Unik Star Nikhil: నిఖిల్... ఇక నుంచి యూనిక్ స్టార్ - కంటెంట్‌కు తగ్గ ట్యాగ్!
యంగ్ హీరోలకూ ట్యాగ్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరి పేరు ముందు ఏదో ఒకటి చేరుతోంది. కొందరి ట్యాగ్స్ విమర్శలకు దారి తీస్తుంటే... నిఖిల్ ట్యాగ్ మాత్రం కంటెంట్‌కు తగ్గట్టు ఉందని కాంప్లిమెంట్స్ అందుకుంటోంది.

చిరంజీవిని మెగాస్టార్, బాలకృష్ణను నట సింహం, నాగార్జునను కింగ్, వెంకీని విక్టరీ అనడం అభిమానులకు ప్రౌడ్ మూమెంట్. వాళ్ళ తర్వాత తరం హీరోలకూ ట్యాగ్స్ ఉన్నాయి. ఇప్పుడిప్పుడు యంగ్ హీరోలకు కూడా ట్యాగ్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్క హీరో ముందు ఏదో ఒక ట్యాగ్ వచ్చి చేరుతోంది. కొందరి ట్యాగ్స్ విమర్శల పాలైతే... నిఖిల్ సిద్ధార్థ ట్యాగ్ మాత్రం కంటెంట్‌కు తగ్గట్టు ఉందని నెటిజన్స్ నుంచి రెస్పాన్స్ అందుకుంటోంది.
నిఖిల్... ఇక నుంచి యూనిక్ స్టార్!
జూన్ 1న నిఖిల్ సిద్ధార్థ పుట్టిన రోజు. అతడికి విషెష్ చెబుతూ 'స్వయంభూ' యూనిట్ పోస్టర్ విడుదల చేశారు. అందులో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha)ను యూనిక్ స్టార్ (Unik / Unique Star) అని పేర్కొన్నారు. 'స్వామి రారా' నుంచి నిఖిల్ తన స్ట్రాటజీ మార్చారు. డిఫరెంట్ కంటెంట్ ఉన్న ఫిలిమ్స్ చేస్తున్నారు. యూనిక్ స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలు చేసే అతనికి యూనిక్ స్టార్ ట్యాగ్ ఇవ్వడం కరెక్టే అంటున్నారు ఫ్యాన్స్. ఆడియన్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.
Also Read: మళ్ళీ నోరు జారిన నటకిరీటి... ఈసారి అలీని ఏకంగా బూతులతో... రాజేంద్ర ప్రసాద్ తాగి వచ్చారా?
View this post on Instagram
'కార్తికేయ 2'తో నిఖిల్ పాన్ ఇండియా సక్సెస్ కొట్టారు. ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమా 'స్వయంభు' చేస్తున్నారు. ఇది ఆయన 20వ సినిమా. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ హిస్టారికల్ యాక్షన్ సినిమాలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లు. పిక్సెల్ స్టూడియోస్ పతాకం మీద భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. 'ఠాగూర్' మధు సమర్పకులు. ఇందులో నిఖిల్ యోధునిగా నటిస్తున్నారు.
Also Read: వదిలేయండ్రా బాబూ... ఈవిడ 'ఖలేజా'లో దిలావర్ సింగ్ వైఫ్ కాదు... ఇదిగో క్లారిటీ
నిఖిల్ హీరోగా... సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న 'స్వయంభూ' సినిమాకు సంగీతం: రవి బస్రూర్, సినిమాటోగ్రఫీ: కెకె సెంథిల్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: ఎం ప్రభాహరన్ - రవీంద్ర, కూర్పు: తమ్మిరాజు, మాటలు: విజయ్ కామిశెట్టి, యాక్షన్: కింగ్ సోలమన్ - స్టంట్ సిల్వా, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, నిర్మాణ సంస్థ: పిక్సెల్ స్టూడియోస్, సమర్పణ: 'ఠాగూర్' మధు, నిర్మాతలు: భువన్ - శ్రీకర్, రచన - దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి.





















