News
News
X

NTR30 Update : ఎన్టీఆర్ సినిమాకు భారీ ప్లానింగ్ - హాలీవుడ్ నుంచి...

ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాకు భారీ ప్లానింగ్ జరుగుతోంది. హాలీవుడ్ నుంచి కొంత మందిని రప్పిస్తున్నారు. వాళ్ళు ఎవరు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...

FOLLOW US: 
Share:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR Jr), దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) ది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. 'ఆర్ఆర్ఆర్' లాంటి పాన్ ఇండియా, వరల్డ్ సక్సెస్ తర్వాత తనకు రచయితగా 'బృందావనం', దర్శకుడిగా 'జనతా గ్యారేజ్' వంటి విజయవంతమైన సినిమాలు అందించిన కొరటాల శివతో ఎన్టీఆర్ చేస్తున్న చిత్రమిది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ముందు నుంచి అనుకుంటున్నారు. దీనికి భారీ ప్లానింగ్ జరుగుతోంది. 

ఎన్టీఆర్30కి హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్!
ఆస్కార్ అవార్డ్స్ కోసం సోమవారం ఎన్టీఆర్ అమెరికా బయలుదేరి వెళ్ళనున్నారు. లాస్ ఏంజిల్స్ వెళ్లిన తర్వాత హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తో సమావేశం అవుతారట. ఆ తర్వాత అక్కడి స్టంట్ మాస్టర్లతో కూడా డిస్కషన్స్ చేస్తారట. ఎన్టీఆర్ 30 కోసమే ఆ డిస్కషన్ అని, త్వరలో వాళ్ళ వివరాలు వెల్లడిస్తారని సమాచారం.

జాన్వీ బర్త్‌డేకి పేరు చెబుతారా?
Janhvi Kapoor Birthday : మార్చి 6న అతిలోక సుందరి జాన్వీ కపూర్ పుట్టిన రోజు. ఈ సినిమాలో ఆమెను కథానాయికగా ఎంపిక చేశారని విశ్వసనీయ వర్గాల కథనం. జాన్వీ బర్త్ డే సందర్భంగా ఆ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తారని సమాచారం. 

ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా ఫిబ్రవరి 24న లాంఛనంగా ప్రారంభించాలని ప్లాన్ చేశారు. అయితే, నందమూరి తారక రత్న మరణం కారణంగా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. అయితే, రెగ్యులర్ షూటింగ్ మాత్రం అనుకున్న విధంగా స్టార్ట్ కానుందట. ఎన్టీఆర్ 30వ చిత్రమిది. అందుకని, ఎన్టీఆర్ 30గా వ్యవహరిస్తున్నారు. మార్చిలో సెట్స్ మీదకు వెళ్ళనుంది. మార్చి 20న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని ఎన్టీఆర్ స్వయంగా 'అమిగోస్' ప్రీ రిలీజ్ వేడుకలో తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

కల్పిత దీవి... ఒక పోర్టులో!
ఈ సినిమా ఓ కల్పిత దీవి, పోర్టు నేపథ్యంలో తెరకెక్కుతోందట. కథా నేపథ్యం ఈ ట్వంటీయెత్ సెంచరీ కాదని సమాచారం అందుతోంది. సెమీ పీరియడ్ బ్యాక్ డ్రాప్ సెలెక్ట్ చేశారట కొరటాల శివ. హైద్రాబాదులో ఈ సినిమా కోసం భారీ సెట్ వేస్తున్నారు. భాగ్య నగరంలో కొంత... ఆ తర్వాత విశాఖ, గోవా ఏరియాల్లో మరి కొంత షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారట. వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంటుందని, సీజీ అవసరం అయ్యే సన్నివేశాలను ముందు షూట్ చేసి విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలకు ఇవ్వాలని ప్లాన్ చేశారట.

Also Read : 'భద్రకాళి'గా అల్లు అర్జున్ - టైటిల్ అదేనా?

ఆల్రెడీ విడుదల చేసిన సినిమా అనౌన్స్‌మెంట్‌ టీజర్‌ ప్రేక్షకుల అందరి దృష్టిని ఆకర్షించింది. ''అప్పుడప్పుడూ ధైర్యానికి కూడా తెలియదు. అవసరానికి మించి తను ఉండకూడదని! అప్పుడు భయానికి తెలియాలి... తాను రావాల్సిన సమయం వచ్చిందని! వస్తున్నా'' అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ సూపర్ హిట్ అయ్యింది. ప్రతినాయకుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ లేదా విక్రమ్ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, చిత్ర బృందం అధికారికంగా ఏ విషయం చెప్పలేదు.

Also Read 'ఎలోన్' రివ్యూ : హాట్‌స్టార్‌లో మోహన్ లాల్ సినిమా - మలయాళంలో కూడా వరస్ట్ సినిమాలు తీస్తారని చెప్పడానికి ఒక ఉదాహరణ

నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్  రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ : రత్నవేలు.

Published at : 05 Mar 2023 04:51 PM (IST) Tags: Janhvi Kapoor Koratala siva NTR Jr NTR30 Update Hollywood Stunt Masters

సంబంధిత కథనాలు

Casting Couch: రాత్రికి కాఫీకి వెళ్దాం రమ్మంది, అనుమానం వచ్చి.. - క్యాస్టింగ్ కౌచ్‌పై ‘రేసు గుర్రం’ రవి కిషన్

Casting Couch: రాత్రికి కాఫీకి వెళ్దాం రమ్మంది, అనుమానం వచ్చి.. - క్యాస్టింగ్ కౌచ్‌పై ‘రేసు గుర్రం’ రవి కిషన్

Desamuduru Re-release: అదిరిపోనున్న ఐకాన్ స్టార్ బర్త్ డే, రీరిలీజ్ కు రెడీ అవుతున్న బ్లాక్ బస్టర్ మూవీ!

Desamuduru Re-release: అదిరిపోనున్న ఐకాన్ స్టార్ బర్త్ డే, రీరిలీజ్ కు రెడీ అవుతున్న బ్లాక్ బస్టర్ మూవీ!

Ram Pothineni: దసరా రేసులో రామ్, బోయపాటి - పాన్ ఇండియా మాస్ మోతకు రెడీ!

Ram Pothineni: దసరా రేసులో రామ్, బోయపాటి - పాన్ ఇండియా మాస్ మోతకు రెడీ!

BRS - Keerthi Suresh: నేనేమీ గుజరాత్ నుంచి రాలేదు కదా - కీర్తి సురేష్ కామెంట్స్‌ను వాడేసుకుంటున్న బీఆర్ఎస్

BRS - Keerthi Suresh: నేనేమీ గుజరాత్ నుంచి రాలేదు కదా - కీర్తి సురేష్ కామెంట్స్‌ను వాడేసుకుంటున్న బీఆర్ఎస్

Bommarillu Bhaskar: అప్పుడు విమర్శలు, ఇప్పుడు విజిల్స్ - థియేటర్లో ‘ఆరెంజ్’ మూవీ చూసి బొమ్మరిల్లు భాస్కర్ భావోద్వేగం

Bommarillu Bhaskar: అప్పుడు విమర్శలు, ఇప్పుడు విజిల్స్ - థియేటర్లో ‘ఆరెంజ్’ మూవీ చూసి బొమ్మరిల్లు భాస్కర్ భావోద్వేగం

టాప్ స్టోరీస్

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!