Swayambhu Release Date : చరిత్ర చూడని వారియర్ 'స్వయంభు' - నిఖిల్ హిస్టారికల్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Swayambhu Movie : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ లేటెస్ట్ హిస్టారికల్ ఎపిక్ 'స్వయంభు'. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను స్పెషల్ మేకింగ్ వీడియోతో మూవీ టీం అనౌన్స్ చేసింది.

Nikhil Siddhartha's Swayambhu Movie Release Date : 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నారు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్. తాజాగా మరో హిస్టారికల్ ఎపిక్ 'స్వయంభు'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే లుక్స్ రిలీజ్ చేయగా ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా... మూవీ రిలీజ్ డేట్‌తో పాటు స్పెషల్ వీడియోను షేర్ చేసుకున్నారు నిఖిల్.
రిలీజ్ ఎప్పుడంటే?
ఈ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేయనున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తుండగా... సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవర్ ఫుల్ వారియర్‌గా నిఖిల్ కనిపించనున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ మూవీని నిర్మిస్తుండగా... బాహుబలి, RRR మూవీస్ ఫేం సెంథిల్ కుమార్ DOPగా వ్యవహరించారు. రవి బ్రసూర్ మ్యూజిక్ అందించారు. త్వరలోనే మూవీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ రానున్నాయి.
Also Read : బాలయ్యతో హీరోయిన్ స్పెషల్ సాంగ్? - సిల్వర్ స్క్రీన్‌పై ఈ కాంబో ఎక్స్‌పెక్ట్ చేసుండరు!
స్పెషల్ వీడియో
'స్వయంభు' మూవీ షూటింగ్ పూర్తైందని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. 'ఒక్క సినిమా... రెండేళ్ల కష్టం... పదుల సంఖ్యల్లో సెట్స్. అదొక సామ్రాజ్యం. వేల కొద్దీ సవాళ్లు అదొక యుద్ధం. మన భారత దేశ చరిత్రకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఒట్టి రాజుల కథలో యుద్ధ గాథలో మాత్రమే కాదు. అవి మన సంస్కృతికి పునాదులు. ఆ హిస్టరీలో చెప్పని ఓ గొప్ప వీరుడి కథే ఈ స్వయంభు.' అంటూ హైప్ క్రియేట్ చేశారు నిఖిల్. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర చూడని ఎందరో రాజులు, వారి కథల్లో ఓ గొప్ప యోధుడి కథను 'స్వయంభు'గా చూపించనున్నట్లు తెలుస్తోంది.
నిఖిల్ ఫ్రెండ్...
ఈ సందర్భంగా నిఖిల్ తన బెస్ట్ ఫ్రెండ్ మారుతిని ఇంట్రడ్యూస్ చేశారు. అదే ఆయన గుర్రం. 'నేను ప్రతీ రోజూ సెట్‌లోకి వెళ్లినప్పుడల్లా వెయ్యేళ్లు వెనక్కి వెళ్లిన ఎక్స్‌పీరియన్స్ కలుగుతుంది. దానికి ప్రొడక్షన్ డిజైనర్స్ ఎంతో శ్రమతో ప్రాణం పోశారు. ఈ ప్రపంచాన్ని అద్భుతంగా చూపించిన సెంథిల్ సార్, మాయా జాలానికి జయగర్జన మ్యూజిక్ డైరెక్టర్ రవి బ్రసూర్, ఫైట్స్ చేయించిన నేషనల్ అవార్డ్ విన్నర్ సోలోమాన్ మాస్టర్ ఎంతోమంది టెక్నీషియన్స్ ఫైనల్లీ 170 రోజుల షూటింగ్ పూర్తైంది.' అంటూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.
View this post on Instagram






















