Nandamuri Balakrishna: గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో బాలయ్యకు అరుదైన పురస్కారం... ఆయన టైమ్ నడుస్తోందంతే!
Nandamuri Balakrishna: గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో నందమూరి నటసింహం బాలకృష్ణకు అరుదైన పురస్కారం లభించింది. ఈ పురస్కారంపై బాలయ్య రియాక్ట్ అవుతూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన స్పందిస్తూ..

Nandamuri Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ అకౌంట్‌లో ఈ సంవత్సరం మరో అరుదైన పురస్కారం చేరింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’కు ఎంపికయ్యారు. ఈ విషయం తెలిసి బాలయ్యతో పాటు, ఆయన అభిమానులు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇది నందమూరి నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. లెజెండ్ ఎన్టీఆర్ 75 సంవత్సరాల నట ప్రస్థానం ఒకవైపు, బాలకృష్ణ 50 ఏళ్ల నట ప్రస్థానం మరోవైపు.. అలాగే వరుస సక్సెస్‌లు, పద్మ భూషణ్ పురస్కారం.. ఇలా క్షణం కూడా ఊపిరిరాడనివ్వకుండా ఆయన అభిమానులకు ట్రీట్ ఇస్తున్నారు.
అన్నింటినీ మించి, తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ టైమ్ ఇస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఎన్టీఆర్ జాతీయ అవార్డ్‌ను అందుకున్న మొదటి వ్యక్తిగానూ బాలయ్య చరిత్ర సృష్టించబోతున్నారు. ఈ అవార్డు రావడం పట్ల ఆయన తన ఆనందాన్ని తెలియజేశారు. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుకు తనని ఎంపిక చేయడంపై బాలయ్య తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, తనని అవార్డుకు సెలక్ట్ చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 (Gaddar Film Awards 2024) లో ఎన్టీఆర్ జాతీయ అవార్డ్ (NTR National Award) కు ఎంపిక కావడంపై బాలయ్య స్పందిస్తూ..
‘‘ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు పూర్తిచేసుకున్న అద్భుతమైన ఘడియలు ఒక వైపు.. అలాగే ఎన్టీఆర్ నట ప్రస్థాన 75 సంవత్సరాల అమృతోత్సవాలు జరుగుతున్న శుభ ఘడియలు మరోవైపు.. నటుడిగా నేను 50 ఏళ్ళ స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఇంకో వైపు. ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మ భూషణ్‌తో సత్కరించిన ఇలాంటి తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘ఎన్టీఆర్ జాతీయ అవార్డు’ని నాకు ప్రకటించడం నిజంగా నా అదృష్టంగా, ఆ దైవ నిర్ణయంగా, నాన్న నందమూరి తారక రామారావు ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఇంతటి ప్రతిష్టాత్మకమైన పురస్కారానికి మొట్టమొదటగా నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జ్యూరీ సభ్యులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు ప్రజల దీవెనలు, నాన్న చల్లని కృప, భగవంతుని ఆశీర్వాదాలు నాకు ఎల్లవేళలా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను’’ అని బాలయ్య ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు.
ఇక ఇదంతా చూస్తున్న నందమూరి అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం నటసింహం బాలయ్య టైమ్ నడుస్తుందంటూ వారు కామెంట్స్ చేస్తుండటం విశేషం. వరుసగా ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టడం, ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకోవడంతో పాటు, అందుకు తగినట్లుగా అవార్డులు ఆయనకు రావడం ఎంతో సంతోషంగా ఉందంటూ నందమూరి అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే బాలయ్య మరెన్నో అవార్డులు అందుకోవాలని వారు కోరుకుంటున్నారు.
Also Read: జూన్ 14న గద్దర్ సినీ అవార్డుల ప్రదానం, బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు





















