Poonam Pandey Death News: పూనమ్ పాండే చనిపోలేదా? - ఇదంతా పబ్లిసిటీ స్టంటా! నటి మృతిపై నెటిజన్ల రియాక్షన్
Poonam Pandey: బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే మృతిని ఇప్పటికీ ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సర్వైకల్ క్యాన్సర్ కారణంగా ఆమె కన్నుమూసినట్టుగా షాకిస్తూ నేడు న్యూస్ బయటకు వచ్చింది.
Is Poonam Pandey Death Fake: బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే మృతిని ఇప్పటికీ ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సర్వైకల్ క్యాన్సర్ కారణంగా ఆమె కన్నుమూసినట్టు షాకిస్తూ నేడు న్యూస్ బయటకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీ, ఫ్యాన్స్ దిగ్బ్రాంతికి గురయ్యారు. దేశం మొత్తం షాక్ అయ్యింది. ఇది నిజమా? కాదా? అని అంతా పదే పదే చెక్ చేశారు. ఆమె ఆఫిషియల్ ఇన్‌స్టాగ్రామ్ నుంచే ప్రకటన రావడంతో అంతా నమ్మేశారు. మీడియా సైతం నిజమని ఎక్స్‌క్లూజివ్, బ్రేకింగ్ అంటూ వార్తలు టెలికాస్ట్ చేసింది. అయితే ఉత్తర ప్రదేశ్‌లోని తన నివాసంలో రాత్రి తుదిశ్వాస విడిచిందంటూ వార్తలు వచ్చాయి.. కానీ ఆమె డేడ్ బాడీ కానీ, ఆస్పత్రిలో చికిత్స పొందతున్న ఫొటోలు కూడా బయటకు రాలేదు.
డేత్ విజువల్స్ ఎక్కడా?
మీడియాల్లో సైతం ఎక్కడా ఆమె డేత్ విజువల్స్ కనిపించలేదు. దీంతో పూనమ్ పాండే మరణవార్తపై నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతి నిజమేనా? అని సందేహిస్తున్నారు. తాజాగా దీనిపై సోషల్ మీడియాలో వాడివేడిగా చర్చ జరుగుతుంది. పూనమ్ పాండే మరణం నిజం కాదని, ఇది పబ్లిసిటీ స్టంట్ అయ్యింటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఒక స్టార్, క్యాన్సర్‌తో చనిపోయిందంటే నమశక్యంగా లేదంటున్నారు. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్) అనేది ముదిరితే తప్ప ప్రాణాంతకం కాదంటున్నారు. తొందరగా గుర్తిస్తే దానిని నుంచి బయటపడోచ్చని అంటున్నారు. మరి ఆమె నిజంగానే చనిపోతే ఫొటోలు, వీడియోలు రావాలి కదా.. అవి ఏవి? అని ప్రశ్నిస్తున్నారు.
View this post on Instagram
ఈ క్యాన్సర్‌తో చనిపోవడం అసాధ్యమే..!
ఖచ్చితంగా ఇది పూనమ్ పాండే, ఆమె టీం చేసిన పబ్లిసిటీ స్టంట్ అని నెటిజన్లు రకరకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణిస్తే ఒక్క పోస్ట్ పెట్టారు కానీ, ఆమె ఫొటోలు వీడియోలు ఇప్పటికీ బయటకు రాలేదంటున్నారు. అంతేకాదు ఆమె మరణవార్త రాగానే పూనమ్ లాస్ట్ విజువల్స్ అంటూ వీడియోలు వచ్చాయి. వాటిలో పూనమ్ చాలా ఆరోగ్యంగా కనిపించింది. అంటే ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లక్షణాలు ఎక్కడా కూడా కనిపించలేదు. అంత ప్రాణాంతక వ్యాధి అయితే ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉండాలి, రెండు రోజుల క్రితమే ఆమె ఓ మూవీ ఈవెంట్‌లో చాలా హెల్తీగా కనిపించారని అభిప్రాయ పడుతున్నారు.
ఇదే నిజమైతే ఆమె సర్వైకల్ క్యాన్సర్ బారిన పడినట్టు గతంలో కూడా ఎక్కడా వార్తలు వినిపించలేదంటున్నారు. చనిపోయింది నిజమైతే పూనమ్ పాండే మృతదేహానికి సంబంధించిన విజువల్స్.. అంత్యక్రియల వీడియోలు ఎక్కడా? కనీసం మీడియాలో కూడా ఎక్కడ అవి కనిపించలేదని సందేహిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఇది పూనమ్ పాండే పబ్లిసిటీ స్టంటే అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న చర్చ మొదలుపెట్టారు. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇదే నిజమై.. ఆమె మరణ వార్త అబద్ధమని తేలితే బాగుండని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇకపోతే పూనమ్ చనిపోలేదని, ఆమె బ్రతికే ఉందంటూ ఇప్పటికే పలు బాలీవుడ్ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. మరి పూనమ్ పాండే మరణం నిజమా? కాదా? తెలియాలంటే ఆమె టీం నుంచి ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది.