News
News
X

Allu Arjun In Bhadrakali : 'భద్రకాళి'గా అల్లు అర్జున్ - టైటిల్ అదేనా?

Sandeep Reddy Vanga to direct Allu Arjun : అల్లు అర్జున్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమాను ఇటీవల అనౌన్స్ చేశారు. ఆ సినిమా టైటిల్ కన్ఫర్మ్ చేశారట.

FOLLOW US: 
Share:

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందనుంది. ఈ సినిమా టైటిల్ కన్ఫర్మ్ చేశారనేది బాలీవుడ్ టాక్.
 
'భద్రకాళి'గా అల్లు అర్జున్!?
Allu Arjun Film Titled Bhadrakali : అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగా సినిమాకు 'భద్రకాళి' (Bhadrakali Movie) టైటిల్ ఖరారు చేశారట. ఈ టైటిల్ చాలా పవర్ ఫుల్ గా ఉంది కదూ! సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటుందట! అన్నట్టు... సందీప్ రెడ్డి వంగా ప్రొడక్షన్ హౌస్ పేరు భద్రకాళి పిక్చర్స్! తన నిర్మాణ సంస్థ పేరునే సినిమాకు పెట్టినట్లు ఉన్నారు.
 
అల్లు అర్జున్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందే సినిమాను టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్ సంస్థలపై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించనున్నారు. ఈ చిత్రానికి శివ చందన సహ నిర్మాత. ఆర్య 2'లో స్టార్టింగ్ సీన్స్ కావచ్చు... 'పుష్ప'లో పుష్పరాజ్ క్యారెక్టర్ కావచ్చు... రా అండ్ రస్టిక్ అంటే అల్లు అర్జున్ చెలరేగిపోయారు. 'అర్జున్ రెడ్డి'లో విజయ్ దేవరకొండను, 'కబీర్ సింగ్'లో షాహిద్ కపూర్‌ను సందీప్ రెడ్డి వంగా ఎలా చూపించారో తెలుసు. క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యే అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగా సినిమా కోసం ఎంత మాసీగా మారతారనేది చూడాలి.    

అల్లు అర్జున్ చేతిలో రెండు... 
ప్రస్తుతం 'పుష్ప 2' (Pushpa 2 Movie) చిత్రీకరణ చేస్తున్నారు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. హిందీలో కూడా 'పుష్ప' విజయం సాధించడం, ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సీక్వెల్ క్రేజ్ పెరిగింది. దాని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్న సినిమా చేయనున్నారు. ఆ సినిమాను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు అనుకోండి. ఇప్పుడు అల్లు అర్జున్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. మరోవైపు దర్శకుడి చేతిలోనూ అంతే!

సందీప్ రెడ్డి వంగా చేతిలో రెండు!
'కబీర్ సింగ్' కంటే ముందు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి సందీప్ రెడ్డి వంగా ట్రై చేశారు. అయితే, ఎందుకో ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఆ తర్వాత హిందీలో రణ్‌బీర్ కపూర్ హీరోగా 'యానిమల్' స్టార్ట్ చేశారు. అందులో రష్మిక హీరోయిన్. ఆ సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'స్పిరిట్' చేయనున్నారు. ఈ రెండు కంప్లీట్ అయ్యాక అల్లు అర్జున్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. 

Also Read : విజయ్ దేవరకొండ ప్రేమకథలో పీటర్ హెయిన్ ఫైట్స్ - యాక్షన్ ఉంది బాస్

ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేశాక... హీరో, దర్శకుడు ఈ సినిమా స్టార్ట్ చేస్తారని తెలిసింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా ఈ సినిమా తెరకెక్కించనున్నారు. 'అర్జున్ రెడ్డి'లో విజయ్ దేవరకొండది డాక్టర్ రోల్. మద్యానికి బానిసైన తర్వాత క్యారెక్టరైజేషన్ పూర్తిగా వేరే కోణంలో ఉంటుంది. 'స్పిరిట్'లో ప్రభాస్ పోలీస్ రోల్ చేయనున్నారు. మరి, అల్లు అర్జున్ కోసం ఎటువంటి క్యారెక్టర్ సందీప్ రెడ్డి వంగా రెడీ చేశారో? సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి ఇంకా చాలా నెలలు ఉంది కాబట్టి, ఆ విషయం తెలుసుకోవడానికి అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదు.

Also Read 'ఎలోన్' రివ్యూ : హాట్‌స్టార్‌లో మోహన్ లాల్ సినిమా - మలయాళంలో కూడా వరస్ట్ సినిమాలు తీస్తారని చెప్పడానికి ఒక ఉదాహరణ

Published at : 05 Mar 2023 04:23 PM (IST) Tags: Allu Arjun Pan india movie Sandeep reddy vanga  Sandeep Reddy Vanga Bhadrakali Movie

సంబంధిత కథనాలు

NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా

Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా

Rashmi Gautam Lifestyle : రష్మి వెనుక ఇంత తలనొప్పి ఉందా? స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన ‘జబర్దస్త్’ యాంకర్

Rashmi Gautam Lifestyle : రష్మి వెనుక ఇంత తలనొప్పి ఉందా? స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన ‘జబర్దస్త్’ యాంకర్

Adivi Sesh On Education : అడివి శేష్‌ను భయపెట్టిన సబ్జెక్ట్ ఏదో తెలుసా?

Adivi Sesh On Education : అడివి శేష్‌ను భయపెట్టిన సబ్జెక్ట్ ఏదో తెలుసా?

టాప్ స్టోరీస్

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!

Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!

Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!

Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!

Balakrishna - Boyapati Srinu : ఏపీ ఎన్నికలే టార్గెట్‌గా బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ ఫిల్మ్?

Balakrishna - Boyapati Srinu : ఏపీ ఎన్నికలే టార్గెట్‌గా బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ ఫిల్మ్?