Devara: 'దేవర' థియేటర్‌లో అగ్ని ప్రమాదం... హద్దులు దాటిన అభిమానంతో కాలిపోయిన తారక్ భారీ కటౌట్
Devara Cut Out Burnt: 'దేవర' థియేటర్ వద్ద అగ్ని ప్రమాదం జరగ్గా, ఎన్టీఆర్ భారీ కట్ అవుట్ దగ్ధం అయ్యింది. ఈ అగ్ని ప్రమాదం హైదరాబాద్ లోనే జరిగింది. ఎవరైనా గాయపడ్డారా? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ 'దేవర' (Devara Part 1) తాజాగా థియేటర్లలోకి వచ్చింది. ఇక ఈ మూవీ థియేటర్లలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. కానీ విమర్శకులు మాత్రం కేవలం సినిమా అభిమానుల కోసం మాత్రమే అన్నట్టుగా ఉంది అని రివ్యూ ఇవ్వడంతో మిక్స్డ్ టాక్ వినిపిస్తున్నప్పటికీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఆగేలా కనిపించట్లేదు. ఇక తాజాగా వీరి అభిమానం హద్దులు దాటి ఓ థియేటర్లో అగ్ని ప్రమాదం జరిగేదాకా తీసుకెళ్లింది.
సుదర్శన్ థియేటర్లో అగ్నిప్రమాదం
'దేవర' మాస్ ఫీస్ట్ మొదలు కావడంతో సినిమా ప్రదర్శితం అవుతున్న ప్రతి థియేటర్లోనూ సంబరాలు మిన్నంటేలా జరుపుకొంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అందులో భాగంగానే తాజాగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సుదర్శన్ థియేటర్లో అభిమానులు భారీ ఎత్తున టాపాకాయలు పేల్చారు. అయితే పొరపాటున ఆ టపాకాయల నిప్పు రవ్వలు, థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన తారక్ భారీ కటౌట్ పై పడటంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడి కటౌట్ మొత్తం దగ్ధమైంది. ఇక్కడ ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం ఏమిటంటే అగ్ని ప్రమాదంలో అభిమానులు ఎవ్వరూ గాయపడలేదు. అదృష్టవశాత్తూ ఎన్టీఆర్ అభిమానులు ఈ ఫైర్ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నారు. ఇక మరో చోట ఎన్టీఆర్ అభిమానులు ఏకంగా మేక తల నరికేసి సెలబ్రేట్ చేసుకున్న మరో వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు పడుతుంది. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కూడా అభిమానం హద్దులు దాటుతోంది అనడానికి ఇదే నిదర్శనం. కాస్త అజాగ్రత్తగా ఉన్నా సరే ఈ కటౌట్ ప్రమాదం వల్ల అభిమానులే కాదు జనాలు కూడా తీవ్ర గాయాల పాలయ్యేవారు. ఊహించని విధంగా సుదర్శన్ థియేటర్లో జరిగిన ఈ అగ్ని ప్రమాదం మూవీ లవర్స్ ను నివ్వెర పోయేలా చేసింది. మరి ఈ ఇన్సిడెంట్ పై తారక్ స్పందిస్తాడా లేదా అన్నది చూడాలి.
A fan burnt the cutout of Ntr at main theatre Sudarshan after watching #Devara?pic.twitter.com/NWPF7vHXnx
— At Theatres (@AtTheatres) September 27, 2024
మూవీ ఎలా ఉందంటే...
సినిమాలో కొత్తదనం లేదు, హీరోయిజం అనుకున్నంతగా ఎలివేట్ అవ్వలేదు అనే టాక్ వినిపిస్తోంది. పైగా కొన్ని చోట్ల కొరటాల మార్కు మిస్ అయ్యిందని అంటున్నారు. అయితే సినిమాకు ప్లస్ పాయింట్ మాత్రం ఎన్టీఆర్ అని టాక్ నడుస్తోంది. కానీ ఎన్టీఆర్ అద్భుతంగా నటించారని సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏదేమైనా ఈ మూడు రోజులూ ఎన్టీఆర్ అభిమానుల హడావిడే కనిపిస్తుంది. ఆ తర్వాత ప్రేక్షకులు సినిమాకు ఎలాంటి తీర్పు ఇస్తారు ? అనేది తేలిపోనుంది. అయితే 'దేవర' దాదాపు 100 కోట్ల ఓపెనింగ్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.
Also Read: 'లవ్ సితార' రివ్యూ: శోభితా ధూళిపాళ పెళ్లి సినిమా - Zee5 OTTలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్