Nagarjuna-Coolie: నాగార్జున బర్త్‌డేకు కిక్ ఇచ్చే అప్‌డేట్ వచ్చేసింది - రజనీకాంత్ కూలీలో 'కింగ్', పాత్ర ఎంటో తెలుసా?
Happy Birthday Nagarjuna - Coolie: టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున అక్కినేను బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఆగస్టు 29న ఆయన బర్త్ డే సందర్భంగా కొత్త సినిమా అప్డేట్ ఇచ్చారు.
![Nagarjuna-Coolie: నాగార్జున బర్త్‌డేకు కిక్ ఇచ్చే అప్‌డేట్ వచ్చేసింది - రజనీకాంత్ కూలీలో 'కింగ్', పాత్ర ఎంటో తెలుసా? Nagarjuna Akkineni Joins in Rajinikanth and Lokesh Kanagaraj Coolie Movie Nagarjuna-Coolie: నాగార్జున బర్త్‌డేకు కిక్ ఇచ్చే అప్‌డేట్ వచ్చేసింది - రజనీకాంత్ కూలీలో 'కింగ్', పాత్ర ఎంటో తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/29/b10333484f3415cec7efec54bbb8a31f1724934208278929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nagarjuna Akkineni in Rajinikanth Cooli Movie: టాలీవుడ్ 'కింగ్' నాగార్జున బర్త్‌డే నేడు. ఆగస్టు 29న ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా నాగార్జునకు సోషల్ మీడియాలో శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇక ఇండస్ట్రీ ప్రముఖులు, ఫ్యాన్స్, నెటిజన్ల ప్రత్యేకంగా ఆయన విషెస్ తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన త్రోబ్యాక్, వింటేజ్ నాగ్ లుక్‌ని షేర్ చేస్తూ నెట్టింట నాగార్జున బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్స్ ఇస్తున్నారు మూవీ మేకర్స్. ఈ నేపథ్యంలో అభిమానులకు మంచి కిక్ ఇచ్చే అప్‌డేట్ బయటకు వచ్చింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రంలో ఈ టాలీవుడ్ కింగ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన లుక్ రిలీజ్ చేస్తూ పాత్రను కూడా రివీల్ చేసింది మూవీ చేసింది మూవీ టీం. ఆయన బర్త్‌డే సందర్భంగా ఈ అప్‌డేట్ ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ ఇచ్చింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో నాగార్జున కూడా భాగమయ్యారని తెలిసి అక్కినేని ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. "అత్యంత భారీ ప్రాజెక్ట్‌లో కూలీలో సైమన్‌గా నాగార్జునను పరిచయం చేయడం ఆనందంగా ఉంది. బహుముఖ ప్రజ్ఞాశాలి కింగ్ నాగార్జున పుట్టిన రోజు శుభాకాంక్షలు" అంటూ కూలీ మూవీ టీం ట్వీట్ చేసింది.
Introducing @iamnagarjuna as Simon, from the world of #Coolie 🔥😎
— Sun Pictures (@sunpictures) August 29, 2024
Wishing the versatile performer King #Nagarjuna a Happy Birthday!💥@rajinikanth @Dir_Lokesh @anirudhofficial @anbariv pic.twitter.com/AvI6qmUMnT
Also Read: భారీ ధరకు నాని సరిపోదా శనివారం ఓటీటీ రైట్స్! - నాని కెరీర్‌లోనే ఇది హయ్యెస్ట్ డీల్...
సాధారణంగా రజనీకాంత్ సినిమా అంటేనే సౌత్‌లో విపరీతమైన బజ్ నెలకొటుంది. ముఖ్యంగా తెలుగు, తమిళంలో ఆయన మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఆయన నుంచి సినిమా అనగానే ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొంటాయి. పైగా ఆయనకు ఇప్పుడు లోకేష్ కనగరాజ్ లాంటి డైరెక్టర్ తొడు అయ్యారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమ ఆనగానే బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పుడు కింగ్ నాగార్జున కూడా జాయిన్ కాబోతోన్నారు. దీంతో కూలీ మూవీపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇందులో కింగ్ లుక్ ఫ్యాన్స్‌ని తెగ ఆకట్టుకుంటుంది. ఇందులో ఆయన పవర్ఫుల్ గ్యాంబ్లర్‌లా కనిపించారు. సైమన్‌గా తన చేతికి ఉన్న గోల్డ్ వాచ్‌ని తుడుస్తూ అలా స్టైలిష్‌గా ఉన్న 'కింగ్' నాగార్జున లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది.
Also Read: చిరంజీవి, బన్నీని ఒకే వేదిక మీదకు తీసుకొస్తున్న బాలకృష్ణ - మెగా వర్సెస్ అల్లు గొడవకు ఫుల్ స్టాప్?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)