The Paradise: 'ప్యారడైజ్'లో అడుగు పెట్టిన నాని... 'పెద్ది' కోసం వెనక్కి వెళ్ళలేదు... రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన టీమ్!
Nani New Movie: నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న 'ది ప్యారడైజ్' షూటింగ్ మొదలైంది. అందులో హీరో జాయిన్ అయ్యారు. రిలీజ్ డేట్ మరోసారి కన్ఫర్మ్ చేశారు.

నేచురల్ స్టార్ నాని (Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)ది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. వాళ్ళిద్దరి కలయికలో రూపొందిన సినిమా 'దసరా'. దర్శకుడిగా పరిచయమైన సినిమాతోనే తన స్టైల్ ఏంటో చూపించారు శ్రీకాంత్ ఓదెల. తెలుగు తెరపై అప్పటి వరకు నానిని అంత మాసీగా ఎవరూ చూపించలేదు. ఆ సినిమా విజయం తర్వాత మరోసారి వాళ్ళిద్దరూ మరో సినిమా చేస్తున్నారు. అదే 'ది ప్యారడైజ్'. సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...
థగడ్ ఆగయా... నాని వచ్చాడు!
Nani Joins The Paradise shoot: 'థగడ్ ఆగయా' అంటూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల శనివారం ఒక పోస్ట్ చేశారు. మ్యాటర్ ఏమిటంటే... 'ది ప్యారడైజ్' చిత్రీకరణలో నాని జాయిన్ అయిన విషయాన్ని ఆ విధంగా తెలియజేశారు. అందులో హీరో డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది హింట్ ఇచ్చారు. జూన్ 21న సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైందని, అప్పటి నుంచి చైల్డ్ హుడ్ పోర్షన్స్ షూట్ చేస్తున్నామని యూనిట్ సభ్యులు తెలిపారు.
'పెద్ది'తో పోటీ... రిలీజ్ డేట్ అదే!
Release Date Clash On March 26th, 2026: The Paradise vs Peddi: 'ది ప్యారడైజ్' సినిమాను 2026లో జూన్ 26న విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. ఇప్పుడు మరోసారి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. దీనికి కారణం వాయిదా పడిందని వచ్చిన వార్తలే.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న 'పెద్ది' సినిమాను కూడా వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు అభిమానులకు బహుమతిగా సినిమాను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. అందువల్ల 'ది పారడైజ్' సినిమా వాయిదా పడుతుందని, వేసవికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఇవాళ విడుదల తేదీ మరోసారి కన్ఫర్మ్ చేయడం ద్వారా తమ సినిమా వాయిదా వేయడం లేదని చెప్పినట్లు అయింది.
Also Read: విరాటపాలెం వెబ్ సిరీస్ రివ్యూ: కొత్త పెళ్లి కూతుళ్లే టార్గెట్... అమ్మవారి శాపమా? ఆస్తుల కోసం కుట్రా?
THE DHAGAD joins#TheParadise ❤🔥
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 28, 2025
Natural Star @NameisNani joins the sets of #TheParadise today.
Few important sequences related to childhood portions were shot since June 21st.#THEPARADISE in CINEMAS 𝟐𝟔𝐭𝐡 𝐌𝐀𝐑𝐂𝐇, 𝟐𝟎𝟐𝟔.
Releasing in Telugu, Hindi, Tamil,… pic.twitter.com/YOyuhQCS9q
ఎనిమిది భాషల్లో సినిమా విడుదల!
పాన్ ఇండియా రిలీజ్ ట్రెండ్ ఇప్పుడు ఎక్కువైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో సినిమాను విడుదల చేయడం కామన్. ఈ ఐదు భాషలతో పాటు బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషలలో కూడా 'ది ప్యారడైజ్'ను విడుదల చేస్తున్నామని చిత్ర బృందం స్పష్టం చేసింది. 'దసరా' సినిమాను నిర్మించిన ఎస్ఎల్‌వి సినిమాస్ అధినేత సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.





















