Om Bheem Bush First Review: 'ఓం భీమ్ బుష్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - సెన్సార్ టాక్‌తో పాటు రిపోర్ట్ ఎలా ఉందంటే?
Om Bheem Bush Censor Report: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా నటించిన 'ఓం భీమ్ బుష్' సెన్సార్ పూర్తి అయ్యింది. ఫస్ట్ రివ్యూ, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?

నో లాజిక్, ఓన్లీ మేజిక్... 'ఓం భీమ్ బుష్' (Om Bheem Bush Movie) చిత్రానికి దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి ఇచ్చిన క్యాప్షన్. శ్రీ విష్ణు, ప్రియదర్శి పులికొండ, రాహుల్ రామకృష్ణ కథానాయకులుగా ఆయన తెరకెక్కించిన చిత్రమిది. ఈ శుక్రవారం (మార్చి 22న) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సెన్సార్ కంప్లీట్ అయ్యింది. యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉంది? ఫస్ట్ రివ్యూ ఎలా వచ్చింది? అనేది చూస్తే...
హిలేరియస్ కామెడీ...
ఘోస్ట్ ఎపిసోడ్ అయితే కేక
'ఓం భీమ్ బుష్'కు సెన్సార్ నుంచి సూపర్బ్ హిట్ రిపోర్ట్స్ వచ్చాయి. ఏ సినిమాను అయినా సరే... యూనిట్ సభ్యులతో సంబంధం ఉన్న వాళ్ళు కాకుండా ముందుగా చూసే బయట వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే సెన్సార్ సభ్యులే. 'ఓం భీమ్ బుష్' చూసేటప్పుడు వాళ్ళు పడి పడి నవ్వుకున్నారని తెలిసింది.
ఇంటర్వెల్ (Om Bheem Bush Censor Review)కు ముందు ఒక రెండు ఎపిసోడ్స్, తర్వాత మూడు ఎపిసోడ్స్ హిలేరియస్‌గా ఉన్నాయట. ఘోస్ట్ ఎపిసోడ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందని, ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోవడం గ్యారంటీ అని ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది.
క్లైమాక్స్ కొత్తగా డిజైన్ చేసిన దర్శకుడు
'ఓం భీమ్ బుష్'లో ఘోస్ట్ ఎపిసోడ్ ఇంటర్వెల్ తర్వాత వస్తుందని సినిమా చూసిన సెన్సార్ సభ్యులు, సినిమా ప్రముఖులు చెప్పారు. ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పోర్షన్స్ హైలైట్ అని తెలిపారు. ఇప్పటి వరకు తెలుగు తెరపై ఎవరూ చూడనటువంటి క్లైమాక్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుందని, దర్శకుడు శ్రీ హర్ష ఎండింగ్ ఎపిసోడ్ కొత్తగా డిజైన్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
శ్రీ విష్ణు... ప్రియదర్శి... రాహుల్...
ముగ్గురి టైమింగ్, కామెడీ సూపర్!
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ... ఈ ముగ్గురి కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో 'బ్రోచేవారెవరురా' సినిమాలో ప్రేక్షకులు చూశారు. అంతకు మించి అనేలా 'ఓం భీమ్ బుష్'లో ఒకరితో మరొకరు పోటీ పడి మరీ నటించారని సెన్సార్ టాక్.
'సామజవరగమన'తో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన శ్రీవిష్ణు, మరోసారి ఈ సినిమాతో కామెడీ మీల్స్ పెట్టడం గ్యారంటీ అని ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఆయనకు తోడు మిగతా ఇద్దరి రోల్స్ హిలేరియస్‌గా ఉండటంతో ఫన్ బాగా వర్కవుట్ అయ్యిందట.
Also Read: శవం చుట్టూ సాలెగూడు, తాంత్రిక పూజలు - ఇంట్రెస్టింగ్‌గా నవీన్ చంద్ర 'ఇన్‌స్పెక్టర్ రిషి' ట్రైలర్
'ఓం భీమ్ బుష్'... స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రేక్షకులకు హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ పక్కా అన్నమాట! కాలేజీలో 'బ్యాంగ్ బ్రోస్' అని పిలవబడే ముగ్గురు హీరోయిన్లు భవానీపురం గ్రామానికి ఎందుకు వెళ్లారు? అక్కడ ఏమైంది? అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి. ఇంట్రెస్టింగ్ స్టోరీకి ఫాంటసీ, హారర్ ఎలిమెంట్ యాడ్ చేయడంతో సినిమా మరింత క్రేజీగా మారిందట.
'ఓం భీమ్ బుష్'లో బాలీవుడ్ బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఖాన్, ప్రీతి ముకుందన్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో 'హుషారు' ఫేమ్ ప్రియా వడ్లమాని ఓ స్పెషల్ సాంగ్ చేశారు. అగ్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు.
Also Read: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న వైఎస్ వివేకా బయోపిక్ ట్రైలర్ - జగన్‌కు నెగెటివ్ అవుతుందా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

