అన్వేషించండి

Naveen Polishetty: నితేష్ తివారీ ‘రామాయణ్’లో నవీన్ పోలిశెట్టి? - ఆ కీలక పాత్రలో ఛాన్స్?

Nitesh Tiwari Ramayan: బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ్’ ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతలోనే ఈ మూవీలో నవీన్ పోలిశెట్టి కూడా నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Naveen Polishetty in Ramayan: ఇప్పటివరకు రామాయణ ఇతిహాసంపై ఎన్నో సినిమాలు వచ్చాయి. సినిమాలు మాత్రమే కాదు.. సీరియల్స్ కూడా వచ్చాయి. కానీ ఎప్పటికప్పుడు రామాయణాన్ని ప్రేక్షకులు ఆకట్టుకునేలా చూపించడానికి మేకర్స్ ప్రయత్నిస్తూనే ఉంటారు. అందుకే బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ కూడా మరోసారి ‘రామాయణ్’ అనే టైటిల్‌తో భారీ బడ్జెట్ రామాయణాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ మూవీలో రాముడు, సీతా, రావణాసురుడులాంటి పాత్రల కోసం క్యాస్టింగ్ ఫైనల్ అయ్యిందని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతలోనే ఇందులో లక్ష్మణుడి పాత్ర కోసం తెలుగబ్బాయి నవీన్ పోలిశెట్టితో చర్చలు జరుపుతున్నట్టు సినీ సర్కిల్లో గుసగుసలు మొదలయ్యాయి.

మరో రూమర్..

నితేష్ తివారీ ‘రామాయణ్’ను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నట్టు గత కొన్నిరోజులుగా బాలీవుడ్‌లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. కానీ ఇందులో రాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి, రావణుడి పాత్రలో యశ్ కనిపించనున్నట్టుగా వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంతలోనే రావణుడి పాత్ర చేయడానికి యశ్ ఒప్పుకోలేదని మరో రూమర్ వినిపించింది. ఇవన్నీ నిజమా కాదా అని కన్ఫర్మేషన్ లేకపోయినా తాజాగా మరో రూమర్ బయటికొచ్చింది. టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి.. ‘రామాయణ్’లో లక్ష్మణుడి పాత్ర పోషించనున్నాడనే రూమర్స్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బాలీవుడ్ ప్రేక్షకుల్లో గుర్తింపు..

ప్రస్తుతం నితేష్ తివారీ ‘రామాయణ్’ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు ఏడాది నుండి ఈ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ కూడా జరుగుతున్నాయట. మార్చి 2న ఫిల్మ్ సిటీలో ‘రామాయణ్’ షూటింగ్ కూడా ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ‘చిచోరే’ అనే చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు నవీన్ పోలిశెట్టి. దానికంటే ముందే ఒక హిందీ యూట్యూబ్ ఛానెల్‌ల్లోని షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాడు. అలా హిందీ ప్రేక్షకులలో నవీన్‌కు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు ‘రామాయణ్’లో లక్ష్మణుడిగా నటిస్తే ఎక్కువమంది బాలీవుడ్ ఆడియన్స్‌కు తన రీచ్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. కొందరు నెటిజన్లు ఈ విషయంపై సంతోషం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఇది కేవలం రూమర్ అయ్యిండచ్చని కొట్టిపారేస్తున్నారు.

రణబీర్ ట్రైనింగ్..

‘రామాయణ్’లో రాముడు, లక్ష్మణుడు, సీతా, రావణుడి పాత్రల కోసం క్యాస్టింగ్ ఫిక్స్ అయిపోవడంతో చిన్నప్పటి రాముడు, లక్ష్మణుడు పాత్ర కోసం యంగ్ నటీనటుల కోసం వేట మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే లైన్‌లో కొందరు యంగ్ నటీనటులు ఉన్నా.. వారిలో ఎవరు ఈ పాత్రలు చేయనున్నారని ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇక ఇందులో రాముడిగా కనిపించనున్న రణబీర్ కపూర్.. ఈ సినిమా కోసం లాస్ ఏంజెల్స్‌లోని డీఎన్ఈజీ స్టూడియోలో ఒక టెక్ రీహార్సెస్‌లో కూడా పాల్గొనున్నట్టు సమాచారం. అంతే కాకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుండడంతో టెక్నికల్ అంశాల విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదని నితేష్ తివారీ భావిస్తున్నాడట. అందుకే లాస్ ఏంజెల్స్ నుంచి ప్రముఖ టెక్నిషియన్లను రంగంలోకి దించనున్నట్టు సమాచారం.

Also Read: దళపతి విజయ్ మూవీలో ఆఫర్‌ - నో చెప్పిన యంగ్‌ హీరోయిన్‌, కారణం ఇదేనట?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Weather Today : తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
Keerthy Suresh: సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Thiruppavi pasuralu: తిరుప్పావై డిసెంబర్ 19, 20, 21...ఈ మూడు రోజులు పఠించాల్సిన పాశురాలు - వాటి అర్థం!
ధనుర్మాసం స్పెషల్: తిరుప్పావై డిసెంబర్ 19, 20, 21...ఈ మూడు రోజులు పఠించాల్సిన పాశురాలు - వాటి అర్థం!
Embed widget