News
News
వీడియోలు ఆటలు
X

Nikhil Wife Pallavi Varma: సాడ్ స్టోరీలు చెప్పి నన్ను పడేశాడు: నిఖిల్ భార్య పల్లవి

ఇటీవల వెన్నెల కిషోర్ హోస్ట్ గా ‘అలా మొదలైంది’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మొదటి అతిథిగా నిఖిల్ దంపతులను ఆహ్వానించారు నిర్వాహకులు.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ లో వరుస హిట్ లతో దూసుకుపోతున్నారు హీరో నిఖిల్. ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. నార్మల్ గా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక 2020 లాక్ డౌన్ సమయంలో  నిఖిల్ తన ప్రేయసి పల్లవిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత ఈ జంట పెద్దగా బయట ఎక్కడా కనిపించలేదు. అయితే ఇటీవల వెన్నెల కిషోర్ హోస్ట్ గా ‘అలా మొదలైంది’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మొదటి అతిథిగా నిఖిల్ దంపతులను ఆహ్వానించారు నిర్వాహకులు. నిఖిల్ తన భార్య పల్లవితో కలసి టాక్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిఖిల్ సినిమా, వ్యక్తిగత విశేషాలను పంచుకున్నారు. అందుకు సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఈ టాక్ షో లో నిఖిల్ ను పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు వెన్నెల కిషోర్. తన మొదటి ప్రశ్నతోనే నిఖిల్ ను ఇరికించేశారు. నిఖిల్ ను పల్లవి అమ్మానాన్నల పేర్లేంటో చెప్పమని అడిగారు కిషోర్. అయితే నిఖిల్ అత్తమామల పేర్లు చెప్పడంలో కాస్త తడబడ్డారు. దీంతో వెంటనే ఆయన భార్య ‘పెళ్లైంపోయింది కదా వాళ్లతో పనేముంది, మర్చిపోయాడు’ అంటూ పంచ్ వేసింది. దీంతో వెన్నెల కిషోర్ నవ్వుకున్నారు. తర్వాత నిఖిల్ లవ్ స్టోరీ గురించి అడిగారు వెన్నెల కిషోర్. దీంతో నిఖిల్ ఇంట్లో చెప్పిన స్టోరీ చెప్పాలా? నిజంగా జరిగింది చెప్పాలా అని కౌంటర్ వేశారు. ‘‘నిజం చెప్తే పేరెంట్స్ చూస్తారేమో’’ అని అఖిల్ అంటుంటే.. ’’చూడరులే చెప్పు’’ అని కిషోర్ అన్నారు. తర్వాత లవ్ స్టోరీ గురించి పల్లవి చెప్పుకొచ్చింది. నిఖిల్ సాడ్ స్టోరీలు చెప్పి తనను ఇంప్రెస్ చేసేవాడని చెప్పింది పల్లవి. ఇతనికి నిజంగా ఇన్ని బాధలు ఉన్నాయా అని అనుకున్నానని అంది. తనను ఇంప్రెస్ చేయడానికే అలా చెప్పాడని తర్వాత తెలిసిందని చెప్పుకొచ్చింది. ఇలా ఎంతో సరదాగా ఈ ప్రోమో సాగింది. ఇక ఫుల్ ఎపిసోడ్ లో వెన్నెల కిషోర్ ఇంకెంత ఫన్ చేశారో చూడాలి. ఈ కార్యక్రమం మార్చి 28 న ప్రసారం కానుంది. 

కాగా, నిఖిల్-పల్లవి విడిపోతున్నారు అంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే త్వరలో విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు పుకార్లు వచ్చాయి. అయితే వీటిపై నిఖిల్ తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. తన భార్యతో క్లోజ్ గా ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఆ విడాకుల వార్తలకు చెక్ పడింది. 2020లో సరిగ్గా లాక్ డౌన్ టైమ్ లో నిఖిల్ పల్లవిని వివాహం చేసుకున్నారు. పల్లవి వృత్తి రీత్యా డాక్టర్. వీరి పెళ్లి కుటుంబ సభ్యుల, సన్నిహితుల సమక్షంలో సింపుల్ గా జరిగింది. ఇక నిఖిల్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారు. స్పై టైటిల్ తో యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు.  ఇది పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది.

Also Read 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Published at : 24 Mar 2023 06:24 PM (IST) Tags: Nikhil Siddharth Pallavi Varma Nikhil Siddharth Wife Nikhil Movies

సంబంధిత కథనాలు

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు 

Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు 

ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు 

ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు 

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?

Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?