అన్వేషించండి

Niharika Konidela: నేను బ్లాక్ చేయలేదు - రెండో పెళ్లిపై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు

Niharika Konidela: మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల.. తాజాగా విడాకులపై ఘాటు వ్యాఖ్యలు చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా రెండో పెళ్లిపై కూడా తను ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Niharika Konidela about Second Marriage: మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల విడాకుల విషయంలో కొన్నిరోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అసలు అంత గొప్పగా పెళ్లి చేసుకొని అప్పుడే విడాకులు ఎందుకు తీసుకుంది అంటూ నెటిజన్లు దీనిని హాట్ టాపిక్‌గా డిస్కషన్ పెట్టారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక.. తన పెళ్లి గురించి, విడాకుల గురించి ఆసక్తికర స్టేట్‌మెంట్స్ చేసింది. అసలు విడాకులు ఎందుకు తీసుకుందో ఆ విషయం మాత్రం బయటపెట్టలేదు కానీ.. దాని తర్వాత జరిగిన పరిణామాల గురించి మాత్రం చెప్పుకొచ్చింది. ఇక అదే ఇంటర్వ్యూలో రెండో పెళ్లి గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నిహారిక కొణిదెల.

వదిన లావణ్య కూడా అదే చేస్తుంది..

‘ఒక మనసు’ అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమయ్యింది నిహారిక కొణిదెల. అప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి కేవలం హీరోలు మాత్రమే ఎంట్రీ ఇచ్చారు. అలాంటి కుటుంబం నుంచి హీరోయిన్‌గా ముందుగా నిహారిక అడుగుపెట్టడంతో తన లాంచ్.. చాలా గ్రాండ్‌గా జరిగింది. ఇక పెళ్లి ఫిక్స్ అవ్వగానే సినిమాలకు దూరమయ్యింది. ఆ విషయంపై తను తాజాగా స్పందించింది. పెళ్లి అవ్వగానే హీరోయిన్స్ సినిమాలు మానేస్తారని అందరూ ఎందుకు అనుకుంటారో తెలియదు అంటూ చెప్పుకొచ్చింది. అది కూడా ఒక కెరీరే అని.. జాబ్ లాంటిదే అంటూ తన అభిప్రాయాన్ని తెలిపింది. పెళ్లి అయితే జాబ్ మానేయం కదా.. ఇది కూడా అంతే అని చెప్పింది. అందుకే తన వదిన లావణ్య కూడా పెళ్లి తర్వాత కెరీర్‌ను కంటిన్యూ చేస్తుందని క్లారిటీ ఇచ్చింది.

అలాంటి తండ్రి దొరకడం అదృష్టం..

విడాకుల తర్వాత తన తండ్రి నాగబాబు తనకు చాలా సపోర్ట్ చేశారని నిహారిక చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘‘నీకు 60 ఏళ్లు వచ్చేంతవరకు నువ్వు నా ఇంట్లో ఉండొచ్చు, నీ గురించి ఎవరు ఏమి అనుకున్నా నేను పట్టించుకోను. నువ్వు నాకు దొరికిన వరం’’ అని నాగబాబు చెప్పారని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది. తనకు అలాంటి తండ్రి దొరకడం అదృష్టమని చెప్పుకొచ్చింది. ఇక ఈ ఇంటర్వ్యూలో తను రెండో పెళ్లికి వ్యతిరేకం కాదని కూడా క్లారిటీ ఇచ్చింది. అంతే కాకుండా రెండో పెళ్లిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది. 

దాని వెనుక పరిగెత్తడం లేదు..

‘‘నేను బ్లాక్ చేయలేదు. అలా అని దాని వెనుక పరిగెత్తడం లేదు. అది వచ్చినప్పుడు చూద్దాం. ప్రస్తుతం అయితే కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నాను’’ అంటూ రెండో పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నిహారిక కొణిదెల. అంతే కాకుండా తనకు 30 ఏళ్లే అని, లైఫ్‌లో సాధించాలని అనుకుంటున్నానని తెలిపింది. ఇక నిహారిక.. విడాకుల గురించి ఇచ్చిన స్టేట్‌మెంట్స్ వైరల్ అవ్వడంతో తన మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ సైతం ఈ విషయంపై స్పందించారు. ఒకరు చెప్పిన మాటలు విని.. మరొకరిది తప్పు అని డిసైడ్ చేయకూడదు అని, ఇలాంటి ఇంటర్వ్యూలు చేయాలనుకుంటే ఇద్దరినీ కలిపి ప్రశ్నించాలని సలహా ఇచ్చాడు.

Also Read: సోనూ సూద్‌కు పద్మ అవార్డు అందుకే రాలేదా? పూనమ్ కౌర్ ఘాటు వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

Lenin OTT : అఖిల్ లెనిన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
అఖిల్ లెనిన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Gurthukosthunnayi Series OTT : మరో ఓటీటీలో రొమాంటిక్ కామెడీ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి' - 100+ మిలియన్ వ్యూస్... ఎందులో చూడొచ్చంటే?
మరో ఓటీటీలో రొమాంటిక్ కామెడీ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి' - 100+ మిలియన్ వ్యూస్... ఎందులో చూడొచ్చంటే?
Rashmika Mandanna : అండర్ వాటర్‌లో రష్మిక సాహసం - ఇండియన్ సినీ చరిత్రలోనే ఫస్ట్ టైం
అండర్ వాటర్‌లో రష్మిక సాహసం - ఇండియన్ సినీ చరిత్రలోనే ఫస్ట్ టైం
Jana Nayagan Censor Review : జన నాయగన్‌‍కు A సర్టిఫికెట్ - రన్ టైం ఫిక్స్... రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
జన నాయగన్‌‍కు A సర్టిఫికెట్ - రన్ టైం ఫిక్స్... రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Embed widget