అన్వేషించండి

NTR Neel Movie: థియేటర్లలో 'డ్రాగన్' విడుదలకు సరిగ్గా ఏడాది... ఎన్టీఆర్ - నీల్ మాస్ విధ్వంసం కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!

Dragon Release Date: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న సినిమా 'డ్రాగన్'. థియేటర్లలో విడుదలకు సరిగ్గా ఏడాది ఉంది.

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో విజయం తర్వాత చేసే సినిమాతో సక్సెస్ అందుకోవడం కష్టమని ఇండస్ట్రీలో ఒక నానుడి ఉంది. జక్కన్నతో పని చేసి హిట్ అందుకున్న తర్వాత చేసిన సినిమా డిజాస్టర్ అవుతుందనే‌ సెంటిమెంట్ తప్పని 'దేవర'తో ప్రూవ్ చేశారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR). దేవరకు ముందు ఆయన రెండు సినిమాలు అంగీకరించారు. అందులో అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం!

థియేటర్లలోకి రావడానికి సరిగ్గా ఏడాది!
'దేవర' తర్వాత ఎన్టీఆర్ రిలీజ్ ప్రశాంత్ నీల్ సినిమా కాదు... హిందీ సినిమా పరిశ్రమకు ఆయన పరిచయం అవుతున్న 'వార్ 2'. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న ఆ సినిమా విడుదల కానుంది. దాని కంటే నీల్ సినిమా మీద ఎక్కువ క్రేజ్ ఉంది.

'వార్ 2' సినిమాలో ఎన్టీఆర్ సోలో హీరో కాదు... బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కూడా ఉన్నారు. పైగా అందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ కాస్త నెగిటివ్ షేడ్స్‌తో ఉంటుందని టాక్. ప్రశాంత్ నీల్ సినిమాకు వస్తే ఆయన సోలో హీరో. 'కేజిఎఫ్', 'సలార్' వంటి భారీ బ్లాక్ బస్టర్స్ తీసిన ట్రాక్ రికార్డ్ దర్శకుడికి ఉంది. అందువల్ల నీల్ సినిమా కోసం ఆడియన్స్ అండ్ ఫాన్స్ ఎక్కువ వెయిట్ చేస్తున్నారు. 

జూన్ 25, 2026... ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న 'డ్రాగన్' థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా టైటిల్ ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారని టాక్. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో భారీ ఎత్తున విడుదల అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

యమా క్రేజీగా ఎన్టీఆర్ లైనప్... నెక్స్ట్!?
NTR Upcoming Movies: 'వార్ 2', 'దేవర' సినిమాల తర్వాత ఎన్టీఆర్ చేయబోయే మరో మూడు సినిమాలో ఖరారు అయ్యాయి. మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఇంతకు ముందు ఆయన దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' చేశారు. అయితే అది తెలుగులో మాత్రమే విడుదల చేసిన సినిమా. కానీ, ఇప్పుడు త్రివిక్రమ్ పాన్ ఇండియా టార్గెట్ చేశారు. అందులోనూ యుద్ధానికి అధిపతి కుమారస్వామి కథతో మైథాలజికల్ టచ్ ఉన్న సినిమా చేస్తున్నారు. దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read: 'కన్నప్ప' థియేటర్స్ దగ్గర ప్రభాస్ మేనియా... తెలుగు రాష్ట్రాలలో భారీ కటౌట్లు!

త్రివిక్రమ్ సినిమాతో పాటు రజనీకాంత్ 'జైలర్' ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకరించారు ఎన్టీఆర్. ఆ సినిమా వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 'జైలర్ 2' చేసిన తర్వాత ఎన్టీఆర్ సినిమా వర్క్ మొదలు పెడతారు నెల్సన్. త్రివిక్రమ్ సినిమాతో పాటు ఆయన సినిమా కూడా సమాంతరంగా మొదలయ్యే అవకాశం ఉంది. ఆ రెండు సినిమాలు హరిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలపై రూపొందుతాయి. సూర్యదేవర ఫ్యామిలీ నిర్మాతలు అన్నమాట. దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ కూడా అంగీకరించారు. పలువురు బాలీవుడ్ దర్శకుల సైతం ఎన్టీఆర్ హీరోగా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరో రెండు మూడేళ్లు ఎన్టీఆర్ డైరీ ఫుల్ అయ్యింది.

Also Read'కూలీ' రైట్స్ రేసులో టాప్ ప్రొడ్యూసర్లు... రజనీ సినిమా హక్కులకు భారీ పోటీ... 100 కోట్లు కొడితే తప్ప గట్టెక్కలేరు

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget