Hi Nanna Teaser : లవ్లీగా 'హాయ్ నాన్న' టీజర్, హీరోకి మృణాల్ ముద్దు - డిసెంబర్ 21 నుంచి ముందుకొచ్చిన నాని సినిమా
నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా 'హాయ్ నాన్న'. ఈ రోజు టీజర్ విడుదల చేశారు.
నేచురల్ స్టార్ నాని (Nani Hero) కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమా 'హాయ్ నాన్న' (Hi Nanna Movie). శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం1గా ఈ సినిమా రూపొందుతోంది. చెరుకూరి వెంకట మోహన్ (సీవీయమ్), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
నాని జోడీగా మృణాల్ ఠాకూర్...
నాని కుమార్తెగా కియారా ఖన్నా!
'హాయ్ నాన్న' సినిమా (Nani 30 Movie)లో నాని జోడీగా ఉత్తరాది భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటిస్తున్నారు. 'సీతా రామం' తర్వాత తెలుగులో ఆమె నటిస్తున్న చిత్రమిది. 'హాయ్ నాన్నా'లో నాని తండ్రి పాత్ర చేస్తున్నారు. ఆయన కుమార్తెగా కియారా ఖన్నా కనిపించనున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమా టీజర్ (Hi Nanna Teaser)ను ఇవాళ విడుదల చేశారు.
'హాయ్ నాన్న' టీజర్ ఎలా ఉందంటే?
సకుటుంబ సపరివార సమేతంగా 'హాయ్ నాన్న' సినిమాకు వెళ్లవచ్చని టీజర్ చూసిన తర్వాత చెప్పవచ్చు. తండ్రి కుమార్తెల అనుబంధంతో పాటు ప్రేమ కథ, కుటుంబ విలువలు ఉన్నాయని టీజర్ ద్వారా చెప్పకనే చెప్పారు. లవ్, లైఫ్, ఫ్యామిలీ ఎమోషన్స్... ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఇది. పెళ్లికి ముందు హీరోతో ప్రేమలో పడిన అమ్మాయిగా మృణాల్ పాత్ర చూపించారు. హీరో హీరోయిన్ల మధ్య ముద్దు కూడా ఉంది.
Also Read : డార్లింగ్స్, ఇన్‌స్టాలో ప్రభాస్‌కు షాక్ - అకౌంట్ హ్యాక్!
Presenting the most enthralling and affectionate #HiNannaTeaser ❤️🔥
— Vyra Entertainments (@VyraEnts) October 15, 2023
- https://t.co/63p7hjYePb
Love will blossom soon in Cinemas Worldwide on December 7th, 2023 🔥#HiNanna
Natural 🌟 @NameIsNani @Mrunal0801 @shouryuv #BabyKiara @HeshamAWMusic @SJVarughese @artkolla @mohan8998… pic.twitter.com/tgJemf1J39
డిసెంబర్ 21న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... డిసెంబర్ 22న ప్రభాస్ 'సలార్' వస్తుండటంతో వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపించింది. టీజర్ విడుదల సందర్భంగా విడుదల విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు 'హాయ్ నాన్న' సినిమాను ముందుకు తీసుకు వచ్చారు. డిసెంబర్ 7న విడుదల చేయనున్నట్లు తెలిపారు.
'హాయ్ నాన్న' చిత్రానికి హిషామ్ అబ్దుల్ వాహాబ్ సంగీత దర్శకుడు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషి'తో తెలుగు చిత్రసీమకు ఆయన పరిచయం అయ్యారు. అంతకు ముందు మలయాళ సినిమా 'హృదయం'లో ఆయన స్వరపరిచిన పాటలు తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాయి. 'హాయ్ నాన్న' నుంచి ఇప్పటికే విడుదలైన 'సమయమా' సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంది. అనురాగ్ కులకర్ణి, సితార కృష్ణకుమార్ ఆలపించిన ఆ పాటలో హీరో హీరోయిన్లపై తెరకెక్కించారు. హిషామ్ అబ్దుల్ వాహాబ్ పాడిన రెండో పాట 'గాజు బొమ్మ'లో తండ్రి కుమార్తెల మధ్య అనుబంధాన్ని చూపించారు.
Also Read : సాయి ధరమ్ తేజ్ మామూలుగా లేదు బ్రో... 'గాంజా శంకర్'గా మెగా మేనల్లుడు వచ్చేశాడోయ్!
'హాయ్ నాన్న' చిత్రానికి సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహకుడు. నానితో ఆయనకు మూడో చిత్రమిది. 'జెర్సీ', 'శ్యామ్ సింగ రాయ్' చిత్రాలకూ ఆయన పని చేశారు. ఆ రెండు చిత్రాల్లో సినిమాటోగ్రఫీ వర్క్ బావుందని పేరు వచ్చింది. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు, పాటల్లో కూడా సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహణం బావుంది. ఈ చిత్రానికి కూర్పు : ప్రవీణ్ ఆంథోని, ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సతీష్ ఈవీవీ.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial