35 Chinna Katha Kaadu: ఇంతకి తొమ్మిది కంటే పది పెద్దది ఎలా అయ్యింది! - ఆసక్తి పెంచుతున్న '35- చిన్న కథ కాదు' టీజర్
35 Chinna Katha Kaadu Movie: రానా దగ్గుబాటి సమర్పణలో మలయాళీ బ్యూటీ నివేదా థామన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా 35- చిన్న కథ కాదు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్
35 Chinna Katha Kaadu Movie Teaser Release: మలయాళీ బ్యూటీ నివేదా థామస్, విశ్వదేవ్ ఆర్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం '35- చిన్న కథ కాదు'. ఈ సినిమాను స్టార్ హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. డైరెక్టర్ నందకిషోర్ ఇమాని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నివేద తల్లి పాత్ర పోషిస్తుంది. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా టీజర్ తాజాగా మూవీ టీం రిలీజ్ చేసింది. ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామాగా టీజర్ సాగుతూ టీజర్ ఆకట్టుకుంటుంది.
'విలువే లేని సున్న పక్కన ఒకటి వేస్తే పది.. తొమ్మిది కంటే పెద్దది అని ఎలా చెప్తరు' అనే నివేదా థామస్ డైలాగ్‌తో టీజర్ మొదలైంది. ఇంతకి పది పెద్దది ఎట్లా అయ్యింది అయ్యాగారు అని ఓ పూజారి చెప్పే డైలాగ్ ఆసక్తిగా ఉంది. టీజర్ నటి గౌతమి అప్పియరెన్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. చిన్నప్పుడే పెళ్లి చేశారా? అంటూ నివేదాతో మాటలు కలుపుతుంది. ఆ తర్వత స్టూడెంట్ పాత్రలో కనిపించిన చిన్నారి 100x0=0 ఎలా అవుతుందని ప్రశ్నించడంతో.. ప్రియదర్శ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. ఇందులో ప్రియదర్శి మ్యాథ్స్ టీజర్‌గ కనిపించబోతున్నాడని టీజర్ చూస్తే అర్థమైపోతుంది. "ఫండమెంటల్స్ ప్రశ్నిస్తే.. మీ ఫ్యూచర్ పెద్ద జీరో" అనే డైలాగ్‌తో టీజర్‌లో ప్రియదర్శి పాత్ర ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత విద్యార్థి తండ్రితో మినిమమ్ 35 పాస్ మార్కులు తెచ్చుకోమనండి సర్ అనే డైలాగ్ ఆసక్తిగా ఉంది.
ఈ సన్నివేశంలో విద్యార్థి పేరెంట్ స్థానంలో నటుడు భాగ్యరాజ్ కనిపించారు. చూస్తుంటే ఈ సినిమాలో ఆయనది కీ రోల్ అర్థమైపోతుంది. ప్రియదర్శి ఏం చదువుకున్నారు మీరూ అని అడగ్గా.. "అమ్మ టెన్త్ ఫెయిల్.. కొడుకు ఐదవ తరగతి ఫెయిల్ చిన్న కథ కాదు" అని విశ్వదేవ్ ఆర్ పాత్ర డైలాగ్ ఎమోషన్‌ని పండించింది. ఈ సీన్ నివేథా కన్నీరు పెట్టుకుంటూ ఎమోషనల్ అవుతుంది. మొత్తానికి ఓ విద్యార్థి చూట్టూ '35- చిన్న కథ కాదు' కథ సాగనుందని టీజర్‌తో క్లారిటీ ఇచ్చారు. ఐదవ తరగతి ఫెయిల్ అయిన కొడుకుని ఇంట్లో వాళ్లు మందలించడం అతడు ఇంట్లో నుంచి పారిపోతాడు. దీంతో నివేధా థామస్ నాకు నా కొడుకు కావాలి అంతే అని ఏడూస్తూ ఎమోషనల్‌గా చెప్పిన డైలాగ్ బాగా ఆకట్టుకుంది. మొత్తానికి ఫ్యామిలీ, ఎమోషన్‌గా సాగిన టీజర్ ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. కాగా చాలా గ్యాప్ తర్వాత నివేదా థామస్ వెండితెరపై ఈ సినిమాతో సందడి చేయబోతుంది. చివరగా ఆమె ‘శాకిని డాకిని’ అనే సినిమాలోకనిపించింది. లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘35- చిన్న కథ కాదు’ సినిమాతో ఫ్యాన్స్‌ని పలకరించబోతుంది.
View this post on Instagram