Sundarakanda Collections: రెండో రోజు సగానికి పడిన 'సుందరకాండ'... నారా రోహిత్ సినిమా కలెక్షన్లు ఎంతంటే?
Sundarakanda Box Office Collection Day 2: వినాయక చవితికి విడుదలైన నారా రోహిత్ 'సుందరకాండ' పర్వాలేదనే రీతిలో ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజు వచ్చిన దాంట్లో సగం కూడా రెండో రోజు రాలేదు.

నారా రోహిత్ (Nara Rohith) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'సుందరకాండ' (Sundarakanda 2025 Movie)కు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. వినాయక చవితికి థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజు మంచి వసూళ్ళు దక్కాయి. కానీ రెండో రోజుకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్లలో సగం కూడా రాలేదు.
రెండు రోజు కిందకు పడిన సుందరకాండ
Sundarakanda Day 2 Collection: 'సుందరకాండ'కు మంచి ఓపెనింగ్ దక్కడంలో గణేష్ చతుర్థి సెలవు పాత్ర కూడా ఉంది. ఫెస్టివల్ మూడ్, హాలిడే ఉండటంతో థియేటర్లకు జనాలు వచ్చారు. అందువల్ల, ఓపెనింగ్ డే 54 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది. అయితే రెండో రోజు ఆ స్థాయిలో ఆదరణ దక్కలేదు. కేవలం రూ. 24 లక్షలు మాత్రమే రాబట్టింది.
Also Read: ఆరేళ్ళ క్రితం మాటిచ్చాడు... ఇప్పుడు నిలబెట్టుకున్నాడు
Sundarakanda 2025 movie two days collection: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఆల్ ఓవర్ ఇండియాలో రెండు రోజుల్లో 'సుందరకాండ' సాధించిన నెట్ కలెక్షన్ 78 లక్షలు మాత్రమే. రెండో రోజు వసూళ్లు తగ్గటానికి జోరుగా కురుస్తున్న వర్షాలతో పాటు హాలిడే లేకపోవడం కూడా ఒక కారణం. మూడో రోజు కలెక్షన్లతో కోటి మార్క్ చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
వినోదంతో పాటు భావోద్వేగాలున్న సినిమా
'సుందరకాండ'లో నారా రోహిత్ సరసన విర్తి వాఘాని కథానాయికగా నటించారు. ఓ హీరోయిన్ ఆవిడ కాగా... సీనియర్ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ మరో కీలక పాత్ర పోషించారు. కమెడియన్ సత్య, సునైనా జంటగా నటించారు. వాళ్ళిద్దరితో పాటు అభినవ్ గోమఠం పండించిన వినోదం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. హీరో తల్లిదండ్రులుగా సీనియర్ నరేష్, రూపాలక్ష్మి... అక్క పాత్రలో వాసుకి ఆనంద్ నటించారు. 'సుందరకాండ' సినిమాకు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించారు. ఆయన తొలి చిత్రమిది. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) పతాకంపై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించారు.





















