అన్వేషించండి

Nani: ‘దసరా’ దర్శకుడితో మరో మూవీ - కన్ఫార్మ్ చేసిన నాని, అప్పుడే ఏడాది!

Nani 33: కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి నాని చేసిన చిత్రమే ‘దసరా’. ఇక ఈ హీరో, డైరెక్టర్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవ్వనుందని నాని స్వయంగా ప్రకటించాడు.

Nani 33 Announcement: సరిగ్గా ఏడాది క్రితం ‘దసరా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు నాని. ఆ సినిమా కోసం డీ గ్లామర్‌గా కనిపించడంతో పాటు తన బాడీ లాంగ్వేజ్‌ను, మాటతీరును పూర్తిగా మార్చేశాడు. మునుపెన్నడూ చూడని లుక్‌లో నానిని చూసి ప్రేక్షకులంతా షాక్ అయ్యారు. తన కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచే కమర్షియల్ సినిమాగా ‘దసరా’ పేరు తెచ్చుకుంది. ఇక ఈ మూవీ విడుదలయిన ఏడాదికి ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ ఇచ్చాడు నాని. మళ్లీ ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతోనే చేతులు కలపనున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను కూడా షేర్ చేశాడు.

నాని కెరీర్‌లో 33వ చిత్రం..

నేచురల్ స్టార్ నాని ఎక్కువగా కమర్షియల్ సినిమాలకంటే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సినిమాలనే చేయడానికి ఇష్టపడతాడు. అందుకే తను నటించిన ‘జెర్సీ’, ‘హాయ్ నాన్న’లాంటి సినిమాలను ఇష్టపడనివారు ఉండరు. ఇప్పటికే ‘హాయ్ నాన్న’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న నాని.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో నటించడానికి సిద్ధమయిపోయాడు. ఇప్పటికే తన చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉండగా.. శ్రీకాంత్ ఓదెలతో మరో ప్రాజెక్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు నాని. ‘దసరా’ విడుదలయ్యి ఈరోజుకు ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా నాని 33. శ్రీకాంత్ ఓదెలతో మరోసారి’ అంటూ తన కెరీర్‌లో 33వ మూవీ శ్రీకాంత్ ఓదెలతోనే అని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు.

నచ్చిన డైరెక్టర్స్‌తోనే..

నాని షేర్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ చాలా డిఫరెంట్‌గా అనిపిస్తోంది. ‘లీడర్ అవ్వాలంటే ఐడెంటిటీ అవసరం లేదు’ అంటూ పోస్టర్‌లో ప్రజలను ఎక్కువగా హైలెట్ చేశారు. అంటే ఇది సోషల్ డ్రామా కథ అని అర్థమవుతోంది. ఇప్పటివరకు నాని.. ఎక్కువగా పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న సినిమాల వైపుకు వెళ్లలేదు. కానీ ఈ పోస్టర్ చూస్తుంటే మాత్రం ఇది ఒక సోషల్ డ్రామా అని అర్థమవుతోంది. ఒక దర్శకుడు నచ్చితే మళ్లీ మళ్లీ తనకే అవకాశాలు ఇవ్వడం నానికి అలవాటే. ఇప్పటికే వివేక్ ఆత్రేయతో చేసిన ‘అంటే సుందరానికీ’ ఫ్లాప్ అయినా కూడా మరోసారి తనతోనే కలిసి ‘సరిపోదా శనివారం’ చేస్తున్నాడు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nani (@nameisnani)

ఊహించని పాత్రలో..

2023 మార్చి 30న ‘దసరా’ విడుదలయ్యింది. విడుదలయిన మొదటిరోజు సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. మాస్ ప్రేక్షకులను మాత్రం మూవీ విపరీతంగా ఆకట్టుకుంది. దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెలకు ఇది మొదటి సినిమానే అయినా.. నాని లాంటి స్టార్‌ను డిఫరెంట్‌గా చూపించాడని, ఇలాంటి ఒక మాస్ పాత్రలో తనను ఎప్పుడూ ఊహించుకోలేదని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పట్లో నాని కూడా శ్రీకాంత్ ఓదెల చాలా టాలెంటెడ్ అని పలుమార్లు ప్రశంసించాడు. అందుకే వేరే హీరోతో కమిట్ అవ్వకుండా నాని కోసమే ఎదురుచూస్తున్నాడు శ్రీకాంత్. ప్రస్తుతం ఈ హీరో చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తి అవ్వాలంటే కనీసం రెండేళ్లు పడుతుంది. 

Also Read: స్పిరిట్‌ మూవీ అప్‌డేట్‌ - ప్రభాస్‌ కోసం తెరపైకి ముగ్గురు హీరోయిన్ల పేర్లు? సందీప్‌ ఫోకస్‌ ఆమెపైనేనట!

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget