అన్వేషించండి

Nandamuri Chaitanya Krishna: అతను గుడివాడ రౌడీ - కొడాలి నానిపై నందమూరి చైతన్య కృష్ణ పరోక్ష వ్యాఖ్యలు

Nandamuri Chaitanya Krishna: నందమూరి చైతన్య కృష్ణ.. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు రాజకీయపరంగా చేసే వ్యాఖ్యలు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా కొడాలి నానిపై కూడా ఆయన పరోక్షంగా వ్యఖ్యలు చేశారు.

Nandamuri Chaitanya Krishna about Kodali Nani: నందమూరి హీరో బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్నో బ్లాక్‌బస్టర్ యాక్షన్ సినిమాల్లో ‘సమరసింహారెడ్డి’ కూడా ఒకటి. ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది కాబట్టి ఈ సినిమాను కూడా రీ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్‌లో మరో నందమూరి హీరో అయిన చైతన్య కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందమూరి చైతన్య కృష్ణ.. ‘సమరసింహారెడ్డి’ సినిమాలోని డైలాగ్ చెప్పి అందరినీ అలరించారు. అంతే కాకుండా కొడాలి నానిపై పరోక్షంగా పలు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తొడకొట్టి మరీ..

బాలకృష్ణ సినిమాలు అంటేనే తొడకొట్టడం, పవర్‌ఫుల్ డైలాగులతో విలన్స్‌కు వార్నింగ్ ఇవ్వడం.. అందుకే ముందుగా ‘సమరసింహారెడ్డి’ రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో ముందుగా తొడకొట్టి తన స్పీచ్‌ను మొదలుపెట్టారు నందమూరి చైతన్య కృష్ణ. ఈ సినిమా కోసం దర్శకుడు బీ గోపాల్, పరుచూరి బ్రదర్స్ కలిసి ఎంత పవర్‌ఫుల్ డైలాగులు రాశారు గుర్తుచేసుకున్నారు. అంతే కాకుండా ‘నీ ఇంటికి వచ్చా’ అంటూ డైలాగ్ కూడా చెప్పారు. బీ గోపాల్, బాలకృష్ణ కాంబినేషన్ ఎప్పుడూ హిట్టే అని వారి కాంబోలో వచ్చిన చిత్రాల గురించి మాట్లాడారు. కానీ అన్ని సినిమాల్లో ‘సమరసింహారెడ్డి’ అనేది ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చైతన్య కృష్ణ అన్నారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఇది మొదటి యాక్షన్ మూవీ అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ‘లారీ డ్రైవర్’ సినిమాలోని ఒక డైలాగును గుర్తుచేసుకుంటూ కొడాలి నానిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

డైలాగ్ పేలింది..

బీ గోపాల్, బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన మరో మూవీ ‘లారీ డ్రైవర్’. ఈ సినిమాలో ‘నా పేరు గుడివాడ రాయుడు, కానీ నోరు తిరగక వాళ్లు నన్ను గుడివాడ రౌడీ అంటున్నారు’ అంటూ విలన్ చెప్పే డైలాగ్‌ను రిపీట్ చేశారు నందమూరి చైతన్య కృష్ణ. ‘‘ఈరోజు నిజంగానే అక్కడ గుడివాడలో ఒక రౌడీ ఉన్నాడు’’ అన్నారు. ఆ మాటకు ఎవరో కొడాలి నాని అని అరిచారు. అది విన్న చైతన్య కృష్ణ.. ‘‘ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. గుడివాడ రౌడీ. బీ గోపాల్ గారు ఏ ముహూర్తంలో ఆ డైలాగ్ కొట్టారో అద్భుతంగా పేలింది’’ అని ప్రశంసించారు. ఇక బాలకృష్ణ, బీ గోపాల్ కాంబినేషన్‌లోని బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘సమరసింహారెడ్డి’.. మార్చి 2న మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

కొన్నాళ్లు బ్రేక్..

ఇప్పటికే నందమూరి కుటుంబం నుండి వచ్చిన హీరోలు.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా ఎన్‌టీఆర్ అయితే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో గ్లోబల్ స్టార్ అయిపోయారు. ఇక ఇటీవల సీనియర్ ఎన్‌టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ వారసుడు చైతన్య కృష్ణ కూడా హీరోగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. తను లీడ్ రోల్ చేసిన ‘బ్రీత్’ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్నేళ్ల క్రితం చైతన్య కృష్ణ హీరోగా పలు చిత్రాల్లో నటించినా.. ఎందుకో కాస్త గ్యాప్ ఇచ్చారు. చాలాకాలం తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘బ్రీత్’ కొంతవరకు ప్రేక్షకులను అలరించింది.

Also Read: డిప్రెషన్ వల్లే డ్రగ్స్ తీసుకున్న షణ్ముక్ - సూసైడ్ చేసుకోవాలనుకున్నాడా? వెలుగులోకి సంచలన నిజాలు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget