నాగశౌర్య 'రంగబలి'కి ప్రీమియర్ షోస్ నుంచి ఫ్లాప్ టాక్ వచ్చింది. ఎందుకు? ఈ సినిమాలో ప్లస్, మైనస్‌లు ఏంటి?

కథ : తండ్రి ఆర్డర్ మేరకు విశాఖ వెళ్లిన శౌర్య (నాగశౌర్య), అక్కడ సహజ (యుక్తి తరేజ)తో ప్రేమలో పడతాడు. 

శౌర్యతో ప్రేమ పెళ్ళికి సహజ తండ్రి ముందు ఓకే చెబుతాడు. శౌర్యది రాజవరం ఊరిలో రంగబలి సెంటర్ అని తెలిశాక నో చెబుతాడు.  

రంగబలి సెంటర్ నేపథ్యం ఏమిటి? ప్రేమ కోసం మొదలైన శౌర్య ప్రయాణం చివరకు ఏ తీరానికి చేరింది? అనేది సినిమా.

ఎలా ఉంది? : కథ ఏమీ లేకుండా 'రంగబలి' ఫస్టాఫ్ నవ్విస్తుంది. ఆ క్రెడిట్ సత్యకి ఇవ్వాలి. 

ఇంటర్వెల్ తర్వాత 'రంగబలి' టెంపో మారింది. రెగ్యులర్ రొటీన్ సన్నివేశాలతో విసిగించింది.

నాగశౌర్యను కమర్షియల్ హీరోగా ఎలివేట్ చేసే ప్రయత్నం సినిమా అంతా చక్కగా కనిపించింది. ఆయన బాగా చేశారు. 

హీరోయిన్ యుక్తి ఓ పాటలో అందాల ప్రదర్శన చేశారు. ఆమె నటన సోసోగా ఉంది. మిగతా వాళ్ళవీ రొటీన్ క్యారెక్టర్లే. 

పాటలకు కథకు అడ్డు తగిలాయి. ట్యూన్లు, రీ రికార్డింగ్ అసలు బాలేదు. ప్రొడక్షన్ వేల్యూస్ ఓకే. 

'రంగబలి'కి వెళితే ప్రేక్షకులు బలి అవుతారు. వెళితే ఫస్టాఫ్ తర్వాత బయటకు రావడం మంచిది.