By: ABP Desam | Updated at : 28 May 2022 09:49 AM (IST)
నందమూరి చైతన్య కృష్ణ, బాలకృష్ణ
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి మరో వారసుడు వస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబం నుంచి రెండో తరంలో హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా వచ్చారు. అగ్ర కథానాయకులుగా తండ్రి తగ్గ తనయులు అనిపించుకున్నారు. మూడో తరంలో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. ఇప్పుడు మరో ఎన్టీఆర్ మనవడు హీరోగా వస్తున్నారు.
Nandamuri Chaitanya Krishna As Hero: ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ హీరోగా సినిమా రూపొందుతోంది. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ సినిమా ఫస్ట్ లుక్‌ను నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) విడుదల చేశారు. అన్నయ్య కుమారుడి సినిమా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.
Also Read: కృష్ణుడిగా 17 సినిమాల్లో - ఎన్టీ రామారావు సినీ జీవితంలో ఈ విశేషాలు మీకు తెలుసా?
First Look Poster of #NandamuriChaitanyaKrishna Annaya New Movie..All the Best to entire Team @BTRcreations pic.twitter.com/CViCFFbU5b
— sailendra medarametla (@sailendramedar2) May 28, 2022
బసవతారకం క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా నందమూరి చైతన్య కృష్ణ తొలి సినిమా రూపొందుతోంది. 'రక్ష', 'జక్కన్న' సినిమాలు తీసిన దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ తెరకెక్కిస్తున్నారు. నందమూరి జయకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Also Read: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్
.@BTRCreations Launching #NandamuriChaitanyaKrishna as Main Lead in their PRODUCTION NO.1 ✊💥
— Basavatarakarama Creations (@BTRcreations) May 28, 2022
NATASIMHAM 🦁 #NandamuriBalaKrishna garu unveiled the Intriguing First Look of the Movie 🙌🤩
A film by @VKrishnaakella 🎬
Brace Yourselves for more Exciting Updates 🤞🔥 pic.twitter.com/yTAAAx98nM
Shruti Haasan Health: క్రిటికల్ కండిషన్ లో శృతిహాసన్ - రూమర్స్ పై మండిపడ్డ నటి!
Regina Cassandra: 2019లో కులు మనాలి రూమ్లో ఒకటి జరిగింది, అతడిని మిస్సవుతున్నా - ఆలీతో రెజీనా
Vijay Sethupathi: రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో విజయ్ సేతుపతి - పాన్ ఇండియా లెవెల్లో!
Alia Bhatt On First Night: ఫస్ట్ నైట్ గురించి ఓపెన్ అయిన ఆలియా భట్
Upasana: మెగా ఫ్యామిలీకి వారసుడొస్తున్నాడా? ఉపాసన హింట్ ఇచ్చేసింది!
YS Sharmila : ఏపూరి సోమన్నపై దాడి - వర్షంలోనే షర్మిల దీక్ష !
Mega Sentiment: 'మెగా'స్టార్ న్యూమరాలజీ సెంటిమెంట్ - పేరులో చిరు మార్పు
Twitter Moves Court : ప్రభుత్వం చెప్పినట్లు చేయలేం - కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ పిటిషన్ !
IND vs ENG 5th Test: బాజ్ బాలా? అదేంటో తెలియదంటున్న రాహుల్ ద్రవిడ్