అన్వేషించండి

Bad Boy Karthik First Review - 'బ్యాడ్ బాయ్ కార్తీక్' ఫస్ట్ రివ్యూ: నాగశౌర్యకు హిట్ వస్తుందా? ఇండస్ట్రీ టాక్ ఏమిటంటే?

Bad Boy Karthik Review In Telugu: 'రంగబలి' విడుదలైన దాదాపు మూడేళ్ళ విరామం తర్వాత 'బ్యాడ్ బాయ్ కార్తీక్'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు నాగశౌర్య. ఇండస్ట్రీలో ఈ సినిమా టాక్ ఏమిటంటే?

Naga Shaurya Bad Boy Karthik Movie First Review: యంగ్ హీరో నాగశౌర్యకు మంచి నటుడు అని పేరు ఉంది. అయితే ఆయన సిల్వర్ స్క్రీన్ మీదకు వచ్చి దాదాపు మూడేళ్ళు అవుతోంది. 'రంగబలి' (జూలై 7, 2023) తర్వాత ఈ శుక్రవారం (ఏప్రిల్ 17, 2026) 'బ్యాడ్ బాయ్ కార్తీక్'తో థియేటర్లలోకి వస్తున్నారు. ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో టాక్ ఏంటి? సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉంది? దీనితో నాగశౌర్యకు హిట్ వస్తుందా? అనేది ఒక్కసారి చూద్దాం.

పెద్దలతో పాటు పిల్లలకూ 'బ్యాడ్ బాయ్ కార్తీక్'
'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమాకు సెన్సార్ బోర్డు యు / ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే పెద్దలతో పాటు పిల్లలు కూడా థియేటర్లకు వెళ్ళవచ్చు. సినిమా రన్ టైమ్ 2.22 గంటలే. లెంగ్త్ తక్కువ కావడం ప్లస్ అవుతుందని సెన్సార్ ఇన్‌సైడ్ టాక్. శ్రీదేవి విజయ్ కుమార్, సముద్రఖని, సాయి కుమార్, సీనియర్ నరేష్, 30 ఇయర్స్ పృథ్వీ, బ్రహ్మాజీ, 'వెన్నెల' కిశోర్ వంటి స్టార్ కాస్ట్ ఉండటం వల్ల ప్రేక్షకులకు బోర్ కొట్టే ఛాన్సులు తక్కువ అట.

'బ్యాడ్ బాయ్ కార్తీక్' కథ కమామీషు ఏమిటి?
కార్తీక్ (నాగశౌర్య)ది వైజాగ్. విదేశాలు వెళ్లాలనే ప్లానులో ఉంటాడు. సరిగ్గా ఆ టైంలో డీఎస్పీ (సాయి కుమార్) కూతురు (విధి యాదవ్)తో పరిచయం అవుతుంది. ఇద్దరు ప్రేమలో పడతారు. తర్వాత సమస్యల్లో కూడా! అసలు వాళ్ళ సమస్యలకు కారణం ఏమిటో తెలుసుకోవాలని ట్రై చేస్తున్న టైంలో సిస్టర్ (శ్రీదేవి విజయ్ కుమార్) పెద్ద ప్రమాదంలో ఉందని తెలుస్తుంది. అక్కను కాపాడటం కోసం తమ్ముడు ఏం చేశాడు? బద్ద శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల నుంచి అక్కను, ఓ ఊరిని ఎలా కాపాడాడు? అనేది కథ అని తెలిసింది.

Also Read: Thimmarajupalli TV Twitter Review - 'తిమ్మరాజుపల్లి టీవీ' ట్విట్టర్ రివ్యూ: నిర్మాతగా కిరణ్ అబ్బవరం హిట్టు కొట్టాడా? ప్రీమియర్స్ టాక్ ఏంటి?

పక్కా కమర్షియల్ మీటర్‌లో కార్తీక్... కష్టమేనా!?
సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పక్కా కమర్షియల్ మీటర్‌లో 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సాగిందని తెలిసింది. లవ్ ట్రాక్ నుంచి కామెడీ సీన్స్ వరకు ఇప్పటికే పలు సినిమాల్లో చూసిన సూపర్ హిట్ ఫార్ములాను ఫాలో అవ్వడంతో రొటీన్ ఫిల్మ్ అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుందట.

Also Read: Prasad Behara: మీవి కన్నీళ్లు... నావి *చ్ఛ కాదు - పాపం ప్రసాద్ బెహరా, ఎమోషనల్ స్పీచ్ వెనుక కారణం ఏమిటంటే?

హీరోగా నాగశౌర్య మెరిసినప్పటికీ... యాక్షన్ సీన్లు వరకు బావున్నా, కథ అండ్ స్క్రీన్ ప్లేలో పట్టు లేకపోవడం మైనస్ అవుతుందని ఇన్ సైడ్ టాక్. యాక్షన్ సీక్వెన్స్, కొన్ని కామెడీ సీన్స్ బాగా తీశారట. సినిమా చూశాక నాని సూపర్ హిట్ సినిమా ఒకటి, ఆ మధ్య నితిన్ హీరోగా నటించిన ఫ్లాప్ మూవీ మరొకటి గుర్తుకు వచ్చే ఛాన్సులు ఎక్కువ అని టాలీవుడ్ టాక్. హ్యారీస్ జయరాజ్ సాంగ్స్ సౌండ్ చేయడం లేదు. అది మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి, ఈ సినిమా ఎంత వరకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే ఓపెనింగ్స్ రావడం కష్టంగా కనబడుతోంది.

Also Read: Purple Halcyon: ఇన్‌స్టాలో సబ్‌స్క్రిప్షన్‌తో నెలకు కోటి సంపాదించిన కేరళ కుట్టి... ఇప్పుడు ఏమైందో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

OM Movie OTT : ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ ఎంటర్టైనర్ O.M - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ ఎంటర్టైనర్ O.M - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
O.M Public Review : ధనుష్ 'ఓం' ట్విట్టర్ రివ్యూ : యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉంది?... పబ్లిక్ టాక్ ఏంటంటే?
ధనుష్ 'ఓం' ట్విట్టర్ రివ్యూ : యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉంది?... పబ్లిక్ టాక్ ఏంటంటే?
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Aakasamlo Oka Tara Public Review : ఆకాశంలో ఒక తార పబ్లిక్ రివ్యూ : భార్య కలను నిజం చేసిన భర్త... హార్ట్ టచింగ్ స్టోరీ... దుల్కర్ ఖాతాలో మరో హిట్?
ఆకాశంలో ఒక తార పబ్లిక్ రివ్యూ : భార్య కలను నిజం చేసిన భర్త... హార్ట్ టచింగ్ స్టోరీ... దుల్కర్ ఖాతాలో మరో హిట్?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Embed widget