అన్వేషించండి

The Paradise: 'ది ప్యారడైజ్' విడుదల వాయిదా... మరి, హిందీ రిలీజ్? అసలు నిజం ఏమిటంటే?

The Paradise Release Rumors: నేచురల్ స్టార్ నాని 'ది పారడైజ్' విడుదలపై పలు పుకార్లు వినిపిస్తున్నాయి. హిందీ రిలీజ్ లేదనేదీ అందులో ఒకటి. ఈ నేపథ్యంలో అసలు నిజానిజాలు ఏమిటో తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నేచురల్ స్టార్ నాని 'ది పారడైజ్' వాయిదాలు, వివాదాలతో వార్తల్లో.
  • క్లైమాక్స్ సీజీ పనులు పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా.
  • హిందీ వెర్షన్ విడుదలపై వదంతులు అవాస్తవం; బడ్జెట్ పెరిగింది.
  • నిర్మాతల అంతర్గత వివాదంతో, అక్టోబర్ 8న చిత్రం విడుదల అవకాశం.

నేచురల్ స్టార్ నాని (Nani) కథానాయకుడిగా 'దసరా' విజయం తర్వాత శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా 'ది పారడైజ్' (The Paradise Movie). ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిందీ సినిమా. విడుదల వాయిదాతో పాటు హిందీ వెర్షన్ రిలీజ్ విషయంలో నెలకొన్న వివాదాలు, నిర్మాతల మధ్య గొడవలు వంటి అంశాలపై పూర్తి వివరాలు తెలుసుకోండి.

క్లైమాక్స్ సీజీ వర్క్ అవ్వలేదు...
వాయిదాకు అసలు కారణం అదే!
నిజానికి రామ్ చరణ్ 'పెద్ది'తో పాటు మార్చి నెలాఖరున విడుదల కావాల్సిన సినిమా 'ది ప్యారడైజ్'. అయితే వాయిదా పడింది. చివరకు, సెప్టెంబర్ 24న రిలీజ్ అని అనౌన్స్ చేశారు. అయితే, ఇప్పుడు మరోసారి ఈ సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందని టాలీవుడ్ వర్గాల టాక్. వాయిదా వెనుక అసలు కారణం క్లైమాక్స్‌లోని ఓ సీక్వెన్సులో గ్రాఫిక్స్ (CG) పనులు పూర్తి కాకపోవడమే అట.

'ది ప్యారడైజ్' క్లైమాక్స్ సీజీ వర్క్స్ కోసం నిర్మాత సుధాకర్ చెరుకూరి ఏకంగా రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నార. ఆ వర్క్ పూర్తి కావడానికి ఇంకా సమయం పట్టేలా ఉందట. దాంతో తప్పనిసరి పరిస్థితిల్లో సినిమా విడుదలను వాయిదా వేశారట. ఒక్క వారం ఆలస్యంగా అక్టోబర్ 1న విడుదల కావచ్చని టాక్.

Also Read: Bigg Boss 10 First Elimination - 'బిగ్ బాస్ 10' స్టేజిపై ఎలిమినేషన్... క్రిటిక్‌ను వెనక్కి పంపిన ఆడియన్స్

ప్రస్తుతానికి అక్టోబర్ 2న విక్టరీ వెంకటేష్ - గురూజీ త్రివిక్రమ్ కలయికలోని 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47' విడుదలకు రెడీ అయ్యింది. అందువల్ల ఆ తేదీకి నాని వస్తారా? లేదా? అనేది చేయాలి. లేదూ అంటే అక్టోబర్ 8న గానీ, 29న గానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మధ్యలో ఇతర సినిమాలు కర్చీఫ్ వేసుకుని ఉన్నాయి.

Also Read: Mohan Babu Making Matcha - జపనీస్ గ్రీన్ టీ 'మాచా' తయారీలో మోహన్ బాబు... వైరల్ వీడియో

హిందీ విడుదల వివాదంపై స్పష్టత
'ది ప్యారడైజ్' విడుదల వాయిదా సంగతి పక్కన పెడితే... హిందీ వెర్షన్ విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ లేరని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలింది. భారీ బడ్జెట్‌తో 'ది ప్యారడైజ్' తీస్తున్నారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. ఆల్రెడీ నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూటర్లతో హిందీ రిలీజ్ డీల్స్ గురించి డిస్కషన్స్ చేస్తున్నారట. అవి త్వరలో పూర్తి కానున్నాయట. 'ది ప్యారడైజ్' తెలుగు వెర్షన్‌తో పాటే హిందీలో కూడా విడుదల కానుంది.

పెరిగిన 'ది ప్యారడైజ్' బడ్జెట్...
థియేట్రికల్ కలెక్షన్స్ చాలా ఇంపార్టెంట్!
'ది పారడైజ్'ను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు. ముందుగా ప్లాన్ చేసినప్పటికీ... అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు షూటింగ్ జరగడంతో బడ్జెట్ దాటినట్టు తెలుస్తోంది. నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీగా ఖర్చు చేశారు. ఓటీటీ డీల్స్ వల్ల కొంత అమౌంట్ వస్తుంది. అయితే... నిర్మాత లాభాల బాట పట్టాలంటే ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ ద్వారా భారీ అమౌంట్ వస్తుందని ఆశిస్తున్నారు. మరో వైపు సినిమా నైజాం డిస్ట్రిబ్యూటర్లలో 'నిర్మాత నాగవంశీకి 25 శాతం వాటా ఉందట. తమ హారిక అండ్ హాసిని సంస్థ నుంచి వస్తున్న 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47'కు పోటీగా అక్టోబర్ మొదటి వారంలో 'ది ప్యారడైజ్'ను విడుదల చేయడానికి ఆయన సుముఖంగా లేరట.

రెండు సినిమాలు ఒక్క రోజు వ్యవధిలో వస్తే కలెక్షన్స్ తగ్గుతాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 'ది ప్యారడైజ్'కు థియేట్రికల్ కలెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. అందుకని అక్టోబర్ 1న కాకుండా 8న విడుదలయ్యే అవకాశాలు ఎక్కువ.

Also Read: Maremma First Review By Ravi Teja: మారెమ్మకు మాస్ మహారాజా రివ్యూ... రవితేజకి నచ్చేసింది... అబ్బాయికి హిట్టే

Frequently Asked Questions

'ది పారడైజ్' సినిమా విడుదల ఎందుకు వాయిదా పడింది?

క్లైమాక్స్ సీక్వెన్స్‌లో గ్రాఫిక్స్ (CG) పనులు పూర్తి కాకపోవడమే వాయిదాకు ప్రధాన కారణం. ఈ వర్క్ కోసం నిర్మాత రెండు కోట్లు ఖర్చు చేస్తున్నారు.

'ది పారడైజ్' హిందీ వెర్షన్ విడుదల అవుతుందా?

అవును, 'ది పారడైజ్' హిందీలో కూడా విడుదల కానుంది. హిందీ వెర్షన్ విడుదల కాదన్న వార్తల్లో నిజం లేదని మేకర్స్ స్పష్టం చేశారు.

'ది పారడైజ్' సినిమా కొత్త విడుదల తేదీ ఎప్పుడు?

క్లైమాక్స్ సీజీ వర్క్ ఆలస్యం కారణంగా ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. అక్టోబర్ 8న లేదా 29న విడుదల కావచ్చని టాక్.

సినిమా విడుదల తేదీ విషయంలో ఏదైనా వివాదం ఉందా?

అవును, నిజాం డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన నాగవంశీ, తమ సంస్థ సినిమా 'ఆదర్శ కుటుంబం'తో పోటీ వద్దని, అక్టోబర్ 1న విడుదల చేయకూడదని కోరారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Meenakshi Chaudhary: నానితో మీనాక్షి చౌదరి రొమాన్స్... 'ప్యారడైజ్' తర్వాత సినిమాలో?
నానితో మీనాక్షి చౌదరి రొమాన్స్... 'ప్యారడైజ్' తర్వాత సినిమాలో?
The Paradise Vs The Vvaan: నానికి తమన్నా షాక్... 'ప్యారడైజ్' కంటే ఆ హిందీ సినిమాకు క్రేజ్??
నానికి తమన్నా షాక్... 'ప్యారడైజ్' కంటే ఆ హిందీ సినిమాకు క్రేజ్??
Hyderabad Theatre Fined: 'కుబేర'కు వెళితే 22 నిమిషాల యాడ్స్... కోర్టుకు వెళ్ళిన ప్రేక్షకుడు... థియేటర్‌కు 75 వేల ఫైన్
'కుబేర'కు వెళితే 22 నిమిషాల యాడ్స్... కోర్టుకు వెళ్ళిన ప్రేక్షకుడు... థియేటర్‌కు 75 వేల ఫైన్
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బీభత్సం చేసేసిన కంటెస్టెంట్స్! యుద్ధంలో ప్రేమ! నిజంగానే రోహిత్, షాలిని లవ్‌లో ఉన్నారా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బీభత్సం చేసేసిన కంటెస్టెంట్స్! యుద్ధంలో ప్రేమ! నిజంగానే రోహిత్, షాలిని లవ్‌లో ఉన్నారా!
Advertisement

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
Bahadurpuga farmers: బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Shooting Organization Outcry: పతకం లేకుండానే ఒలింపిక్ స్టార్ భాకర్.. గట్టర్ వాసన, రోజూ 5 గంటల బస్సు ప్రయాణంపై ఆమె తండ్రి ఆగ్రహం
పతకం లేకుండానే ఒలింపిక్ స్టార్ భాకర్.. గట్టర్ వాసన, రోజూ 5 గంటల బస్సు ప్రయాణంపై ఆమె తండ్రి ఆగ్రహం
కేవలం 1500 మంది కొనగలిగే రెనాల్ట్ Renault Rafale Hypnotic, ఈ SUV ఎందుకంత స్పెషల్
కేవలం 1500 మంది కొనగలిగే రెనాల్ట్ Renault Rafale Hypnotic, ఈ SUV ఎందుకంత స్పెషల్
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
Embed widget