అన్వేషించండి

మరోసారి వాయిదా పడ్డ 'గేమ్ చేంజర్' ఫస్ట్ సింగిల్ - దసరాకి రావడం లేదట, కారణం?

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' సినిమా నుంచి దసరాకి రావలసిన ఫస్ట్ సింగిల్ మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. పీఆర్ టీమ్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంచలన దర్శకుడు శంకర్ ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ తప్పితే మరో అప్డేట్ రాలేదు. ఈ విషయంలో ఫాన్స్ మేకర్స్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ సింగిల్ రాబోతుందని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే కదా.

దసరాకి 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ సింగిల్ ఉంటుందని ప్రచారం జరిగింది. దీంతో మెగా ఫ్యాన్స్ అయితే ఫస్ట్ సింగిల్ కోసం ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తూ వచ్చారు. కానీ మరోసారి ఫ్యాన్స్ ని కి నిరాశ మిగిలింది. తాజా సమాచారం ప్రకారం దసరాకి రావలసిన 'గేమ్ చేంజర్' ఫస్ట్ సింగిల్ మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. దసరాకి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయడం లేదని పిఆర్ టీం నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. దీనికి సంగీత దర్శకుడు తమన్ కారణమని చెబుతున్నారు. తమన్ ఇంకా సాంగ్ ఫైనల్ మిక్సింగ్ చేయలేదట. గత కొద్ది వారాలుగా 'భగవంత్ కేసరి' సినిమాపై తమన్ ఫోకస్ చేయడం వల్ల గేమ్ ఛేంజర్ సాంగ్ ఫైనల్ మిక్సింగ్ అవ్వకపోవడం దానికి తోడు త్వరలోనే తమన్ లండన్ పర్యటన కూడా ఉండటంతో గేమ్ చేంజర్ ఫస్ట్ సింగిల్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్' ఫస్ట్ సింగిల్ కు సంబంధించి ఇప్పటికే తెలుగు వర్షన్ ఫైనల్ మిక్సింగ్ కంప్లీట్ అయిందని కానీ హిందీ, తమిళ వెర్షన్ సాంగ్స్ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడంతో దసరాకి ఫస్ట్ సింగిల్ విడుదల చేయడం లేదని అంటున్నారు. దీంతో ఫిలిం సర్కిల్స్ లో ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో ఈ వార్త విన్న మెగా ఫాన్స్ తీవ్రం నిరాశకు లోనవుతూ గేమ్ చేంజర్ మేకర్స్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి గేమ్ చేంజర్ ఫస్ట్ సింగిల్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది చూడాలి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒకటి తండ్రి పాత్ర కాగా మరొకటి కొడుకు పాత్ర అని తెలుస్తోంది.

కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రీసెంట్ గానే కొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టిన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తమిళ నటుడు ఎస్ జె సూర్య, సీనియర్ హీరో శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో ఆగ్ర నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఎస్. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Also Read : టాలీవుడ్ నేషనల్ అవార్డ్ విన్నర్స్​కు 'మైత్రీ' గ్రాండ్ పార్టీ!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Puri Jagannadh: ఛార్మి కంట్రోల్‌లో పూరి... పెళ్ళాం పిల్లల్ని వదిలేశాడు... కెరీర్ నాశనం చేసుకున్నాడు
ఛార్మి కంట్రోల్‌లో పూరి... పెళ్ళాం పిల్లల్ని వదిలేశాడు... కెరీర్ నాశనం చేసుకున్నాడు
Peddi OTT : పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్ - మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మా?
పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్ - మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మా?
Shanmukh Jaswanth : నిన్న ఆస్పత్రి బెడ్‌పై... ఇవాళ షూటింగ్ సెట్‌లో - షణ్ముఖ్ జస్వంత్ పోస్ట్ వెనుక స్టోరీ ఏంటి?
నిన్న ఆస్పత్రి బెడ్‌పై... ఇవాళ షూటింగ్ సెట్‌లో - షణ్ముఖ్ జస్వంత్ పోస్ట్ వెనుక స్టోరీ ఏంటి?
Mirzapur The Movie Teaser: 'మీర్జాపూర్' సినిమా టీజర్ రివ్యూ... బబ్లూ పండిట్ బదల్ హోగయా!
'మీర్జాపూర్' సినిమా టీజర్ రివ్యూ... బబ్లూ పండిట్ బదల్ హోగయా!

వీడియోలు

NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Hardik Pandya To KKR For IPL 2027? | ముంబైని వీడనున్న హార్దిక్? KKR లోకి భారీ డీల్
Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్
ICC Rankings 2026 Shubman Gill | వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ketan Agarwal Murder Case Pune: పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ - సియా మీద తోసేసి తప్పించుకుంటున్న బాయ్ ఫ్రెండ్ చేతన్
పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ - సియా మీద తోసేసి తప్పించుకుంటున్న బాయ్ ఫ్రెండ్ చేతన్
Puri Jagannadh: ఛార్మి కంట్రోల్‌లో పూరి... పెళ్ళాం పిల్లల్ని వదిలేశాడు... కెరీర్ నాశనం చేసుకున్నాడు
ఛార్మి కంట్రోల్‌లో పూరి... పెళ్ళాం పిల్లల్ని వదిలేశాడు... కెరీర్ నాశనం చేసుకున్నాడు
Peddi OTT : పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్ - మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మా?
పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్ - మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మా?
Venezuela Earthquake: వెనిజులాలో భూకంపం వల్ల జరిగిన విధ్వంసంపై ప్రధాని మోదీ విచారం! సాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని భరోసా! 
వెనిజులాలో భూకంపం వల్ల జరిగిన విధ్వంసంపై ప్రధాని మోదీ విచారం! సాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని భరోసా! 
Venezuela Earthquake: వెనిజులాలో ప్రకృతి ఎమర్జెన్సీ! వందేళ్లలో ఎప్పుడూ చూడని విధ్వంసం! పేకమేడలా కూలిన భవనాలు!
వెనిజులాలో ప్రకృతి ఎమర్జెన్సీ! వందేళ్లలో ఎప్పుడూ చూడని విధ్వంసం! పేకమేడలా కూలిన భవనాలు!
OG 2 Update: పవన్ ఫుల్ హ్యాపీ... 'ఓజీ 2'కు అంతా రెడీ... సుజీత్ క్లూస్ ఇచ్చారా?
పవన్ ఫుల్ హ్యాపీ... 'ఓజీ 2'కు అంతా రెడీ... సుజీత్ క్లూస్ ఇచ్చారా?
Venezuela Earthquake: వెనిజులాలో భారీ భూకంపం! పెను విధ్వంసం! లక్ష మంది వరకు మృతి! 
వెనిజులాలో భారీ భూకంపం! పెను విధ్వంసం! లక్ష మంది వరకు మృతి! 
NBK112 Launch Photos: బాలకృష్ణ - కొరటాల శివ సినిమా ఓపెనింగ్ ఫోటోలు... స్పెషల్ గెస్ట్ ఎవరో చూశారా?
బాలకృష్ణ - కొరటాల శివ సినిమా ఓపెనింగ్ ఫోటోలు... స్పెషల్ గెస్ట్ ఎవరో చూశారా?
Embed widget