NBK111 Story : NBK111 స్టోరీ ఏంటి? - స్టైలిష్ గాడ్ గ్లింప్స్... జెన్‌జీ ట్రెండ్‌లో బాలయ్య లుక్
NBK111 Glimpse Reaction : గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య NBK111 గ్లింప్స్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. బాలయ్య స్టైలిష్ మాస్ పవర్ ఫుల్ లుక్‌తో బిగ్ హైప్ క్రియేట్ చేశారు.

Balakrishna's NBK111 Story Line : గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోలో 'NBK111' ఫస్ట్ గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. 'Entry Of An Era'లో గాడ్ ఆఫ్ మాసెస్‌ను స్టైలిష్ గాడ్‌గా చూపించారు. మాస్, యాక్షన్, వయలెన్స్‌తో పాటు సరికొత్త స్టైలిష్ లుక్‌లో అదరగొట్టారు బాలయ్య. అసలేంటీ NBK111... గ్లింప్స్‌ను ఓసారి డీకోడ్ చేస్తే...
'ఓ శకం ప్రారంభం' (Entry Of An Era) అంటూ ఫస్ట్ గ్లింప్స్‌తోనే డైరెక్టర్ గోపీచంద్ బిగ్ సస్పెన్స్ క్రియేట్ చేశారు. పోస్టర్‌లో III రోమన్ నెంబర్ 3 స్థానంలో మూడు బుల్లెట్స్ ఉన్నాయి. ఇది కేవలం ఓ సరికొత్త శకానికి నాంది మాత్రమే కాదు... మూవీలో ఉండే సూపర్ యాక్షన్, వయలెన్స్‌కు ఓ సంకేతం. టీజర్, పోస్టర్ ఆధారంగా మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందో ఊహిస్తే...
అసలు స్టోరీ ఏంటి?
ఈ మూవీ స్టోరీ ముంబై బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. 1993లో ముంబైలో అండర్ వరల్డ్ మాఫియా, గ్యాంగ్ స్టర్ వార్స్, బాంబు పేలుళ్లు, అలజడుల టైంలో బాలయ్య రోల్ ఈ డేంజరస్ వరల్డ్‌లోకి ఎంటర్ అవుతుంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ గోపీచంద్ ఆయన రోల్‌ను 'The King Of Chaos'గా వర్ణించారు.
అలాగే, రెండు వేర్వేరు టైమ్ లైన్స్ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. ఒకటి హిస్టారికల్ డ్రామా అని తెలుస్తుండగా మరొకటి మాఫియా బ్యాక్ గ్రౌండ్ అని సమాచారం. ఒకటి పురాతన కాలం, మరొకటి ప్రస్తుత కాలం నేపథ్యంలో హిస్టారికల్ యాక్షన్ డ్రామా అని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఆ రెండు టైమ్ లైన్స్‌ను లింక్ చేస్తూ మూడు బుల్లెట్స్, ఆయుధాల వెనుకున్న పెద్ద రహస్యం చుట్టు ఈ స్టోరీ సాగొచ్చు.
Also Read : Samyuktha : హీరోయిన్ సంయుక్త గ్లామరస్ ఫోటోస్ - స్లమ్ డాగ్ బ్యూటీ బోల్డ్ లుక్
GenZ కి కనెక్ట్ అయ్యేలా...
బాలయ్య అంటేనే మనకు గుర్తొచ్చేది మాస్ యాక్షన్. అప్పటి 'సమర సింహారెడ్డి'లో రాయలసీమ ఫ్యాక్షన్ గొడవలు గొడ్డలి వేటు దగ్గర నుంచి నిన్నటి అఖండలో మంచు కొండల్లో భారీ యాక్షన్ సీన్స్ వరకూ ట్రెండ్ మారినా ఇప్పటి జెన్ జీ ట్రెండ్‌కు అనుగుణంగా బాలయ్య రోల్ ఉండనుందని సమాచారం. గ్లింప్స్‌కు ఇచ్చిన ట్యాగ్ లైన్ 'నో మోర్ వింటేజ్... ఓన్లీ న్యూ ఏజ్'. బాలయ్య రెగ్యులర్‌గా చేసే ఫ్యాక్షన్ లేదా పాత కాలపు మాస్ పాత్రలో కాకుండా... స్టైలిష్, క్రూరమైన, పవర్‌ఫుల్ అండర్ వరల్డ్ డాన్‌గా లేదా ఒక పవర్ ఫుల్ ఫోర్స్‌లా కనిపించనున్నారు.
ఈ సినిమాలో మంచు మనోజ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. కాబట్టి, ముంబైని శాసించే ఓ క్రూరమైన మాఫియా శక్తినో లేదా ఒక వ్యవస్థనో ఎదిరించడానికి బాలకృష్ణ క్యారెక్టర్ రంగంలోకి దిగడం.. భారీ యంత్రాలు (JCBs), ఇనుప గొలుసులు, తుపాకులతో విధ్వంసం సృష్టించి అక్కడ తన "సామ్రాజ్యాన్ని (Era)" ఎలా స్థాపించాడు అనేదే ఈ సినిమా కథ అయ్యే అవకాశం ఉంది. మూవీలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తున్నారు. లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తుండగా... వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
Also Read : NBK111 Balakrishna Looks : గాడ్ ఆఫ్ మాసెస్ కాదు... స్టైలిష్ గాడ్ - ట్రెండింగ్‌లో బాలయ్య NBK111 లుక్
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
ట్రెండింగ్ వార్తలు























