Nagarjuna Akkineni: అందుకే హడావుడిగా నిశ్చితార్థం జరిపించాం - శోభిత వల్ల చై మళ్లీ సంతోషంగా కనిపించాడు..
Nagarjuna Akkineni: నాగార్జున తన కొడుకు నాగ చైతన్య-శోభితల ఎంగేజ్‌మెంట్‌పై స్పందించాడు. తాజా ఓ ఇంటర్య్వూలో హడావుడిగా వారి నిశ్చితార్థం జరపడానికి కారణం ఏంటో వివరించాడు.
Nagarjuna Naga Chaitanya and Sobhita Engagement: అక్కినేని హీరో నాగ చైతన్య నటి శోభిత ధూళిపాళ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కొంతకాలంగా వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే కానీ ఈ రూమర్లపై ఎప్పుడు చై పెదవి విప్పలేదు. కానీ శోభిత మాత్రం అలాంటిది ఏం లేదని చెప్పింది. అయినా కూడా వీరిద్దరిపై రూమర్స్ ఆగలేదు. ఇటీవల వీరిద్దరు జంటగా జర్మనీ వెకేషన్‌కు వెళ్లారు. అక్కడ జంటగా కనిపించిన వారి ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
గప్‌చుప్‌గా నిశ్చితార్థం
దీంతో మరోసారి వీరిద్దరి డేటింగ్ రూమర్స్ వార్తల్లో నిలిచాయి. అప్పుడు కూడా సైలెంట్‌గా ఉన్న ఈ జంట గప్‌చుప్‌గా ఆగష్టు 8వ తేదిన నిశ్చితార్థానికి ముహుర్తం పెట్టుకుని రింగులు మార్చుకున్నారు. ఈ వేడుకలో అక్కినేని కుటుంబంతో పాటు నాగ చైతన్య తల్లి లక్ష్మి, ఆమె భర్త, అలాగే శోభత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఎంగేజ్‌మెంట్ అనంతరం నాగార్జున ఎంగేజ్‌మెంట్ ఫోటోలు షేర్ "శుభముహుర్తాన రెండు హ్యాపీ సోల్స్ కలిశాయి.. వారిని ఆశీర్వాదించండి" అంటూ నాగచైతన్య, శోభితల నిశ్చితార్థాన్ని ప్రకటించాడు. ఆ తర్వాత శోభిత, నాగచైతన్యలు కూడా ఎంగేజ్‌మెంట్ ఫోటోలు షేర్ చేశారు.
అందుకే హడావుడిగా ఈ ఎంగేజ్‌మెంట్
ఈ ఫోటోల్లో చై చాలా సంతోషంగా కనిపించాడు. అయితే ఉన్నట్టుండి వారి ఎంగేజ్‌మెంట్ జరిపించడంపై తాజాగా కింగ్ నాగార్జున అక్కినేని స్పందించాడు. తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో నాగార్జున నాగచైతన్య-శోభిత నిశ్చితార్థం చేయడమేంటని, సడెన్‌గా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. దీనిపై నాగ్ మాట్లాడుతూ.. "చై-శోభిత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే వారికి నిశ్చితార్థం చేసేద్దమని డిసైడ్ అయ్యాం. ఆగష్టు 8వ తేదిన మంచి ముహుర్తం ఉండటంతో అప్పటికప్పుడు ఈ నిర్ణయం తీసుకుని ఎంగేజ్‌మెంట్ జరిపించాం. అందుకే ఎలాంటి హడావుడి లేకుండ ఇంట్లోనే సింపుల్‌గా ఈ వేడుకు కానిచ్చేశాం" అని చెప్పుకొచ్చాడు.
చై చాలా కామ్. తన ఫీలింగ్స్ అసలు బయటకు పెట్టడు. గత పాస్ట్ వల్ల(సమంతతో విడాకులు) చై చాలా డిప్రెషన్‌లోకి వెళ్లాడు. మానసికంగా ఎంతో ఒత్తిడికి గురయ్యాడు. కానీ, ఎప్పుడు తన ఫీలింగ్స్‌ని, బాధని బయటపెట్టలేదు. కానీ చైతూ చూస్తే నాకు అర్థమయ్యేది. అందుకే కొన్ని రోజులు బయటకు కూడా రాలేదు. కానీ, శోభితతో పరిచయం తర్వాత మళ్లీ ఆనందంగా కనిపించాడు. చాలా రోజుల తర్వాత చైని హ్యాపీగా నవ్వటం చూశాను. శోభితా, చై అద్భుతమైన జంట. ఒకరినొకరు ఇద్దరు అమితంగా ప్రేమించుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత చై సంతోషంగా ఉండటం చూసి మా కుటుంబం కూడా ఊరట చెందింది. వాడి సంతోషానికి శోభితనే కారణం. అందుకే వారికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం.
చై-శోభితది రెండేళ్ల పరిచయం
నిజానికి చై-సమంత విడాకులు మా కుటుంబానికి అంత సులువైన సమయం కాదు. అది చైతూను డిప్రెషన్‍లోకి వెళ్లేలా చేసింది" అని నాగార్జున పేర్కొన్నాడు. అయితే చై కంటే ముందే శోభిత నాకు తెలుసు. తను నాకు ఆరేళ్లుగా పరిచయం. ఫస్ట్‌టైం తనని గుఢాచారి మూవీ టైంలో చూశాను. ఆ సినిమాలో తన నటన నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత తనని కలిసినప్పుడల్లా సినిమాలు, జీవితం, ఫిలాసఫీ గురించి మాట్లాడుకున్నాం. శోభితకు చాలా విషయాలు తెలుసు" అంటూ కాబోయే కోడలిపై ప్రశంసలు కురిపించాడు.
Also Read: మా' అసోసియేషన్‌కు మంచు విష్ణు భారీ విరాళం - కూతురు బర్త్‌డే సందర్భంగా కళాకారుల కోసం..