By: ABP Desam | Updated at : 14 Mar 2023 03:38 PM (IST)
రామ్ చరణ్, ఎన్టీఆర్ (Image Courtesy : Oscars Website)
ఆస్కార్ (Oscars 2023)... ఆస్కార్... ఆస్కార్... ఇప్పట్లో ఈ ఫీవర్ తగ్గేలా లేదు. మన దేశానికి 'నాటు నాటు...' పాట (Naatu Naatu Won Oscar) తెలుగు చిత్ర పరిశ్రమకు ఆస్కార్ తెచ్చిన ఆనందంలో టాలీవుడ్ ప్రేక్షక లోకమంతా ఉంది. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' (RRR Movie) దేశానికి గర్వకారణమని అందరూ గొప్పగా చెబుతున్నారు. ఈ సినిమా గురించి ఏకంగా పార్లమెంటులో చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర సభ్యులు 'ఆర్ఆర్ఆర్' బృందాన్ని అభినందించారు. ఈ సంతోషంలో ఉన్న హీరోల అభిమానులకు మరో గుడ్ న్యూస్.
హాలీవుడ్ యాక్టర్స్ కంటే...
'ఆర్ఆర్ఆర్' హీరోలే ముందు!
ఆస్కార్స్, విన్నర్స్, ఆ మూమెంట్స్ గురించి సోషల్ మీడియాలో చాలా మంది ట్వీట్లు, పోస్టులు చేశారు. అయితే... ఎక్కువ మంది ఎవరి పేర్లు మెన్షన్ చేశారో తెలుసా? 'ఆర్ఆర్ఆర్' హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేర్లు. వాళ్ళిద్దరూ మొదటి రెండు స్థానాల్లో ఉంటే... మూడో స్థానంలో ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ పురస్కారం అందుకున్న 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఎట్ వన్స్ ' నటుడు కి హుయ్ క్వాన్, నాలుగో స్థానంలో ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్న 53 ఏళ్ళ బ్రెండన్, ఐదో స్థానంలో పెడ్రో ఉన్నారు.
ఎన్టీఆర్ ఫస్ట్... చరణ్ నెక్స్ట్!
ఆస్కార్ అవార్డ్స్ (Oscar Awards 2023) సందర్భంగా సోషల్ మీడియాలో, న్యూస్ మీడియాలో అత్యధికంగా ప్రస్తావించిన నటుల (హీరోల) జాబితాలో మొదటి స్థానంలో ఎన్టీ రామారావు (Jr NT Rama Rao) నిలిచారు. ఆయన తర్వాత స్థానంలో రామ్ చరణ్ (Ram Charan) నిలిచారు. దాంతో అభిమానులు ఫుల్ ఖుషిలో ఉన్నారు.
Also Read : ఆస్కార్ తెచ్చిన రాజమౌళి - దర్శక ధీరుడికి చరిత్ర సలామ్ కొట్టాల్సిందే
వేదికపై ఆస్కార్ అందుకున్న తర్వాత అకాడమీకి కీరవాణి థాంక్స్ చెప్పారు. ఆ తర్వాత ''కార్పెంటర్స్ శబ్దాలు వింటూ నేను పెరిగాను. ఇప్పుడు ఆస్కార్స్ (Oscars 2023)తో ఉన్నాను. నా మనసులో ఒక్కటే కోరిక ఉంది. అలాగే... రాజమౌళి, మా కుటుంబ సభ్యుల మనసులో కూడా! 'ఆర్ఆర్ఆర్' గెలవాలి. ఎందుకంటే... ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమైన సినిమా. నన్ను శిఖరాగ్రాన నిలబెట్టాలి'' అని కీరవాణి తన మనసులో భావాలను పాట రూపంలో వ్యక్తం చేశారు. ఆ తర్వాత తమ్ముడు (రాజమౌళి) కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయకు థాంక్స్ చెప్పారు. అలాగే, వేరియన్స్ ఫిలిమ్స్ (Variance films)కి కూడా!
వాళ్ళిద్దరికీ ఎందుకు థాంక్స్ చెప్పారంటే?
ఆస్కార్ వేదిక మీద తన పక్కన ఉన్న చంద్రబోస్ గురించి కానీ, 'నాటు నాటు...' పాడిన కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ గురించి గానీ కీరవాణి మాట్లాడలేదు. వాళ్ళ గురించి గోల్డెన్ గ్లోబ్ వేదికపై మాట్లాడారు. ఇప్పుడు ప్రత్యేకంగా వేరియన్స్ ఫిలిమ్స్, కార్తికేయకు థాంక్స్ చెప్పడానికి కారణం ఏమిటంటే? ఆస్కార్ ప్రయాణం వెనుక వాళ్ళిద్దరి కృషి కూడా ఉంది.
'నాటు నాటు'కు స్టాండింగ్ ఒవేషన్!
ఆస్కార్స్ స్టేజి మీద కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడటం ఒక ఎత్తు అయితే... వాళ్ళ పెర్ఫార్మన్స్ కంప్లీట్ అయ్యాక ఆడిటోరియంలో ఉన్న ప్రముఖులు అంతా నిలబడి మరీ చప్పట్లు కొట్టారు. ఒక రెండు నిమిషాలు స్టాండింగ్ ఒవేషన్ లభించింది. తెలుగు పాటకు, భారతీయ పాటకు దక్కిన గౌరవంగా దీనిని మనం చూడాలి. రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj)ను రాజమౌళి అభినందించారు.
Also Read : ‘నాటు నాటు’ వెనుక ఎన్ని పాట్లో - 19 నెలల శ్రమ ఆ పాట, 110 రకాల స్టెప్పుల్లో ఆ ఒక్కటే ప్రత్యేకం!
BRS - Keerthi Suresh: నేనేమీ గుజరాత్ నుంచి రాలేదు కదా - కీర్తి సురేష్ కామెంట్స్‌ను వాడేసుకుంటున్న బీఆర్ఎస్
Bommarillu Bhaskar: అప్పుడు విమర్శలు, ఇప్పుడు విజిల్స్ - థియేటర్లో ‘ఆరెంజ్’ మూవీ చూసి బొమ్మరిల్లు భాస్కర్ భావోద్వేగం
G20 Summit 2023: సిగ్గు, శరంలేని జాతి - విశాఖ జీ20 సదస్సులో తమిళ బ్యానర్లపై నటి సంచలన వ్యాఖ్యలు
Ram Charan: అభిషేక్ బచ్చన్ చేయని సాహసాన్ని చరణ్ చేసి చూపించాడు, కానీ...
Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!
Nitish Rana: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన కోల్‌కతా - అస్సలు అనుభవం లేని ప్లేయర్‌కి!
KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత