‌సింగ్' గ్లాస్ డైలాగ్‌తో వారికి పవన్ కౌంటర్ - పగిలేకొద్ది గాజు పదునెక్కుతుంది..
Pawan Kalayn: ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ డైలాగ్ చెప్పడం ప్రస్తుతం హాట్‌టాపిక్ మారింది. తనని ఓడిపోయాడంటూ కామెంట్స్ చేసిన వారికి అదిరిపోయేలా గ్లాస్ డైలాగ్‌తో కౌంటర్ ఇచ్చారు.

Pawan Kalyan About Ustaad Bhagat Singh Dailogue: ప్రస్తుతం పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఎంపీ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎన్నిల షెడ్యూల్ రావడంతో పార్టీ ప్రచారం మొదలుపెట్టారు. మరోవైపు ఆయన నటించిన ఉస్తాద్ భగత్‌సింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి బ్లేజ్ అంటూ టీజర్ రిలీజ్ చేసింది. ఇందులో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ చేత ఈళలు వేయిస్తుంది.
‘‘గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది’’ అంటూ విలన్ పీక కోస్తాడు. ‘‘కచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాసంటే సైజు కాదు సైన్యం. కనిపించని సైన్యం’’ విపరీతంగా ఆకట్టుకుంటుంది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో మొత్తం ఈ డైలాగే మోరుమోగుతుంది. అయితే ఇదిలా ఉంటే నేడు ఎన్నికల ప్రచారంలో పవన్ ఈ డైలాగ్‌ను వాడారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. తనని ఓడిపోయాడంటూ కామెంట్స్ చేసిన వారికి అదిరిపోయేలా గ్లాస్ డైలాగ్‌తో కౌంటర్ ఇచ్చారు. పార్టీ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. మీకు ఒకటి చెప్పాలి. ఈ రోజు విడుదలైన ఉస్తాద్ భగత్‌సింగ్ టీజర్‌లో ఓ సన్నివేశంలో గాజు డైలాగ్ ఉంటుంది. టీ గ్లాజ్ పగిలిపోతుంది. మూవీ షూటింగ్‌లో నేను ఇది అవసరమా? ఎందుకు అని డైరెక్టర్ హరీష్ శంకర్‌ను అడిగాను. ఆయన ఒకటే మాట చెప్పారు. లేదు సార్ అదీ ఇప్పుడు అవసరం. అందరు మీరు ఓడిపోయారు ఓడిపోయారు అంటున్నారు.
మిమ్మల్ని అలా అనడం ఫ్యాన్స్‌గా మేం తట్టుకోలేము. అలాంటి వారికి దీని ద్వారా ఒకటి చెప్పాలనుకుంటున్నాం. ఏంటంటే.. 'గాజు పగిలే కొద్ది పదును ఎక్కుతుంది'. ఇది నేను ఎందుకు చెబుతున్నానంటే అనుభవం కానిదే ఏది నేర్చుకోం. ఈ రోజు నేను బలంగా ఓట్లు ఎందుకు అడుగుతున్నానంటే.. ఓడిపోయి దశాబ్ధం పాటు ఒడిపోయి అధికారం లేకుండ పార్టీ నడిపాడు. ఇది నాకు ఒక చిన్నపాటి విజయం. అలాంటి ఈసారి కనుగ మనం 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు మనం కొట్టి చూపిస్తే భారత్‌దేవం ఆంధ్రవైపు చూసేలా చేస్తాను" అంటూ పవన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతంది.
Also Read: ఒకే ఈవెంట్‌లో మెరిసిన నాగచైతన్య, సమంత - విడాకుల తర్వాత ఇదే ఫస్ట్‌టైం, ఫుల్ ఖుష్‌లో ఫ్యాన్స్
ఇది టీజర్ కాదా!
వాస్తవానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి గ్లింప్స్ ఎప్పుడో వచ్చేసింది. దీంతో అంతా ఈసారి వచ్చేది టీజర్ అని అనుకున్నారు. కానీ ఒక్క నిమిషం నిడివి గల ‘భగత్స్ బ్లేజ్’ పేరుతో వీడియోను వదిలారు. ఇది కొంచెం ఫ్యాన్స్‌ని నిరుత్సాహ పరిచింది. కానీ, అసలు కన్నా కొసరు మేలు అన్నట్లు.. ఏదో ఒక అప్‌డేట్ వచ్చింది కదా అని ఫ్యాన్స్ సరిపెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావిడి కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో ఉస్తాద్ నుంచి ఈ అప్‌డేట్ రావడం చర్చనీయంగా మారింది. ఎన్నికల ప్రచారంలో పవర్ స్టార్ బిజీగా తిరుగుతారని, ఇక ఆయన అప్‌డేట్స్ రావడం కష్టమే అని అనుకుంటున్న సమయంలో హరీష్ శంకర్.. ‘‘మీరు ఊహించనిది జరగబోతుంది.. మార్చి 19న’’ అంటూ అప్‌డేట్ ఇచ్చారు. అంతే, ఆ రోజు నుంచి అభిమానులు అప్‌డేట్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు అదిరిపోయే అప్‌డేట్‌తో వచ్చి ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. అంతేకాదు.. టీజర్, ట్రైలర్‌లు కూడా ఇస్తే బ్రేక్ ఇవ్వడానికి సిద్ధమంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

