35 Movie Teaser: ‘కల్కీ 2898 AD’ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయనున్న ‘35 చిన్న కథ కాదు’ - అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన రానా
35 Movie Teaser: నివేదా థామస్ హీరోయిన్‌గా నటించిన ‘35 - చిన్న కథ కాదు’ సినిమా అప్పుడే టీజర్ గురించి కూడా అప్పుడే అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. కానీ దానికి ‘కల్కి 2898 AD’తో లింక్ పెట్టారు.

35 Chinna Katha Kadu Movie Teaser: ప్రస్తుతం ప్రేక్షకుల్లో ‘కల్కి 2898 AD’ ఫీవర్ మామూలుగా లేదు. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ ప్యాన్ వరల్డ్ మూవీ చూడడానికి మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ క్రేజ్‌ను క్యాచ్ చేసుకోవడానికి ఒక మూవీ టీమ్ నిర్ణయించుకుంది. అదే ‘35 - చిన్న కథ కాదు’ మూవీ. నివేదా థామస్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ బయటికొచ్చాయి. తాజాగా టీజర్ అప్డేట్‌ను షేర్ చేస్తూ.. ‘35’ టీజర్‌కు ‘కల్కి 2898 AD’కు లింక్ చేశారు మేకర్స్. ఇంతకీ ఏంటా లింక్ అని అనుకుంటున్నారా?
అక్కడే ట్విస్ట్..
యంగ్ బ్యూటీ నివేదా థామస్.. తెలుగు తెరపై కనిపించి చాలాకాలం అయ్యింది. తాజాగా తను ‘35 - చిన్న కథ కాదు’ అనే మూవీలో నటిస్తున్నానంటూ తన అప్‌కమింగ్ సినిమాపై అప్డేట్ ఇచ్చింది నివేదా. టైటిల్ ఫస్ట్ లుక్‌తో పాటు చాలావరకు సినిమాకు సంబంధించిన వివరాలు అన్నీ అప్పుడే బయటికొచ్చేశాయి. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమయ్యిందో తెలియదు కానీ అప్పుడే ‘35 - చిన్న కథ కాదు’ టీజర్‌ను కూడా లాంచ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ అందులోని చిన్న ట్విస్ట్ ఉంది. ‘కల్కి 2898 AD’ సినిమా చూసేవాళ్లు మాత్రమే ముందుగా ‘35 - చిన్న కథ కాదు’ టీజర్‌ను చూడగలరు.
టీజర్‌కు ప్రీమియర్స్..
పీవీఆర్, ఐనాక్స్ లాంటి నేషనల్ థియేటర్ చైన్స్‌లో ‘కల్కి 2898 AD’ సినిమాతో పాటు ‘35 - చిన్న కథ కాదు’ టీజర్ కూడా ప్రీమియర్ కానుందని మేకర్స్ ప్రకటించారు. ‘ఇదో మీరు జూస్తే చాలు, మాకదే పదేలు’ అంటూ తెలంగాణ యాసలో టీజర్‌ను చూడమంటూ పిలుపునిచ్చారు. ఎలాగో ‘కల్కి 2898 AD’ మూవీని ఫస్ట్ డే చూడాలని ప్రేక్షకులంతా తెగ ఎదురుచూస్తున్నారు. అలాంటి ఒక హాలీవుడ్ రేంజ్ యాక్షన్ మూవీతో ‘35 - చిన్న కథ కాదు’ లాంటి ఒక రీజియనల్ మూవీ టీజర్‌ను అటాచ్ చేయాలి అనుకోవడం కొత్త ప్రయోగమే. అంతే కాకుండా ఈ ఐడియా వల్ల మూవీ టీజర్.. చాలామంది ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం ఉంది.
View this post on Instagram
అదే డేట్..
‘35 - చిన్న కథ కాదు’తో నంద కిషోర్ ఏమని.. దర్శకుడిగా టాలీవుడ్‌లో పరిచయవుతున్నాడు. ఇందులో నివేదా థామస్‌తో పాటు ప్రియదర్శి కూడా లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే కథ అని క్లియర్‌గా అర్థమయినా కూడా తెలుగుతో పాటు తమిళ, మలయాళంలో కూడా విడుదల కానుంది. ఆగస్ట్ 15న రేసు నుండి ‘పుష్ప 2’ తప్పుకోవడంతో ‘35 - చిన్న కథ కాదు’.. అదే రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంది. అంతే కాకుండా రానా దగ్గుబాటి.. ఈ మూవీని ప్రజెంట్ చేయడం మరొక స్పెషాలిటీ. సృజన్, సిద్ధార్థ్ కలిసి ‘35 - చిన్న కథ కాదు’ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read: తెలుగులో తన ఫేవరెట్ హీరో ఎవరో చెప్పేసిన దీపికా - ప్రభాస్ అయితే కాదు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

