అన్వేషించండి

NTR Trivikram Movie Story : షణ్ముఖుడిగా ఎన్టీఆర్ - త్రిశూలంలో DNA... త్రివిక్రమ్ విజనరీ పోస్టర్ స్టోరీ ఏంటంటే?

NTR God Of War Story : ఎన్టీఆర్ త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ పోస్టర్ క్షణాల్లోనే ట్రెండ్ అవుతోంది. అసలు ఈ ప్రాజెక్ట్ స్టోరీ ఏంటి?... పోస్టర్‌లో ఇచ్చిన హింట్స్ డీకోడ్ చేస్తే...

NTR Trivikram God Of Movie Poster Behind The Story : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొత్త మూవీ 'గాడ్ ఆఫ్ వార్' (వర్కింగ్ టైటిల్) కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. యుద్ధ భూమిలో షణ్ముఖుడి ఆయుధమైన ఈటెతో పాటు తండ్రి శివుని ఆయుధమైన త్రిశూలాన్ని హైలెట్ చేస్తూ కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేయడం భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.

దేవ సేనాధిపతి షణ్ముఖుడి చరిత్రే 'గాడ్ ఆఫ్ వార్' అని తెలుస్తుండగా... పురాణాలతో ముడిపడిన స్టోరీ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఆ పోస్టర్ డీకోడ్ చేస్తే తెలిసిన రహస్యాలేంటంటే...

హైలెట్‌గా త్రిశూలం

పోస్టర్‌లో త్రిశూలం హైలెట్‌గా నిలవగా... కింద భాగం కార్తికేయుని ఆయుధమైన ఈటెను చూపించారు. జాగ్రత్తగా గమినిస్తే... త్రిశూలం మధ్యలో DNA ఆకారంలో స్టక్చర్ కనిపించి పొగలతో ఆవరించి ఉంది. ఇది హీరో జన్మ రహస్యం... దైవిక శక్తి అనేది వంశ పారంపర్యంగా హీరో జీన్స్‌లోనే ఉందని చెప్పే సింబాలిక్ ఎక్స్‌పెరిమెంట్ అని తెలుస్తోంది. అంటే సైన్స్‌తో కలిపి స్పిరిచ్యువాలిటీ కాంబోలో మూవీ స్టోరీ ఉండబోతోందని చెప్పకనే చెప్పారు.

'ONE SPEAR ONE PURPOSE ONE DIVINE RECKONING'... అంటూ పోస్టర్‌పై హింట్ ఇచ్చారు. దీని అర్థం... 'ఒకే ఈటె... ఒకే లక్ష్యం... ఒకే దైవిక తీర్పు'. ఈ మూవీలో ఎన్టీఆర్... షణ్ముఖుడు, కార్తికేయుడు, కుమార స్వామిగా కనిపించబోతున్నట్లు ఇప్పటికే హింట్ ఇచ్చారు. పార్వతీ దేవి కార్తికేయుడికి అందించిన దైవిక ఆయుధం ఈటె. దీన్ని బట్టి ఈ చిత్రంలో హీరో సుబ్రహ్మణ్య స్వామి అంశతో శత్రువులను చీల్చి చెండాడే వారియర్‌గా కనిపించబోతున్నట్లు అర్థమవుతోంది.

Also Read : NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?

శ్లోకం... చెప్పిన కథనం

*"ॐ न जानामि शब्दं न जानामि चार्थं । न जानामि पद्यं न जानामि गद्यम् । चिदेको घडास्यः हृदि द्योतते मे । मुखान्निःसरन्ते गिरश्चापि चित्रम् ॥"* ఇదీ పోస్టర్ మధ్యలో ప్రత్యక్షమైన సంస్కృత శ్లోకం. ఆది శంకరాచార్యులు రచించిన ప్రసిద్ధ 'సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం'లో రెండో శ్లోకం. దీని అర్థం... 'నాకు శబ్ద శాస్త్రం తెలీదు. పద్యం, గద్యం రాయడం అంతకన్నా తెలియదు. కానీ నా హృదయంలో ఆరు ముఖాలు కలిగిన షడాస్యుడు లేదా షడాననుడు (సుబ్రహ్మణ్య స్వామి) స్వయం ప్రకాశంతో వెలుగుతున్నాడు. అందుకే నా నోటి నుంచి అద్భుతమైన వాక్కులు ప్రవాహంలా వెలువడుతున్నాయి.' అని అర్థం.

దీని ప్రకారం సామాన్యుడిగా ఉండే ఓ వ్యక్తిలో అంతర్గతంగా దాగి ఉండే దైవిక శక్తిని ప్రతిబింబిస్తుంది. ఏదైనా విపత్కర పరిస్థితి సంభవించినప్పుడు ఆ దైవమే ఆ వ్యక్తి చేతికి ఆయుధాన్ని ఇచ్చి దారి చూపించి శత్రు సంహారం చేయిస్తుంది. అనేదే శ్లోక సారాంశంగా తెలుస్తోంది.

యుద్ధ భూమిలో పవర్ ఫుల్ వారియర్

పోస్టర్ బ్యాగ్రౌండ్‌లో శవాల దిబ్బలు, తగలబడుతున్న ఆలయ గోపురాలు, రక్తసిక్తమైన రణభూమి, ఎర్రటి యుద్ధ జెండాలను చూపించారు. అంటే ఓ భారీ పీరియాడికల్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా లేదా దైవ సహాయంతో ధర్మాన్ని రక్షించేందుకు జరిగే ఓ వార్... పవర్ ఫుల్ వారియర్‌గా హీరో కనిపించబోతున్నట్లు స్పష్టం అవుతోంది.

ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా... ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతోన్న రెండో మూవీ. హై ఓల్టేజ్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా ప్రాజెక్టును హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. దీంతో పాటే నాగవంశీ కూడా నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

Also Read : ENE Sequel Release Date : ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : అమ్మాయిల చేతులతో పర్ఫ్యూమ్ - సైకో కిల్లర్ అమ్మాయా? అబ్బాయా?... ఓటీటీ ప్లాట్ ఫామ్‌పై బిగ్ హైప్
అమ్మాయిల చేతులతో పర్ఫ్యూమ్ - సైకో కిల్లర్ అమ్మాయా? అబ్బాయా?... ఓటీటీ ప్లాట్ ఫామ్‌పై బిగ్ హైప్
Crime Thriller Series OTT : అసలు రహస్యాన్ని బయటపెట్టే మరో సీక్రెట్ - మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ రెండో సీజన్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అసలు రహస్యాన్ని బయటపెట్టే మరో సీక్రెట్ - మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ రెండో సీజన్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Fauzi Heroine Birthday: 'ఫౌజీ' హీరోయిన్ బర్త్ డే... ప్రభాస్ ఎంత ఫుడ్ పంపించారో చూశారా?
'ఫౌజీ' హీరోయిన్ బర్త్ డే... ప్రభాస్ ఎంత ఫుడ్ పంపించారో చూశారా?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget