అన్వేషించండి

Nagababu Insta Post on Pawan Kalyan : తన చెమట బొట్టు రేపటితరం ఎక్కబోయే మార్గదర్శపు మెట్టు - ఎలక్షన్​కు ముందురోజు పవన్ కళ్యాణ్‌పై నాగబాబు ఎమోషనల్ పోస్ట్

Nagababu Insta Post : నాగబాబు.. జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్‌కు తోడుగా ఉన్నారు. త్వరలో జరగనున్న ఏపీ ఎన్నికల్లో పవన్ గెలుస్తాడంటూ ఒక ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశారు నాగబాబు.

Nagababu About Pawan Kalyan : ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ మూవీలో కంటే ఎక్కువ ట్విస్ట్​లతో ముందుకు వెళ్తున్నాయి. పైగా ఈ సారి సినితారాలు కూడా ఎలక్షన్​లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన ప్రతీ ఒక్క అప్డేట్‌ గురించి ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. నాయకుల ప్రచారాలను ఫాలో అవుతున్నారు. ఆఖరికి సినీ సెలబ్రిటీలు సైతం నాయకులకు సపోర్ట్ చేయడానికి ప్రచారాల్లో పాల్గొనడానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా చాలామంది ప్రజల దృష్టి పిఠాపురంపైనే ఉంది. అక్కడ నుండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. ఇప్పటికే ఆయనకు సపోర్ట్‌గా చాలామంది సెలబ్రిటీలతో పాటు మెగా ఫ్యామిలీకి కూడా ప్రచారానికి రాగా.. తాజాగా నాగబాబు ఆయనకు సపోర్ట్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశారు.

పార్టీలో యాక్టివ్..

పవన్ కళ్యాణ్ ఏం చేసినా తన వెంట నేను ఉన్నానంటూ నిలబడతారు నాగబాబు. సినిమాలను వదిలేసి రాజకీయాలవైపు వెళ్లాలి అనుకున్నప్పుడు కూడా తన అన్నలుగా చిరంజీవి, నాగబాబు సపోర్ట్ చేశారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో బిజీ అయినా.. నాగబాబు మాత్రం జనసేన పార్టీ స్థాపించినప్పటి నుండి పార్టీలో యాక్టివ్ పాత్ర పోషిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఎన్నికల ప్రచార సమయంలో కూడా పవన్ వెన్నంటే ఉంటున్నారు నాగబాబు. ఈసారి ప్రచారాల్లో పవన్ కళ్యాణ్‌కు దక్కుతున్న ఆదరణ చూస్తుంటే గెలుపు ఖాయమని కొందరు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. నాగబాబు కూడా అదే ఉద్దేశ్యంతో ఒక స్పెషల్ ఫోటోతో ఉన్న పోస్ట్‌ను షేర్ చేశారు.

నీ గెలుపు సిద్దం..

‘నిన్ను నమ్మని వాళ్ల కోసం కూడా ఎందుకు నిలబడతావ్ అని అడిగితే చెట్టుని చూపిస్తాడు అది నాటిన వాళ్లకి మాత్రమే నీడనిస్తుందా అని.. నీతో నడవని వాళ్ల కోసం కూడ ఎందుకు నిందలు మోస్తావ్ అని అడిగితే వర్షాన్ని చూపిస్తాడు తనకి మొక్కని రైతు కంటిని తడపుకుండా పంటనే తడపుతుందని.. అప్పటి నుండి అడగడం మానేసి ఆకాశం లాంటి అతని ఆలోచనా విశాలతని అర్ధం చేసుకోవడం మొదలుపెట్టాను. సేనాని.. మీరు చిందించిన ప్రతి చెమట బొట్టు రేపటితరం ఎక్కబోయే మార్గదర్శపు మెట్టు కాబోతుంది.. కూటమి రాబోతుంది. సిరా పూసిన సామన్యుడి వేలి సంతకంతో నీ గెలుపు సిద్దమైంది’ అంటూ పవన్ కళ్యాణ్‌కు గెలుపు ఖాయమని నమ్మకం వ్యక్తం చేశారు నాగబాబు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Naga Babu Konidela (@nagababuofficial)

మెగా ఫ్యామిలీ సపోర్ట్..

నాగబాబు చేసిన ఈ పోస్ట్‌కు పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు. నిజంగానే ఈసారి గెలుపు పవన్ కళ్యాణ్‌దే అని, కూటమి గెలుస్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక మెగా హీరోలు వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోలు ఇప్పటికే ప్రచారాల్లో యాక్టివ్‌గా పాల్గొంటూ ఉండగా.. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం పిఠాపురంలో అడుగుపెట్టి నేరుగా తన బాబాయ్ పవన్ కళ్యాణ్‌కు మద్దతునిచ్చాడు. దీన్నిబట్టి చూస్తే సినీ సెలబ్రిటీల నుండి పవన్ కళ్యాణ్‌కు దక్కుతున్న సపోర్ట్ రోజురోజుకీ పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఏపీ ఎన్నికలపై ప్రజల్లో మరింత ఉత్కంఠ మొదలయ్యింది.

Also Read: ఆటోలో షూటింగ్ వెళ్లిన శృతి హాసన్ - మరీ ఇంత డెడికేషనా? అంటూ నెటిజన్ల ప్రశంసలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Notice to Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
Embed widget