Nagma Wedding: ఈ వయస్సులో పెళ్లేంటి? నటి నగ్మా నిర్ణయంపై నెటిజన్స్ సెటైర్లు!
సీనియర్ హీరోయిన్ నగ్మా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో అప్పటి కాలంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సీనియర్ హీరోయిన్ నగ్మా కూడా ఒకరు. తెలుగులో ఉన్న అగ్ర హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లాంటి టాప్ స్టార్ట్స్ తో నటించి చాలా తక్కువ సమయంలో తెలుగులో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంది. సల్మాన్ ఖాన్ సరసన 'భాగీ' సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈమె అక్కడ పలు సినిమాల్లో నటించింది. తెలుగు, హిందీ తో పాటు తమిళ, మలయాళ, కన్నడ, భోజ్ పురి, మరాఠీ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది.
1990 నుంచి 2008 వరకు సినిమాల్లో కొనసాగిన నగ్మా, ఆ తర్వాత రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. 2004లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరగా.. 2015లో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఎంపికయింది. ఇక ఈ మధ్య హీరోలతో ఎఫైర్స్ వార్తలతో ఎక్కువగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇదిలా ఉంటె నగ్మా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఆమెకు 48ఏళ్ళు. కానీ తాజాగా ఈమె పెళ్లిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు తనకు పెళ్లి చేసుకోవాలని ఉందంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది నగ్మా. ఇక ఆమె మాటలు విన్న నెటిజెన్స్ ఈ వయసులో పెళ్లి ఏంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నగ్మా తన రాజకీయ జీవితం, పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. తనకు ఇప్పుడు 48 ఏళ్ళు ఉన్నా కూడా పెళ్లి చేసుకొని భర్త, పిల్లలతో కుటుంబాన్ని పోషించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. పెళ్లి చేసుకోకూడదు అనే నియమం నేను అసలు పెట్టుకోలేదు. పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి. మనకు ఒక తోడు, కుటుంబం కావాలని నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది. అయితే కాలం కలిసి వస్తే నాకు పెళ్లి అవుతుందేమో చూడాలి. పెళ్లి అయితే కనుక నేను ఫుల్ హ్యాపీగా ఉంటాను. కానీ సంతోషం కొంతకాలానికి పరిమితం కాకూడదు కదా.. అంటూ చెప్పుకొచ్చింది నగ్మా.
మరోవైపు ఇప్పటివరకు పెళ్లి చేసుకొని నగ్మా అప్పట్లో స్టార్ హీరోలతో ఎఫైర్స్ నడిపిందని రూమర్స్ కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా స్టార్ క్రికెటర్ గంగూలితో పెళ్లి వరకు వెళ్లి మొదటి భార్య కలుగజేసుకోవడంతో నగ్మా పక్కకు తప్పకుందనే వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. ఆ తర్వాత భోజ్ పూరి నటుడు రవి కిషన్ తో కూడా నగ్మా లవ్ ట్రాక్ నడిపిందనే వార్తలు వినిపించాయి. కానీ అప్పటికే రవి కిషన్ కి పెళ్లి అయిపోవడంతో వీరి ప్రేమకు చెక్ పడింది.
అలాగే కోలీవుడ్ హీరో శరత్ కుమార్ తో కూడా నగ్మా సహజీవనం చేసిందని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఇందులో కూడా నిజం ఎంతుందో తెలియదు. అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న శరత్ కుమార్, నగ్మాతో కూడా సీక్రెట్ ఎఫైర్ నడపడం.. అది కాస్త ఆయన భార్య రాధిక తెలియడంతో, ఆమె నగ్మా కు వార్నింగ్ ఇచ్చినట్లు కూడా కోలీవుడ్లో గుసగుసలు వినిపించాయి. ఇదిలా ఉంచితే.. నగ్మా పెళ్లి చేసుకోవాలనే నిర్ణయంపై నెటిజనులు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఈ వయస్సులో పెళ్లేంటని అంటున్నారు. 48 ఏళ్లు వచ్చేశాయి.. అంత లేటు ఎందుకు చేశావని అడుగుతున్నారు. అయినా, పెళ్లి అనేది ఆమె సొంత విషయం.. ఎప్పుడు చేసుకోవాలా అనే ఆమె ఇష్టం.. మీరేంటి డిసైడ్ చేసేదంటూ.. ఆమె అభిమానులు ట్రోలర్స్‌కు గట్టిగానే సమాధానం చెబుతున్నారు.
Also Read : అనుష్క 'కథనార్' గ్లింప్స్ - వణుకు పుట్టిస్తోన్న పుర్రె మనుషుల ఆటవిక యుద్ధం
Join Us on Telegram: https://t.me/abpdesamofficial