By: ABP Desam | Updated at : 18 Apr 2023 11:13 AM (IST)
కొరటాల శివ, సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కథానాయకుడిగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా (NTR 30) రూపొందుతోంది. ఇందులో విలన్ ఎవరు? అంటే సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) అని ఎవరైనా సరే ఠక్కున సమాధానం ఇస్తారు. అయితే, ఆ విషయాన్ని ఇప్పటి వరకు యూనిట్ చెప్పలేదు. ఈ రోజు అధికారికంగా వెల్లడించింది.
అవును... ఎన్టీఆర్ 30లో సైఫ్
అవును... తారక్ సినిమాలో సైఫ్ విలన్ అంటూ ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ ఈ రోజు అధికారికంగా అనౌన్స్ చేశాయి. ఆయన చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు పేర్కొన్నాయి. ప్రభాస్ 'ఆదిపురుష్'లో రావణుడిగా నటించిన సైఫ్ అలీ ఖాన్... ఇప్పుడు తారక రాముడి సెట్స్ లో అడుగు పెట్టారు.
ఎన్టీఆర్ అన్నయ్య, కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై రూపొందుతోన్న చిత్రమిది. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె నిర్మిస్తున్నాయి. ఖర్చు విషయంలో ఏమాత్రం రాజీ పడటం లేదని తెలిసింది.
Also Read : ఇలియానా స్వీట్ సర్‌ప్రైజ్ - పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్?
Team #NTR30 welcomes #SaifAliKhan on board ❤🔥
— NTR Arts (@NTRArtsOfficial) April 18, 2023
The National Award winning actor joined the shoot of the high voltage action drama. @tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @YuvasudhaArts pic.twitter.com/RB6s2Xh45g
హైదరాబాదులోనే రెండో షెడ్యూల్
మార్చి నెలాఖరున హైదరాబాదులో ఎన్టీఆర్ 30 చిత్రీకరణ ప్రారంభించారు. ఫస్ట్ షెడ్యూల్ కొన్ని రోజుల క్రితం ముగిసింది. అందులో హీరో మీద కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. రెండో షెడ్యూల్ ఈ సోమవారం మొదలైందని తెలిసింది. రాత్రి వేళల్లో సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం అందింది.
జాను వచ్చిందిరోయ్
ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె, హిందీ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆదివారమే ఆమె హైదరాబాద్ వచ్చారు. సోమవారం జరిగిన చిత్రీకరణలో పాల్గొన్నారని టాక్. సైఫ్ అలీ ఖాన్ కూడా షూటింగులో జాయిన్ అవుతున్నారు. వాళ్ళిద్దరికీ తెలుగులో ఇదే తొలి సినిమా.
అంచనాలు పెంచిన ఎన్టీఆర్ డైలాగ్
ఇప్పుడు 'వస్తున్నా' అని ఎవరు చెప్పినా సరే తెలుగు ప్రేక్షకులకు ఎన్టీఆర్ గుర్తు వస్తారని చెప్పడంలో మరో సందేహం అవసరం లేదు. ''అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు.... అవసరానికి మించి తను ఉండకూడదు అని! అప్పుడు భయానికి తెలియాలి... తను రావాల్సిన సమయం వచ్చిందని! వస్తున్నా'' అని ఈ సినిమా టీజర్ లో ఆయన చెప్పిన డైలాగ్ వైరల్ అయ్యింది. అంతే కాదు... సినిమా మీద అంచనాలు పెంచింది.
Also Read : ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ ఇన్ యాక్షన్ - స్పెషల్ ఫ్లైట్‌లో ముంబైకు పవన్
రక్తం రుచి మరిగిన మృగాళ్లను వేటాడే మగాడి పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తారని చెప్పి దర్శకుడు కొరటాల శివ సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి. ఎన్టీఆర్ 30 చిత్రీకరణ ఇలా మొదలైందో? లేదో? అలా లీకుల బెడద మొదలైంది. ఆల్రెడీ సెట్స్ నుంచి ఎన్టీఆర్ ఫోటోలు, బ్లడ్ ట్యాంక్స్ ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ చిత్రానికి యువ సంగీత సంచలన అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇతర సాంకేతిక నిపుణుల్లో హాలీవుడ్ నుంచి కొంత మందిని తీసుకున్నారు.
కొరటాల శివ సినిమా కంప్లీట్ అయిన తర్వాత హృతిక్ రోషన్ (Hrithik Roshan)తో హిందీలో 'వార్ 2', ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సినిమా ప్రారంభించాలని ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నారు.
Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'శాకుంతలం', ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు
Keerthy Suresh Dating: ఆ అసత్య వార్తలతో మనఃశాంతి కరువవుతోంది - కీర్తి సురేష్ తండ్రి ఆవేదన!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!
NTR In Rest Mode : 'దేవర'కు ఇంకో వారం విశ్రాంతి - ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్‌కు వచ్చేది ఎప్పుడంటే?
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!
NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి