అన్వేషించండి

Niharika Konidela: చరణ్‌ అన్నను క్లింకార ముప్పు తిప్పలు పెడుతుంది - అమ్మ ఉపాసనతోనే తనకు ఎఫెక్షన్ ఎక్కువ, నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు

Niharika About Klin Kaara: రామ్‌ చరణ్‌ కూతురు క్లింకారపై నిహారికి కొణిదెల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. క్లింకార చాలా అల్లరి చేస్తుంది. ముఖ్యం చరణ్‌ అన్నని చాలా విసిగిస్తుందంటూ కామెంట్స్‌ చేసింది. 

Niharika Comments on Klin Kaara: మెగా డాటర్‌ నిహారిక కొణిదెల ప్రస్తుతం నిర్మాతగా ఫుల్‌ బిజీగా ఉంది. వరుసగా సినిమాలు నిర్మిస్తూ.. మరోవైపు నటిగా సినిమాలకు సైన్‌ చేస్తూ కెరీర్‌పై ఫుల్‌ ఫోకస్డ్‌గా ఉంది. విడాకుల తర్వాత నిహారిక కెరీర్‌ పరంగా మరింత ముందడుగు వేస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె కమిటీ కుర్రాళ్లు చిత్రాన్ని నిర్మిస్తుంది. తన పింక్‌ ఎలిఫెంటా బ్యానర్లో అంతా కొత్తనటీనటులతో ఈ సినిమా రూపొందుతుంది. ఆగస్ట్‌ 9న ఈ సినిమ రిలీజ్‌ సందర్భంగా నిహారికి ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయింది.

తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన మూవీ విశేషాలు పంచుకుంది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. "నేను నిర్మాతగా ఉన్నందుకు మా ఫ్యామిలీ అంతా చాలా సంతోషించింది. ఒకే మన అమ్మాయి మన ఇండస్ట్రీలోనే ఉంది. నాన్ను అప్పుడప్పుడు సరదాగా డబ్బులు ఇవ్వోచ్చు కదా అని ఏడిపిస్తుంటారు" అని చెప్పుకొచ్చింది. ఇంట్లో తను చిన్నదాన్ని కాకపోయినా అంతా ముద్దు చేస్తారంది. అనంతరం రామ్‌ చరణ్‌ ముద్దుల తనయ, మెగా మనవరాలు క్లింకార గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

"క్లింకార విసయంలో చూస్తుంటే చరణ్‌ అన్న ది బెస్ట్‌ ఫాదర్‌ అనిపిస్తుంది. క్లింకార పట్ల తన కేరింగ్‌, అటెన్షన్‌ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఒక్కోసారి తనని చూస్తే సినిమాలు లేకుండా ఖాళీగా ఉన్నవాడిలా చేస్తాడు. ఇక ఇంట్లో అందరి అటెన్షన్ క్లింకారపైనే ఉంటుంది. తను మెగా ఫ్యామిలీ లక్కీ చాంప్. ఇక తను చాలా అల్లరి చేస్తుంది. చరణ్‌ అన్నను ముంపు తిప్పులు పెడుతుంది. అన్నం తినిపించేటప్పుడు అసలు తినదు. అటూ ఇటూ పరుగెడుతూ ఉంటుంది. చరణ్‌ అన్న తన వెనక ఊరుకుతూ తినమ్మా అంటూ బతిమాలు కుంటాడు. కుక్కపిల్లని, పక్షుల్ని చూపించి అన్నం పెడతాడు. క్లింకారను చాలా కేర్‌ చేస్తాడు. ఎలాంటి బిజీ షెడ్యూల్‌ ఉన్న కూతురికి చాలా టైం కెటాయిస్తాడు. ఆయన ఒక గ్లోబల్‌ స్టార్‌, సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంటాడు. కానీ, ఇంట్లో క్లింకారతో చూస్తే ఇంత ఖాళీగా ఉన్నాడా? అనిపిస్తుంది.

అలా తన వర్క్‌ టెన్షన్‌, ప్రేజర్‌ని పక్కన పెట్టేసి క్లింకారతో రిలాక్డ్స్‌గా ఉంటారు. నేను చూసిన వాళ్లల్‌ చరణ్‌ అన్న ది బెస్ట్‌ ఫాదర్‌" అంటూ ప్రశంసలు కురిపించింది. క్లింకారకు చరణ్‌ అన్న కంటే వాళ్ల అమ్మ ఉపాసనతోనే ఎఫెక్షన్‌ ఎక్కువ అని చెప్పింది. ఆ తర్వాత తన పర్సనల్ లైఫ్‌ గురించి చెప్పుకొచ్చింది. పర్సనల్‌ లైఫ్‌ నుంచి మూవ్ ఆన్‌ అయిపోరా అని అడగ్గా.. "ఆ టైం వచ్చింది.. వెళ్లిపోయింది కూడా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం నా వర్క్‌పైనే ఫుల్‌ బిజీగా ఉన్నా. పూర్తి సినిమాలు, యాక్టింగ్‌పైనే దృష్టి పెట్టాను. ఏం చేసిన, ఏం జరిగినా లైఫ్‌లో హ్యాపీ ఉండాలి అంతే. అది సింగిలా, కమిటెడ్‌ అనేది సమయమే నిర్ణయిస్తుంది. నేను దేని కోసం ఆరాటపడను. అది కావాలని దాని వెంట పరుగెత్తను. రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. ఈ విషయంలో నా తల్లిదండ్రులు నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు" అని పేర్కొంది.

Also Read: తొలి సినిమాకే అవార్డు, మూడో సినిమాకే రూ. 100 కోట్ల గ్రాస్‌ - #NBK109 డైరెక్టర్ బాబీ బర్త్‌డే గ్లింప్స్ చూశారా?

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget