అన్వేషించండి

Aditi Myakal : నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ దర్శకుడి నుంచి 'ప్రభుత్వ సారాయి దుకాణం'

జాతీయ పురస్కారంతో పాటు నంది అవార్డు అందుకున్న దర్శకుడు నరసింహ నంది తెరకెక్కిస్తున్న సినిమా 'ప్రభుత్వ సారాయి దుకాణం'.

Prabhutva Saarayi Dukanam Movie : దర్శకుడు నరసింహ నంది పేరు చెబితే తెలుగులో కొందరు ప్రేక్షకులు గుర్తు పడతారు. ఆయన దర్శకత్వం వహించిన '1940లో ఒక గ్రామం' చిత్రానికి 2008 సంవత్సరానికి గాను తెలుగులో ఉత్తమ ప్రాంతీయ సినిమాగా అవార్డు వచ్చింది. ఆ సినిమాను నంది అవార్డు సైతం వరించింది. 

'1940లో ఒక గ్రామం' మాత్రమే కాదు... 'కమలతో నా ప్రయాణం', 'లజ్జా' - ఇలా నరసింహ నంది దర్శకత్వం వహించిన సినిమాలు విమర్శకుల ప్రశంసలు చాలా అందుకున్నాయి. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆ సినిమాలను మెచ్చుకున్నారు. అటువంటి దర్శకుడు ఓ కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. 

'ప్రభుత్వ సారాయి దుకాణం'...
తెలంగాణాలోని మారుమూల పల్లెలో!Narasimha Nandi New Movie : నరసింహ నంది దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'ప్రభుత్వ సారాయి దుకాణం'. శ్రీలక్ష్మి నరసింహ సినిమా సంస్థలో 'ప్రభుత్వ సారాయి దుకాణం' తెరకెక్కుతోంది. పరిగి స్రవంతి మల్లిక్, నరేష్ గౌడ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం అయ్యింది.

'ప్రభుత్వ సారాయి దుకాణం' సినిమాలో అదితి మ్యాకల్ (Aditi Myakal) ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 'అమీ తుమీ', '24 కిస్సెస్', 'ఏకం' తదితర సినిమాల్లో ఆమె నటించారు. రీసెంట్ వెబ్ సిరీస్ 'మాయాబజార్', అంతకు ముందు 'పోష్ పోరిస్'లోనూ నటించారు. అదితి పాత్ర సినిమాలో హైలైట్ అవుతుందని టాక్.    

Also Read : చిరంజీవి కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ - ఆ పేరు సినారే ఓ పుస్తకం కూడా రాశారండోయ్

షేక్ స్పియర్ కథలోని పాత్రల ఆధారంగా తీసుకొని తెలంగాణలో ఒక మారుమూల పల్లె నేపథ్యంలో 'ప్రభుత్వ సారాయి దుకాణం' సినిమా తెరకెక్కిస్తున్నట్లు నరసింహ నంది చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''రాజకీయ కుటుంబాన్ని ఇతివృత్తంగా తీసుకుని... పగ, ద్వేషం, ఈర్ష, అసూయ, ప్రేమ - ఇలా మనిషిలో వివిధ కోణాలను చూపించే విధంగా ఈ సినిమా కథ సిద్ధం చేశా. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా 1980 నాటి పరిస్థితులు మలిచా. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. కొంత మంది కొత్త నటీనటులతో పాటు సీనియర్ ఆర్టిస్టులను కూడా తీసుకున్నాం'' అని చెప్పారు.  

Also Read జైల్లో రజనీకాంత్ 'జైలర్' విలన్ వర్మ అలియాస్ వినాయకన్ - మద్యం మత్తులో గొడవ గొడవ

అదితి మ్యాకల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వినయ్, మల్లిక్, నరేష్ గౌడ్, మహంతి, వీరభద్రం, బాలు నాయక్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి  నిర్మాణ సంస్థ :  శ్రీలక్ష్మీ నరసింహ సినిమా, నిర్మాతలు : పరిగి స్రవంతి మల్లిక్ & నరేష్ గౌడ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : రంగు రాము గౌడ్, కూర్పు : వి. నాగి రెడ్డి, సంగీతం : సుక్కు, ఛాయాగ్రహణం : మహి రెడ్డి పండుగల, రచన & దర్శకత్వం : నరసింహ నంది. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Honda Activa Electric: హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Honda Activa Electric: హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Pawan Kalyan News: ప్రతి అడుగు వ్యూహాత్మక ఎత్తుగడ -వైవిధ్యంగా డీసీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్
ప్రతి అడుగు వ్యూహాత్మక ఎత్తుగడ -వైవిధ్యంగా డీసీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్
Roti Kapda Romance Review - రోటి కపడా రొమాన్స్ రివ్యూ: రొమాంటిక్‌గా కలిశాక... లవర్స్ మధ్య ప్రాబ్లమ్స్ వస్తే?
రోటి కపడా రొమాన్స్ రివ్యూ: రొమాంటిక్‌గా కలిశాక... లవర్స్ మధ్య ప్రాబ్లమ్స్ వస్తే?
GV Prakash Kumar: జీవీ ప్రకాష్ కుమార్ చేతికి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'... కన్ఫర్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్
జీవీ ప్రకాష్ కుమార్ చేతికి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'... కన్ఫర్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్
Embed widget