Malli Pelli Rain Song: నరేష్, పవిత్రా లోకేష్‌ల ‘మళ్లీ పెళ్లి’ రైన్ సాంగ్ వచ్చేసింది చూశారా?
నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటిస్తున్న ‘మళ్లీ పెళ్లి’ సినిమా నుంచి ‘రా రా హుజూరు నాతో’ సాంగ్ ఈ రోజు రిలీజైంది.
నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటిస్తున్న మూవీ ‘మళ్లీ పెళ్లి’. ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ మూవీపై బజ్ క్రియేట్ అయ్యింది. పైగా ఇప్పటికే తాము రిల్ కపుల్స్ కాదు, రియల్ కపుల్స్ అని ఒప్పుకున్న ఈ జంట ఇందులో మళ్లీ పెళ్లి చేసుకోవడం, మూవీ సీన్స్ అన్నీ వారి నిజ జీవితానికి దగ్గరగా ఉండటంతో ప్రేక్షకులు ఈ మూవీ అప్‌డేట్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు, ట్రోలర్స్ కూడా ఈ మూవీ నుంచి ఎప్పుడెప్పుడు అప్‌డేట్స్ వస్తాయా.. వాడేద్దామని చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజైంది. అయితే ఇది సాదాసీదా సాంగ్ కాదు. రొమాంటిక్ రైన్ సాంగ్.
'రా రా హోసూరు నాతో' అంటున్న నరేష్, పవిత్ర
'మళ్ళీ పెళ్లి' చిత్రంలోని 'రా రా హోసూరు నాతో' పాటను చిత్రయూనిట్ శుక్రవారం విడుదల చేసింది. ఆల్రెడీ విడుదల చేసిన 'ఉరిమే మేఘమా...' పాటకు మంచి స్పందన లభిస్తోందని సంతోషం వ్యక్తం చేసింది. 'రా రా హోసూరు నాతో' సాంగ్‌లో నరేష్, పవిత్ర లోకేష్‌తోపాటు మరో జంట కూడా ఉంది. అనన్య నాగళ్ల తొలిసారి ఈ రైన్ సాంగ్ చేస్తోంది. ‘వర్షం’ సినిమాకు నిర్మాతగా ‘వాన’ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించిన ఎంఎస్ రాజుకు వర్షం పాటలు కొట్టిన పిండి. ఈ నేపథ్యంలో ఈ పాట కూడా ప్రేక్షకులకు నచ్చే అవకాశాలున్నాయి.
Read Also: అసత్య వార్తలపై శరత్ బాబు కుటుంబ సభ్యుల ఆగ్రహం, కేసు పెడతామని హెచ్చరిక
మే 26న 'మళ్ళీ పెళ్లి' విడుదల
Malli Pelli Release On May 26th : వేసవిలో 'మళ్ళీ పెళ్లి'ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఈ నెల 26న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
'మళ్ళీ పెళ్లి' చిత్రానికి మెగా మూవీ మేకర్ ఎం.ఎస్. రాజు (MS Raju) దర్శకుడు. నరేష్ విజయ కృష్ణ నిర్మాత. దీంతో లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ విజయ కృష్ణ మూవీస్ సంస్థను పున:ప్రారంభించారు. సకుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా 'మళ్ళీ పెళ్లి' అని, ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ఆయన తెలిపారు.
ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన తొలి పాట!
ఇటీవల సినిమాలో తొలి పాట 'ఉరిమే కాలమా...'ను విడుదల చేశారు. ఆ గీతానికి అనంత శ్రీరామ్ (Anantha Sriram) సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. సురేష్ బొబ్బిలి అందించిన బాణీ అందించారు. లేటు వయసులో ప్రేమలో పడిన ఓ జంట పరిస్థితిని పాటలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇక, టీజర్ చూస్తే నరేష్, పవిత్ర నిజ జీవితంలో జరిగిన అంశాలతో సినిమా తీసినట్లు అర్థం అవుతోంది. నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి ఆరోపణలు... ఆమె ప్రెస్ మీట్... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నానని హోటల్ కు వెళ్లడం... ఆ మధ్య బెంగళూరులో నడిచిన హై డ్రామా... 'మళ్ళీ పెళ్లి' టీజర్ చూస్తే అవన్నీ గుర్తుకు వస్తాయి.
జయసుధ, శరత్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్న 'మళ్ళీ పెళ్లి' సినిమాలో వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.